PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mumbai-record-5-thousand-above-positive-cases-in-a-daydc2c1530-31d6-4dc7-91f1-ca40cccb7bf2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mumbai-record-5-thousand-above-positive-cases-in-a-daydc2c1530-31d6-4dc7-91f1-ca40cccb7bf2-415x250-IndiaHerald.jpgదేశంలో టాప్ 10 జిల్లాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని కేంద్రం బుధవారం ఓ జాబితాను విడుదల చేసింది.పుణె, నాగ్‌పూర్, ముంబై, థానే, నాసిక్, ఔరంగాబాద్, బెంగళూరు అర్బన్, నాందేడ్, జల్గాన్, అకోలా జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా పెరిగాయని పేర్కొంది.covid19;mumbai;thane;karnataka - bengaluru;capital;central government;aurangabad;coronavirus;panjaa10 జిల్లాల్లో కరోనా కల్లోలం.. ముంబైలో దారుణ పరిస్థితులు10 జిల్లాల్లో కరోనా కల్లోలం.. ముంబైలో దారుణ పరిస్థితులుcovid19;mumbai;thane;karnataka - bengaluru;capital;central government;aurangabad;coronavirus;panjaaWed, 24 Mar 2021 21:38:04 GMTకరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గినట్లు తగ్గి.. మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్టలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో అక్కడ దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మహారాష్ట రాజధాని ముంబైలో గత 24 గంటల్లో కొత్తగా 5185 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇంతటి స్థాయిలో  రోజువారి కేసుల నమోదవడం ఇదే తొలిసారి. ముంబైలో  మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,74,611కి చేరుకుంది.  యాక్టివ్ కేసుల సంఖ్య 30,760.  గత 24 గంటల్లో ఆరుగురు కరోనా కారణంగా మరణిచడంతో ముంబై నగరంలోని మొత్తం కరోనా మరణాల సంఖ్య 11606కి చేరుకుంది. మహారాష్ట్రలో కరోనా  కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

దేశంలో టాప్ 10 జిల్లాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని కేంద్రం బుధవారం ఓ జాబితాను విడుదల చేసింది.పుణె, నాగ్‌పూర్, ముంబై, థానే, నాసిక్, ఔరంగాబాద్, బెంగళూరు అర్బన్, నాందేడ్, జల్గాన్, అకోలా జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా పెరిగాయని పేర్కొంది. మహారాష్ట్రలో తొమ్మిది జిల్లాలు, కర్ణాటక రాష్ట్రంలో ఒక జిల్లాలో అధికంగా కరోనా కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

నలభై ఐదేళ్లకు పైబడిన వారే కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితమయ్యారని కేంద్రం తాజాగా పేర్కొంది. దేశంలో కరోనా కారణంగా మరణించిన వారిలో 88 శాతం 45 ఏళ్లకు పైబడిన వారేనని బుధవారం నాడు ప్రకటించింది. దేశంలో కరోనా సంక్షోభం తీరుతెన్నులపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు వివరాలను వెల్లడించింది. కరోనా రికవరీ రేటు 95.49 శాతానికి పెరిగింది.  మరణాల రేటు 1.36శాతంగా ఉంది. ఇప్పటివరకూ ప్రజలకు మొత్తం 5 కోట్లకు పైగా టీకా డోసులు వెశారు. అంతేకాకుండా.. 18 రాష్ట్రాల్లో కొత్త కరోనా స్ట్రెయిన్లకు సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనా నిబంధనల పట్ల ప్రజల నిర్లక్ష్యమే సంక్షోభం ముదరడానికి కారణమవుతోందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 


బాలయ్య, బోయపాటి సినిమాలో శ్రీకాంత్ రోల్ ఆదేనా..??

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>