PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-rammohan-and-atchanna-benfit-for-tdp8440fecb-6919-4dc9-8b3d-eeeb2efe70d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-rammohan-and-atchanna-benfit-for-tdp8440fecb-6919-4dc9-8b3d-eeeb2efe70d0-415x250-IndiaHerald.jpgఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్ దెబ్బకు ప్రతిపక్ష టీడీపీ చుక్కలు చూస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభావం వల్ల టీడీపీ పుంజుకోవడం విషయం పక్కనపెడితే బ్రతికి బట్టగలుగుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లోనే జగన్ వేవ్‌లో టీడీపీ కొట్టుకుపోయింది. ఇక పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో చెప్పాల్సిన పని లేదు. rammohan;prabhakar;prabhakar reddy;tiru;jagan;ram mohan naidu kinjarapu;andhra pradesh;chintamaneni prabhakar;cheque;tdp;ycp;parakala prabhakar;reddy;rajahmundryబాబాయి-అబ్బాయిలు పరువు పోగొట్టేస్తారా?బాబాయి-అబ్బాయిలు పరువు పోగొట్టేస్తారా?rammohan;prabhakar;prabhakar reddy;tiru;jagan;ram mohan naidu kinjarapu;andhra pradesh;chintamaneni prabhakar;cheque;tdp;ycp;parakala prabhakar;reddy;rajahmundryThu, 25 Mar 2021 03:00:00 GMTఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్ దెబ్బకు ప్రతిపక్ష టీడీపీ చుక్కలు చూస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభావం వల్ల టీడీపీ పుంజుకోవడం విషయం పక్కనపెడితే బ్రతికి బట్టగలుగుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లోనే జగన్ వేవ్‌లో టీడీపీ కొట్టుకుపోయింది. ఇక పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో చెప్పాల్సిన పని లేదు.

ఈ దెబ్బతో టీడీపీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. జగన్ దెబ్బకు టీడీపీ నేతలు చేతులెత్తేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క జేసీ ప్రభాకర్ రెడ్డి మినహా, మిగతా నాయకులు జగన్ ఇమేజ్ ముందు నిలబడలేకపోయారు. అయితే జగన్ వేవ్‌ని బాబాయి-అబ్బాయిలైన అచ్చెన్నాయుడు-రామ్మోహన్ నాయుడులు ఆపుతారా? జగన్‌కు చెక్ పెట్టి చంద్రబాబు పరువు నిలబెడతారా? అనేది చూడాలి.

ఏపీ టీడీపీలో ఈ ఇద్దరు కీలకంగా మారారు. వీరే పార్టీని నిలబెట్టేందుకు కష్టపడుతున్నారు. పంచాయితీ ఎన్నికల్లో కొంతమేర వైసీపీకి ఎదురు నిలబడగలిగారు. అయితే శ్రీకాకుళం కార్పొరేషన్ టీడీపీ ఖాతాలో పడేలా చేస్తే మాత్రం బాబాయ్-అబ్బాయ్‌లకు తిరుగులేదనే చెప్పాలి.
కొన్ని అనివార్య కారణాల వలన రాజమండ్రి, నెల్లూరు కార్పొరేషన్లతో పాటు శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే.  ఇక త్వరలోనే వీటికి కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రం మొత్తం వైసీపీ వేవ్ ఉంది. దీని బట్టి చూసుకుంటే శ్రీకాకుళం కార్పొరేషన్‌లో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే. కానీ బాబాయ్-అబ్బాయ్‌లని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కార్పొరేషన్‌లో వీరికి బలం ఎక్కువగానే ఉంది.

రాష్ట్రం మొత్తం వైసీపీ వేవ్ ఉన్నా సరే, అది శ్రీకాకుళం కార్పొరేషన్‌లో తగ్గించేయాలని ఈ ఇద్దరు నాయకులు తెగ కష్టపడుతున్నారు. అయితే అధికారంలో వైసీపీ గెలుపు ఆపడం చాలా కష్టం. పైగా జనాలకు జగన్ మీద విశ్వాసం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో బాబాయ్-అబ్బాయ్‌లు వైసీపీని ఢీకొట్టి శ్రీకాకుళం కార్పొరేషన్‌లో టీడీపీ జెండా ఎగరవేసి బాబు పరువు నిలబెడతారో లేదో చూడాలి.




హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుందో తెలుసా ?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>