MoviesGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movies-latest-news-365dd4af-2fde-4963-a280-b1c6f1b3aa01-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movies-latest-news-365dd4af-2fde-4963-a280-b1c6f1b3aa01-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా సినిమా అన‌డం ఇప్పుడు ఫ్యాష‌నైపోయింది. బాహుబ‌లి విడుద‌లైన త‌ర్వాత ప్ర‌తిఒక్క‌రికీ, ప్ర‌తి భాష‌కీ, ప్ర‌తి క‌థానాయ‌కుడికీ.. అంద‌రికీ పాన్ ఇండియా సినిమా గురించే మాట్లాడుతున్నారుకానీ ఒక భాష‌కు ప‌రిమిత‌మైన సినిమా అని ఎవ‌రూ చెప్ప‌డంలేదు. భారీ బ‌డ్జెట్‌, భారీచిత్రం అంటూ భారీ ప్ర‌చారంతో హోరెత్తిస్తున్నారు. బాహుబలి’ తర్వాత ‘కేజీఎఫ్’ మినహాయిస్తే మరే సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. movies, latest news,;chiranjeevi;allu arjun;india;andhra pradesh;telangana;cinema;telugu;bahubali;saira narasimhareddy;kgf;arjun 1;vవాట్సాప్‌లో వీడియో పెట్టినా పాన్ ఇండియానేవాట్సాప్‌లో వీడియో పెట్టినా పాన్ ఇండియానేmovies, latest news,;chiranjeevi;allu arjun;india;andhra pradesh;telangana;cinema;telugu;bahubali;saira narasimhareddy;kgf;arjun 1;vThu, 25 Mar 2021 12:19:27 GMTఇండియా సినిమా అన‌డం ఇప్పుడు ఫ్యాష‌నైపోయింది. బాహుబ‌లి విడుద‌లైన త‌ర్వాత ప్ర‌తిఒక్క‌రికీ, ప్ర‌తి భాష‌కీ, ప్ర‌తి క‌థానాయ‌కుడికీ.. అంద‌రికీ పాన్ ఇండియా సినిమా గురించే మాట్లాడుతున్నారుకానీ ఒక భాష‌కు ప‌రిమిత‌మైన సినిమా అని ఎవ‌రూ చెప్ప‌డంలేదు. భారీ బ‌డ్జెట్‌, భారీచిత్రం అంటూ భారీ ప్ర‌చారంతో హోరెత్తిస్తున్నారు. బాహుబలి’ తర్వాత ‘కేజీఎఫ్’ మినహాయిస్తే మరే సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఏ సినిమాకి పాన్ ఇండియాక్రేజ్ రాలేదు. క‌థానాయ‌కుడితో సంబంధం లేకుండా  ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుడు తీస్తేనే అది పాన్ ఇండియా మూవీ అవుతుంది.

సైరా... రెండు తెలుగు రాష్ట్రాలే
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ మరో ‘బాహుబలి’ అవుతుందనుకున్నారు అంద‌రూ. ఏపీ, తెలంగాణ మిన‌హా ఎక్క‌డా దానికి ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. సైరా లాగేనే పాన్ ఇండియా అంటూ వ‌చ్చిన మ‌రెన్నో సినిమాలు బోల్తా కొట్టాయి. సినిమా స్థాయి చూసుకోకుండా ‘పాన్ ఇండియా’ రిలీజ్ అంటూ హంగామా చేస్తున్నారు. తాజాగా విడుద‌లైన మంచు విష్ణు సినిమా ‘మోసగాళ్ళు’ కూడా పాన్ ఇండియా రిలీజ్ అంటూ హడావిడి చేశారు కానీ ఆ చిత్రాన్నితెలుగులోనే ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. మిగ‌తా రాష్ట్రాల సంగ‌తి స‌రేస‌రి.

అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా అంటున్నాడు
ఎంత విడ్డూరం కాక‌పోతే విష్ణు తమ్ముడు మనోజ్ సైతం ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ అంటున్నారండి.  అల్లు అర్జున్ ‘పుష్ప’ సహా తెలుగులో ‘పాన్ ఇండియా’ బ్రాండుతో వస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ చిత్రాలకు జాతీయ‌స్థాయిలో విడుద‌ల‌య్యే స్థాయి ఉందా? అంటే క‌ష్ట‌మే. కొత్త‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చేవారు.. కొత్త‌గా సినిమా తీసేవారు.. ఇలా వీళ్లు కూడా పాన్ ఇండియా సినిమా అంటూ ప్ర‌క‌ట‌న‌లిస్తున్నారు. పాన్ ఇండియా అనే పేరు వింటేనే ఎందుకు ఇంత‌గా న‌వ్వొస్తోందంటూ అంద‌రూ అడుగుతున్నారు. క‌థ‌, క‌థ‌నాల‌ను న‌మ్ముకొని దానికిత‌గ్గ‌ట్లుగా క‌థానాయ‌కుల‌ను, క‌థానాయిక‌ల‌ను, ద‌ర్శ‌కుల‌ను ఎంచుకుంటే దానికి ఒక భారీత‌నం వ‌స్తుంది. వ‌స్తున్న ప్ర‌క‌ట‌న‌లన్నీ పాన్ ఇండియా అనే అంటున్నా తారాగ‌ణాన్నిబ‌ట్టి, ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌నుబ‌ట్టి అది పాన్ ఇండియానా?  పాన్ న‌మ‌ల‌డ‌మేనా? అనేది అర్థ‌మ‌వుతుంది.





గోరింటాకు హెయిర్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!

తిరుపతిలో టీడీపీ బ్రహ్మాస్త్రం..ఒక్క దెబ్బకు రెండు పిట్టలు...?

బాబు అప్పుడేమో అలా, ఇప్పుడిలా, సోము సంచలనం..

మణిశర్మ వల్లే ఆ సినిమా చేజారిపోయింది.. దేవిశ్రీ సంచలనం..!!

కాపు వేద‌న‌: కాపు వ‌ర్గానికి జ‌న‌సేన భ‌రోసా ల‌భించేనా ?

తొమ్మిదేళ్ల తర్వాత.. మళ్లీ అలా చేయబోతున్న పూజా హెగ్డే..?

జగన్ మరో బ్లండర్ చేస్తున్నారా..? శ్యామ్యూల్‌కి ఎస్‌ఈసీ ఎలా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>