MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jatiratnalue539d231-15d0-430a-9626-c729a952886d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jatiratnalue539d231-15d0-430a-9626-c729a952886d-415x250-IndiaHerald.jpgఎవరూ ఊహించని రీతిలో ‘జాతిరత్నాలు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భారీ వసూళ్లతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వేరే సినిమాలు రిలీజ్ అయినా.. రెండు రోజులపాటు జాతిరత్నాలు బీట్ చేసే సినిమా లేదంటే అందరికీ ఆశ్చర్యమే. ఏ సినిమా కూడా పోటీ ఇవ్వలేదు.jatiratnalu;nag ashwin;naveen polishetty;priyadarshi;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;varsha;k l rahul;cinema;naga aswin;media;television;anudeep kv;job;event;interview;industry;blockbuster hit;director;comedy;hero;rahul sipligunj;success;march‘జాతిరత్నాలు’ హిట్ వెనకాలా.. అసలు రహస్యం ఇదే..!‘జాతిరత్నాలు’ హిట్ వెనకాలా.. అసలు రహస్యం ఇదే..!jatiratnalu;nag ashwin;naveen polishetty;priyadarshi;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;varsha;k l rahul;cinema;naga aswin;media;television;anudeep kv;job;event;interview;industry;blockbuster hit;director;comedy;hero;rahul sipligunj;success;marchThu, 25 Mar 2021 08:00:00 GMTసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భారీ వసూళ్లతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వేరే సినిమాలు రిలీజ్ అయినా.. రెండు రోజులపాటు జాతిరత్నాలు బీట్ చేసే సినిమా లేదంటే అందరికీ ఆశ్చర్యమే. ఏ సినిమా కూడా పోటీ ఇవ్వలేదు. అయితే ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ దక్కించుకోవడానికి మీడియా ప్రమోషన్స్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించడం కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా జనాలకు కనెక్ట్ అయ్యే విధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ నిర్వహించింది.

ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్, షోలు, ఇంటర్వ్యూలలో పాల్గొనడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అలాగే సినిమా విడుదల అయ్యాక కూడా వరుస ఇంటర్వ్యూలు ఇవ్వటం, టీవీ షోలలో పాల్గొనటం చేశారు. దీంతో ఈ సినిమాకు మంచి ప్లస్ అయింది. అయితే సినిమా ప్రమోషన్ కోసం హీరో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి అమెరికాకు కూడా వెళ్లారు. రాహుల్ రామకృష్ణ మాత్రం ఇక్కడే ఉంటూ ప్రమోషన్ పనులను చూసుకున్నాడు. ఏది ఏమైనా జాతిరత్నాలు సినిమాకు ప్రమోషన్స్ ఎంతో మేలు చేశాయనే చెప్పుకోవచ్చు.

హీరోగా నవీన్‌ పొలిశెట్టి.. జాతి రత్నాలు సినిమాతో సక్సెస్ దక్కించుకున్నాడు. రిలీజ్‌ అయిన రోజు నుంచే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో జాతిరత్నాలు దూసుకుపోతోంది. దీంతో హీరో నవీన్ పొలిశెట్టి ఇండస్ట్రీ నిర్మాతలను, దర్శకులను తన వైపే చూసేలా ప్రయత్నిస్తున్నాడు. వరుస అవకాశాలతో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కలెక్షన్‌లతో షేక్ చేస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ జాతిరత్నాలు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాలో జాతిరత్నాలుగా నవీన్‌ పొలిశెట్టితో పాటు ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ఎంతో కామెడీ చేసి కడుపుబ్బా నవ్వించారు. జోగిపేటలో ఉంటూ చిల్లరగా తిరిగే ఈ ముగ్గురు జాబ్ కోసం హైదరాబాద్‌కు రావడం. అనుకోకుండా ఓ కేసులో బుక్ అవడం. వీరితోపాటు నటి ఫారియ అబ్దుల్లా కూడా కామెడీ చేయడం.. క్యూట్ స్మైల్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.


డాక్ట‌ర్ ఏపీజే అబ్దుల్‌క‌లాం ఆస్తి

హెరాల్డ్ సెటైర్ : ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన అద్యక్షుడు

పాలేరు: షర్మిళ ఆ నియోజకవర్గాన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు..?

ఈ స్టార్ డైరెక్టర్స్ ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన వాళ్లే..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యే దూకుడు తగ్గిందా?

రాజుగారు పవన్‌ని సెట్ చేసుకోవాల్సిందేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుందో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>