Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ravindra-jadeja-requested-ms-dhoni-for-new-jersey-size4706555b-a3c6-47a3-a7fa-6c6f8fbbb9b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ravindra-jadeja-requested-ms-dhoni-for-new-jersey-size4706555b-a3c6-47a3-a7fa-6c6f8fbbb9b5-415x250-IndiaHerald.jpgమరో రెండు వారాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ ప్రారంభం కాబోతోంది. దీనికోసం ఆయా ప్రేక్షకులతో పాటు ఆయా జట్ల ఆటగాళ్లు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుంతా అని వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ..ms dhoni;jr ntr;yajamanya;ravindra jadeja;jersey;chennai;army;indian;kollu ravindraనాకు అది మాత్రమే కావాలి.. ధోనీని కోరిన జడేజా..!నాకు అది మాత్రమే కావాలి.. ధోనీని కోరిన జడేజా..!ms dhoni;jr ntr;yajamanya;ravindra jadeja;jersey;chennai;army;indian;kollu ravindraThu, 25 Mar 2021 21:24:29 GMTఇంటర్నెట్ డెస్క్: మరో రెండు వారాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ ప్రారంభం కాబోతోంది. దీనికోసం ఆయా ప్రేక్షకులతో పాటు ఆయా జట్ల ఆటగాళ్లు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుంతా అని వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొలిసారి గతేడాది దారుణ ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది ఎలాగైనా మునుపటి వైభవాన్ని పొందాలని కసిగా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కెప్టెన్ ఎంఎస్ ధోనీతో పాటు అంబటిరాయుడు వంటి ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలోనే చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా తాజాగా ధోనీని ఓ రిక్వెస్ట్ చేశాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

త్వరలో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్‌లో కొన్ని జట్టు కొత్తగా అడుగుపెట్టబోతున్నాయి. కొన్ని జట్లు పేర్లు మార్చుకోగా.. మరికొన్ని జట్లు జెర్సీల్లో మార్పులు చేస్తున్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే జెర్సీని వాడుతున్న చెన్నై జట్టు త్వరలో నూతన జెర్సీతో మైదానంలోకి దిగేందుకు రెడీ అవుతోంది. ఈ జెర్సీని తాజాగా ధోనీ ఆవిష్కరించగా ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన రవీంద్ర జడేజా సరదాగా ఓ కామెంట్ చేశాడు. ‘‘నాకు `ఎల్` సైజు జెర్సీ కావాలి ధోనీ భాయ్. తీసిపెట్టు’’ అంటూ తన కామెంట్లో పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే ఈ జెర్సీలో చేసిన మార్పుల్లో కొన్ని కీలకంగా బయటకొచ్చాయి. వాటిలో ప్రధానమైనది భుజాలపై ఇండియన్ ఆర్మీ దుస్తులను పోలిన రంగులను వినియోగించారు. ఇది ఈ జెర్సీకే హైలెట్ కానుంది. దేశం కోసం భారత జవాన్లు చేసే త్యాగాలకు గుర్తింపునివ్వాలనే ఉద్దేశంతోనే ఈ నూతన జెర్సీని రూపొందించినట్లు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో విశ్వనాథన్ వెల్లడించారు. మరి ఈ జెర్సీలో చెన్నై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.




ఆటోలో తమిళ్ నటుడు మృతి. దిగ్బ్రాంతిలో తమిళ్ ఇండస్ట్రీ.....

100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

మొదటి నుంచి పరిషత్ ఎన్నికలు?

రాజ్ తరుణ్ పై సమంత ఇంట్రెస్ట్.. కొత్తగా ఉందే..?

ఆటిజం చిన్నారుల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌`.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం

RX100 వల్ల కార్తికేయ కి అనుకోని కష్టం.. ఎవ్వరు రావట్లేదా..!!

సీతక్క వర్సెస్ తెరాస, సభలో హై హీట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>