PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-strains-danzer0a37bb57-0a9a-4fcd-846d-b68f7d3abf6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-strains-danzer0a37bb57-0a9a-4fcd-846d-b68f7d3abf6a-415x250-IndiaHerald.jpgమార్చి 18 నాటికి దేశంలో 400గా ఉన్న కొత్త రకం కేసులు.. గత ఐదు రోజుల్లో దాదాపు రెట్టింపయ్యాయి. కొత్త రకం వైరస్ వ్యాప్తి మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త రకం స్టెయిన్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో ప్రజలు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.covid strains danzer;central government;international;march;coronavirusవామ్మో కరోనా..ఇంత డేంజరా! ఇంటినుంచి బయటికి వస్తే ఖతమేనా..వామ్మో కరోనా..ఇంత డేంజరా! ఇంటినుంచి బయటికి వస్తే ఖతమేనా..covid strains danzer;central government;international;march;coronavirusWed, 24 Mar 2021 19:51:13 GMTకరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తగ్గినట్లే తగ్గిన మహమ్మారి మళ్లీ విలయ తాండవం చేస్తోంది. కొన్ని రాష్ట్రాలు కరోనాతో అల్లాడిపోతున్నాయి. తాజా పరిస్థితులను పరిశీలిస్తున్న వైద్య నిపుణులు..దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చిందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా  కొత్తరకం స్ట్రెయిన్‌లతో కలవరం పెరుగుతోంది. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలి పోతున్నారు జనం. ప్రజల భయానికి తగ్గట్టే కేసుల సంఖ్యా భారీగా పెరుగుతోంది. అందులో అనేకం కొత్త రకం కరోనా వైరస్ వల్ల వచ్చినవే కావడం మరింత ఆందోళనకరం. మార్చి 18 నాటికి దేశంలో 400గా ఉన్న కొత్త రకం కేసులు.. గత ఐదు రోజుల్లో దాదాపు రెట్టింపయ్యాయి. కొత్త రకం వైరస్ వ్యాప్తి మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త రకం స్టెయిన్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో ప్రజలు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.  

ఇప్పటివరకు 18 రాష్ట్రాల్లో కొత్తరకం స్ట్రెయిన్‌లను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిలో విదేశాల్లో బయటపడిన కొత్తరకాలే కాకుండా మరిన్ని స్ట్రెయిన్‌లు ఉన్నట్లు వెల్లడించింది. విదేశాల నుంచి వస్తోన్న వారిలో పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 10,787 పాజిటివ్‌ శాంపిళ్లను కేంద్ర ఆరోగ్యశాఖ సేకరించి, పరీక్షించి విశ్లేషించింది. వీటిలో 736 శాంపిళ్లలో బ్రిటన్‌ రకం, 34 శాంపిళ్లలో దక్షిణ ఆఫ్రికా రకం, 1 శాంపిల్‌లో బ్రెజిల్‌ రకం స్టెయిన్ గుర్తించారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఇలాంటి కొత్త రకాలు స్టెయిన్‌లు కనిపించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. గత డిసెంబర్‌లో మహారాష్ట్రలో విశ్లేషించిన నమూనాలతో పోల్చి చూస్తే, కొత్త మ్యుటేషన్ల నమూనాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు కేంద్రం తెలిపింది. గతంలో గుర్తించిన మ్యుటేషన్‌ రకాలతో ఇవి సరిపోలడం లేవని.. రోగ నిరోధకతను తట్టుకొని వైరస్‌ తీవ్రత పెరుగుదలకు ఇలాంటి మ్యుటేషన్లు కారణమవుతాయని కేంద్రం అభిప్రాయపడింది.  

దేశంలో బుధవారం నమోదైన కేసులు నాలుగు నెలల గరిష్ఠానికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతర్జాతీయంగా ఆరు వారాలుగా తగ్గుతూ వచ్చిన కేసులు గత వారం రోజులుగా పెరుగుతున్నాయని వెల్లడించింది.




బడా ప్రాజెక్టులకు ఇక కలెక్షన్లు కష్టమే...?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>