BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/bhachalakura-face-packcbd6b551-a085-4ad3-a7af-f333a978f4ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/bhachalakura-face-packcbd6b551-a085-4ad3-a7af-f333a978f4ce-415x250-IndiaHerald.jpgబచ్చలి కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. కానీ మన అందరికీ తెలియని విషయం ఏమిటంటే.. బచ్చలికూర ముఖ సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తుంది. బచ్చలికూర లో విటమిన్ కె ,విటమిన్ ఏ ,విటమిన్ సి, విటమిన్ బి 1 ,విటమిన్ బి2, విటమిన్ బి6 ,మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, ఫోలేట్ ,మెగ్నీషియం ,పొటాషియం, ప్రోటీన్, భాస్వరం , జింక్ తో పాటు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.. bhachalakura,face,pack;vitamin c;vitamin a;iron;vitamin;manamబచ్చలికూర ఫేస్ ప్యాక్ గురించి ఎప్పుడైనా విన్నారా..?బచ్చలికూర ఫేస్ ప్యాక్ గురించి ఎప్పుడైనా విన్నారా..?bhachalakura,face,pack;vitamin c;vitamin a;iron;vitamin;manamWed, 24 Mar 2021 12:30:00 GMTబచ్చలి కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. కానీ మన అందరికీ తెలియని విషయం ఏమిటంటే.. బచ్చలికూర ముఖ సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తుంది. బచ్చలికూర లో విటమిన్ కె ,విటమిన్ ఏ ,విటమిన్ సి, విటమిన్ బి 1 ,విటమిన్ బి2, విటమిన్ బి6 ,మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, ఫోలేట్ ,మెగ్నీషియం ,పొటాషియం, ప్రోటీన్, భాస్వరం , జింక్ తో పాటు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి..


అంతేకాకుండా వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది ముఖం మీద మొటిమలు, మచ్చలు, వైట్ హెడ్, బ్లాక్ హెడ్స్ వంటివి తొలగిపోవడమే కాకుండా కమిలిపోయిన చర్మాన్ని కూడా తిరిగి తేజోవంతం చేస్తుంది.. అయితే ఇందుకోసం ఈ బచ్చలి కూర తో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం..


బచ్చలి కూర ఆకులు 15 నుంచి 20 తీసుకోవాలి. ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పాలు, ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకొని అన్నీ ఒక గిన్నెలో బాగా కలపాలి. అయితే కలిపే ముందు ఒకసారి బచ్చలికూర ఆకులను బాగా కడిగి, మెత్తగా రుబ్బుకుని పేస్టులాగా తయారు చేసుకోవాలి.. ఒక గిన్నెలో కొద్దిగా ఈ పేస్ట్ ను తీసుకొని ,అందులో మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మీరు ఈ పేస్ట్ ను ముఖానికి సమపాళ్లలో అప్లై చేసుకోవాలి.


ఇరవై నిమిషాలు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇలా చేయడం వల్ల ముఖం మీద ఉన్న మచ్చలు ,మొటిమలు తొలగిపోవడమే కాకుండా మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలిగిపోవడం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ ఫేస్ ప్యాక్ యాంటీ ఏజింగ్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ముడతలు కూడా త్వరగా మానిపోతాయి. అంతే కాకుండా ముఖం పొడిబారడం, తాజాదనం కోల్పోవడం వంటి సమస్యల నుండి కూడా బయట పడవచ్చు.


3251 మంది మృతి

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..

అమరావతికి జగన్ మరో షాక్ ఇచ్చారా...?

ఏపీ బీజేపీకి టెన్షన్ గా మారిన జనసేన..హ్యాండ్ ఇస్తారా, ఆ పరిణామం దేనికి సంకేతం ?

బిజెపికి దండం పెడుతున్న ఏపీ బీజేపి...?

బాలకృష్ణ చిరంజీవి సమస్యలకు బాలీవుడ్ బ్యూటీ పరిష్కారం !

ఏడేళ్ళలో మోడీ ఇన్ని అప్పులు చేశారా... వామ్మో...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>