PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mallareddy-kcr381793da-e99d-41b3-bdb7-3ba5bb454b2f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mallareddy-kcr381793da-e99d-41b3-bdb7-3ba5bb454b2f-415x250-IndiaHerald.jpgకేటీఆర్ సీఎం కావాలని బలంగా వాయిస్ వినిపించిన వారిలో మంత్రి మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆయన పలు సభల్లో కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడారు.తాజా తెలంగాణ అసెంబ్లీలోనే మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి. కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి వద్దన్నారు. కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు మల్లారెడ్డి. mallareddy kcr;kcr;ktr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;cm;prime minister;chief minister;history;minister;central government;mantraసీఎంగా కేసీఆర్ వద్దు.. మంత్రి మల్లారెడ్డి సంచలనంసీఎంగా కేసీఆర్ వద్దు.. మంత్రి మల్లారెడ్డి సంచలనంmallareddy kcr;kcr;ktr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;cm;prime minister;chief minister;history;minister;central government;mantraThu, 25 Mar 2021 19:42:06 GMTతెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కొంత కాలంగా తెలంగాణ పాలనలో మార్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారనే చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ నేతలు కూడా పోటీ పడి మరీ కేటీఆర్ కు జై కొట్టారు. కొందరు మంత్రులు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని బహిరంగంగానే ప్రకటనలు చేశారు. కేటీఆర్ సీఎం కావాలని బలంగా వాయిస్ వినిపించిన వారిలో మంత్రి మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆయన పలు సభల్లో కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడారు.

తాజా తెలంగాణ అసెంబ్లీలోనే మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి. కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి వద్దన్నారు. కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు మల్లారెడ్డి. కేసీఆర్ ప్రధాని అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే దేశాన్ని కూడా ప్రగతిపథంలోకి తీసుకెళ్తారని చెప్పారు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రజలకు సమస్యలే ఉండవని పేర్కొన్నారు. దేశ చరిత్ర మారిపోతుందని మల్లారెడ్డి జ్యోస్యం చెప్పారు.

అసెంబ్లీలో మాట్లాడిన మల్లారెడ్డి.. కేంద్ర సర్కార్ విధానాలపై విమర్శలు చేస్తూ ఈ కామెంట్లు చేశారు. కేంద్రప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేస్తోందని మల్లారెడ్డి మండిపడ్డారు.కేంద్ర సర్కార్ విధానాలతో దేశం వెనకబడిపోతుందని చెప్పారు. 

గతంలో కేటీఆర్ ను సీఎం చేయాలని స్టేట్ మెంట్లు ఇచ్చిన మల్లారెడ్డి.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ను ప్రధానమంత్రిగా చూడాలని చెప్పడంతో ఆయన మాటలు చర్చగా మారాయి. తన వ్యాఖ్యల ద్వారా కేటీఆర్ ను సీఎం చేయాలని మంత్రి మల్లారెడ్డి మరోసారి చెప్పకనే చెప్పారని అంటున్నారు.  


ఇంద్రగంటికి ఆ స్టార్ హ్యాండ్ ఇచ్చేశాడుగా?

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>