MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/new-movies-are-suffering-with-big-problem-fbadb649-4495-4dcf-b87d-1446b7d0de2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/new-movies-are-suffering-with-big-problem-fbadb649-4495-4dcf-b87d-1446b7d0de2e-415x250-IndiaHerald.jpgసినిమాలకు కష్టకాలమే వచ్చింది. గతంలో మాదిరిగా బంపర్ హిట్లూ సూపర్ హిట్లూ అని రికార్డులు తిరేసుకునే రోజులు ఇప్పట్లో రావేమో అని కూడా చెప్పాలి. దానికి కారణం కరోనా. ఇపుడు సెకండ్ వేవ్ గట్టిగానే ఉంది. కరోనాతో గత ఏడాది వచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇపుడు చూస్తే నెమ్మదించింది అని అంతా తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించేశారు. చూస్తే సరిగ్గా గత ఏడాది అనుభవమే ఎదురుకాబోతోంది అంటున్నారు. movies;vidya;cinemaబడా ప్రాజెక్టులకు ఇక కలెక్షన్లు కష్టమే...?బడా ప్రాజెక్టులకు ఇక కలెక్షన్లు కష్టమే...?movies;vidya;cinemaWed, 24 Mar 2021 20:30:00 GMT
దానికి కారణం కరోనా. ఇపుడు సెకండ్ వేవ్ గట్టిగానే ఉంది. కరోనాతో గత ఏడాది వచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇపుడు చూస్తే నెమ్మదించింది అని అంతా తమ సినిమాల రిలీజ్ డేట్లను  ప్రకటించేశారు. చూస్తే సరిగ్గా గత ఏడాది అనుభవమే ఎదురుకాబోతోంది అంటున్నారు.

ముందు విద్యా సంస్థలు తెలంగాణా రాష్ట్రంలో మూసేశారు. ఇపుడు అందరి చూపూ సినిమా హాళ్ళ మీదనే ఉంది. విద్య వద్దు అన్న వారు వినోదాలకు ఎలా అనుమతులు ఇస్తారంటూ అపుడే తెలంగాణా సర్కార్ మీద వత్తిడి పెరిగిపోతోంది. దానికి తోడు సినిమా హాళ్ళలో ఎక్కడా కరోనా నిబంధనలను ఎవరూ పాటించడంలేదు. ఈ నేపధ్యంలో కరోనా సెకండ్ వేవ్ ని దృష్టిలో పెట్టుకుని సినిమా హాళ్ళను కూడా తొందరలోనే మూసేయాలని ఒక డిమాండ్ అయితే ఉంది. కానీ ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వం మీద అతి పెద్ద వత్తిడే వస్తోందిట. సినిమాలను బంద్ చేస్తే బడా ప్రాజెక్టుల సంగతేంటి అని బెంగతో పెద్దలంతా కలసి ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతున్నారని టాక్.

కానీ పాఠశాలలకు ఒక నీతి, సినిమాలకు మరో నీతి ఉండదు కదా. అందువల్ల పూర్తిగా మూసేయకపోయినా సగం ఆక్యుపేషన్ తో కరోనా నిబంధనలను పూర్తిగా పాటిస్తూ సినిమా హాళ్ళను  నడపాలని కోరే అవకాశం ఉంది అంటున్నరు. అదే కనుక జరిగితే బడా స్టార్ల సినిమాలకు పెద్ద ముప్పు వచ్చినట్లే. తమ సినిమా రికార్డులు బద్ధలు కొట్టాలని కలెక్షన్లు కుమ్మేయలని ఆశపడుతున్న వేళ సగం సగం ఆక్యుపెన్సీతో సినిమా రిలీజ్ చేస్తే ఏం లాభం అన్న ప్రశ్న కూడా ఉంది. మొత్తానికి కరోనా దెబ్బతో బడా సినిమాల రిలీజ్ ఆపుకుంటారా లేక బొమ్మ వదిలేసి దండం పెడతారా అన్నది చూడాలి అంటున్నారు.





కెజిఎఫ్ చాప్టర్ -2 డబ్బింగ్ షురూ .... వైరల్ అవుతున్న పిక్ ....??

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>