PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-mptc-zptc-electionbe3cea1d-f20a-4822-a838-7f123611264c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-mptc-zptc-electionbe3cea1d-f20a-4822-a838-7f123611264c-415x250-IndiaHerald.jpgఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ నే కొనసాగిస్తున్నారని, ఈ స్థానిక ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. జనసేన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ap mptc zptc election;pawan;kumaar;pawan kalyan;andhra pradesh;janasena;congress;high court;local language;janasena party;reddy;partyమొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?ap mptc zptc election;pawan;kumaar;pawan kalyan;andhra pradesh;janasena;congress;high court;local language;janasena party;reddy;partyThu, 25 Mar 2021 17:33:23 GMTఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఎన్నికలను త్వరగా ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఆగిన దగ్గర నుంచే మొదలు పెట్టాలని , కేవలం ఆరు రోజుల్లోనే ఎన్నికలు ముగుస్తాయని సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. అయితే విపక్షాలు మాత్రం పరిషత్ ఎన్నికలను మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో పలు పిటీషన్లు దాఖలవుతున్నాయి.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ నే కొనసాగిస్తున్నారని, ఈ స్థానిక ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.  జనసేన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. జనసేన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఆదేశించింది. జనసేన అభ్యంతరాల పట్ల అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఎస్ఈసీని ఆదేశించాలని, అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఎంతో మారిపోయాయని, పాత నోటిఫికేషన్ తోనూ ఎన్నికలు నిర్వహించడం సబబు కాదని జనసేన తన పిటిషన్ లో పేర్కొంది.

లాక్ డౌన్ కు ముందు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, తమ నేతలను బెదిరించి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని జనసేనాని పవన్ కల్యాణ్ సైతం ఆరోపించారు. నామమాత్రంగా ఫిర్యాదులు స్వీకరించారే తప్ప చిత్తశుద్ధి లేదని, ఫిర్యాదుల వరకు న్యాయం చేస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెబుతున్నా ఆయన హామీ అమలవుతుందన్న నమ్మకం లేదని పవన్ పేర్కొన్నారు. అందుకే తాజా నోటిఫికేషన్ ఇస్తే తప్ప న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు.తెలుగు దేశం, కాంగ్రెస్ , బీజేపీత ో పాటు కమ్యూనిస్టులు కూడా పరిషత్ ఎన్నికలను మొదటి నుంచి చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఏపీ హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


నిజంగా పాపం పెద్ద పరీక్షే .... పాసవుతాడో లేదో మరి ....??

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్

మేము అసలు ఏ కేసు పెట్టలేదు... షాక్ ఇచ్చిన రాజధాని రైతులు, వీడియో విడుదల చేసిన టీడీపీ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>