CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/krishna-district-crimede2b7cda-07f4-40a4-8990-e13225d28f2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/krishna-district-crimede2b7cda-07f4-40a4-8990-e13225d28f2a-415x250-IndiaHerald.jpgవేర్వేరు సంఘ‌ట‌న‌ల్లో న‌వ వ‌ధువులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన సంఘ‌ట‌న‌లు ఇవి. ఎన్నో క‌ల‌ల‌తో కాపురంలోకి అడుగుపెట్టిన వారికి అత్తింటివారి వేధింపులు న‌ర‌కం చూపాయి. పెళ్లైన మూడు నెల‌ల‌కే చావును కోరుకున్నారు. ఈ విషాద సంఘ‌ట‌న‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల పట్టణం మాల్దార్‌పేటకు చెందిన మనీషా (20)కు పట్టణంలోని చింతరుగు వీధికి చెందిన రాజేష్‌తో ఈ ఏడాది జనవరిలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.15 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇచ్చారు. అయినా అదనపు కట్నం తేవాలని మనీషాను భర్త వేధించడం మొదలు పెcrime;jeevitha rajaseskhar;prema;sahithi;andhra pradesh;police;marriage;love;husband;father;sakshi;nandyalaవేర్వేరు ఘ‌ట‌న‌ల్లో న‌వ వ‌ధువులా ఆత్మ‌హ‌త్య‌.... ఆ కార‌ణం చేతే..వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో న‌వ వ‌ధువులా ఆత్మ‌హ‌త్య‌.... ఆ కార‌ణం చేతే..crime;jeevitha rajaseskhar;prema;sahithi;andhra pradesh;police;marriage;love;husband;father;sakshi;nandyalaWed, 24 Mar 2021 08:30:00 GMTఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల పట్టణం మాల్దార్‌పేటకు చెందిన మనీషా (20)కు పట్టణంలోని చింతరుగు వీధికి చెందిన రాజేష్‌తో ఈ ఏడాది జనవరిలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.15 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇచ్చారు. అయినా అదనపు కట్నం తేవాలని మనీషాను భర్త వేధించడం మొదలు పెట్టాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన మనీషా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి మేనమామ ఫిర్యాదుతో మనీషా భర్త కుటుంబం పై పోలీసులు కేసు నమోదు చేశారు.


మ‌రో సంఘ‌ట‌న‌లో.. పెద్దలకు ఇష్టం లేకపోయినా ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి.. పెళ్ళైన 4 నెలలకే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏపీలో జరిగింది. సాక్షి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలికి చెందిన మరియదాసు అనే వ్యక్తి లాక్ డౌన్ కారణంగా కృష్ణాజిల్లా గుడివాడలో ఉంటున్నాడు. అతడి కుమారుడు గోపి(21) తన తండ్రి వద్దకు వచ్చి కొన్నాళ్లు ఇక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో పక్కింట్లో నివసించే పూర్ణకంటి సాహితి (18)ని ప్రేమించాడు. పెద్దలకు ఇష్టం లేకపోయినా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తన భార్యను కంచర్లపాలెం తీసుకెళ్లాడు. ఆదివారం రాత్రి ఆ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్తామామలే ఆమెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాహితికి ఇంకా మైనారిటీ తీరలేదని సమాచారం.



భారత ప్రభుత్వం గృహహింసని నేరంగా గుర్తించి గృహహింస నిరోధక చట్టం 2005ని తీసుకొచ్చింది. నేరం చేసిన వాళ్ళను దండించడం కాకుండా బాధితులకు (స్తీలకు) ఉపశమనం కల్పించేదిశగా ఈ చట్టం ఏర్పడింది. తన కుటుంబానికి సంబంధించినవారు, తన కుటుంబంలోని మగవారు జరిపే ఎటువంటి హింస నుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం ఏర్పాటు చేయటం జరిగింది.అంత కముందు వరకట్న వేధింపుల చట్టం (490ఎ) మాత్రమే ఉంది. వివిధ రకాలుగా గృహాల్లో వేధించబడి నిస్సహాయతకు గురైన మహిళకు అండగా నిలబడి న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించరన్నారు. మహిళలను శారీరకంగా, మానసికంగా హింసించడం, బాధించడం, కించపరచడం, ఆర్ధిక ఇబ్బందులు కలిగించడం, బెదిరించడం, దౌర్జన్యానికి పాల్పడటం ఇవన్నీ గృహహింస పరిధిలోకి వస్తాయి. దీనిపై అవ‌గాహ‌న లేకే చాలా మంది గృహిణులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతుండ‌టం బాధాకార‌మ‌ని సామాజిక విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.


సీఎం భార్యకు కరోనా! టీకా తీసుకున్నా వదలని వైరస్

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>