PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pm-narendra-modi-vs-ap-cm-jagan-ea574fe1-e5c9-4893-94ea-fad15763e00e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pm-narendra-modi-vs-ap-cm-jagan-ea574fe1-e5c9-4893-94ea-fad15763e00e-415x250-IndiaHerald.jpgప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ డైరెక్ట్ ఫైట్ కి దిగుతున్నట్టు కనిపిస్తోంది. అటు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా సహా.. విశాఖ ఉక్కు తదితర అంశాలపై కేంద్రాన్ని ఆ పార్టీ ఎంపీలు నిలదీస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కేంద్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలకు వైసీపీ సర్కారు మద్దతునిస్తోంది. తాజాగా ఈనెల 26న భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతివ్వడం చర్చనీయాంశం అయింది. jagan, modi, bharat bund,;nani;poorna;delhi;bharatiya janata party;india;jagan;andhra pradesh;rtc;vishakapatnam;bus;bhuma akhila priya;prime minister;parliment;perni nani;minister;central government;ycp;partyమోదీతో డైరెక్ట్ ఫైట్ కి దిగుతున్న జగన్..మోదీతో డైరెక్ట్ ఫైట్ కి దిగుతున్న జగన్..jagan, modi, bharat bund,;nani;poorna;delhi;bharatiya janata party;india;jagan;andhra pradesh;rtc;vishakapatnam;bus;bhuma akhila priya;prime minister;parliment;perni nani;minister;central government;ycp;partyWed, 24 Mar 2021 09:00:00 GMTప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ డైరెక్ట్ ఫైట్ కి దిగుతున్నట్టు కనిపిస్తోంది. అటు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా సహా.. విశాఖ ఉక్కు తదితర అంశాలపై కేంద్రాన్ని ఆ పార్టీ ఎంపీలు నిలదీస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కేంద్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలకు వైసీపీ సర్కారు మద్దతునిస్తోంది. తాజాగా ఈనెల 26న భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతివ్వడం చర్చనీయాంశం అయింది.

కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఈనెల 26న అఖిల భారత సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతులు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు నిర్వహించబోతున్న భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. రైతులు, కార్మికులు చేసే ఆందోళనకు వైసీపీ సహా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈనెల 26న మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడే నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారాయన.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను సీఎం జగన్‌ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని మంత్రి నాని చెప్పారు. అటు రైతుల సమస్యలు పరిష్కరించాలని కూడా ఢిల్లీ వేదికపై వైసీపీ డిమాండ్ చేస్తున్న సంగతిని కూడా ఆయన గుర్తు చేశారు. బంద్‌ లో శాంతియుతంగా నిరసన తెలపాలని ప్రజలకు, వైసీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు మంత్రి.

కేంద్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న బంద్ లకు రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు తెలపడం అరుదు. ప్రతిపక్ష కూటమిలోని పార్టీల ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాలు మాత్రమే ఇలా కేంద్రానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో భాగం పంచుకుంటాయి. కానీ వైసీపీ ఇక్కడ బీజేపీ వ్యతిరేక కూటమిలో లేదు. అలాగని బీజేపీకి ఎక్కడా వత్తాసు పలికిన సందర్భం కూడా లేదు. అయితే అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకూ బీజేపీకి వ్యతిరేకంగా కూడా ఎక్కడా ఫైట్ చేయలేదు జగన్. కానీ రెండేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే జగన్ వైఖరిలో మార్పు స్పష్టంగా తెలుస్తోంది. అటు పార్లమెంట్ లో బీజేపీని ఇరుకున పెడుతూ, ఇటు రాష్ట్రంలో కూడా కేంద్రానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్నారు. 


మ‌నిష‌న్న‌త‌ర్వాత కొంచెమ‌న్నా ఉండాలి.. ఎన్నిసార్లు అడుగుతావేంటి?

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>