Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-franchises-cautious-on-injuries-in-first-one-daye28dfb27-d406-4dc8-b953-fcc96dfae8bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-franchises-cautious-on-injuries-in-first-one-daye28dfb27-d406-4dc8-b953-fcc96dfae8bc-415x250-IndiaHerald.jpg టీమిండియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన మొదటి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ టీమిండియా గెలిచినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నాయి. దీనికి కారణం టీమిండియా విజయం కాదు. ఆటగాళ్ల గాయాలు. ముఖ్యంగా ఐపీఎల్‌లో మూడు జట్లకు కెప్టెన్లుగా..ipl 2022;karthik;rohit;yajamanya;mumbai;delhi;audi;rohit sharma;india;bengaluru 1;shreyas iyer;april;indian;dinesh karthikగాయాలతో ముగ్గురు కెప్టెన్లు.. ఐపీఎల్ ఫ్రాంచైజీల గుండెల్లో రైళ్లుగాయాలతో ముగ్గురు కెప్టెన్లు.. ఐపీఎల్ ఫ్రాంచైజీల గుండెల్లో రైళ్లుipl 2022;karthik;rohit;yajamanya;mumbai;delhi;audi;rohit sharma;india;bengaluru 1;shreyas iyer;april;indian;dinesh karthikWed, 24 Mar 2021 23:04:23 GMTఇంటర్నెట్ డెస్క్: టీమిండియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన మొదటి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ టీమిండియా గెలిచినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నాయి. దీనికి కారణం టీమిండియా విజయం కాదు. ఆటగాళ్ల గాయాలు. ముఖ్యంగా ఐపీఎల్‌లో మూడు జట్లకు కెప్టెన్లుగా ఉన్న రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, ఇయాన్ మోర్గాన్‌లు భారీ గాయాలతో బాధపడుతుండడం ఆయా ఫ్రాంచైజీలకు గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయి.

ఐపీఎల్ 14వ సీజన్ వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనికోసం అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే ఇండియా-ఇంగ్లండ్ వన్డే సిరీస్‌లో భాగంగా నిన్న(మంగళవారం) జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు ఇంగ్లండ్ ఆటగాల్లు శామ్ బిల్లింగ్స్, ఇయాన్ మోర్గాన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ విషయమే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

రోహిత్ గాయంతో ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌లో కలకలం మొదలైంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ లేకపోతే జట్టును నడిపించేవారెవరని ఆందోళన చెందుతోంది. శ్రేయస్ అయ్యర్‌  ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. మునుపటి టోర్నీల్లో పేలవ ప్రదర్శనతో దారుణంగా విఫలమైన ఢిల్లీ జట్టు శ్రేయస్ కెప్టెన్సీలోనే గతేడాది ధాటిగా ఆడి ఫైనల్స్ చేరింది. అద్భుతంగా రాణిస్తోంది. కానీ ఇప్పుడు అతడు తీవ్ర గాయంతో జట్టుకే దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఢిల్లీ జట్టు తెగ హైరానా పడుతోంది. అతడు లేకపోతే నడిపించేదెవరని బెంబేలెత్తుతోంది.

వీరితో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. గతేడాది టోర్నీ మధ్య భాగం వరకు దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ వహించగా.. జట్టు దారుణంగా విఫలమైంది. దీంతో మధ్యలో కార్తీక్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మోర్గాన్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే ఇప్పుడు మోర్గాన్ గాయపడడంతో ఆ జట్టు యాజమాన్యం డైలమాలో పడింది. మోర్గాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటోంది.

మరి వీరంతా ఐపీఎల్ నాటికి పూర్తి ఫిట్‌నెస్‌తో వస్తారా..? లేక ఆయా ఫ్రాంచైజీలు ఆందోళన చెందినట్లే మ్యాచ్‌లకు దూరమవుతారా.. అనేది వేచి చూడాలి. కాగా.. ఏప్రిల్‌ 9న ప్రారంభంకాబోయే తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది.


‘పక్షపాతం మానుకోండి.. లేకపోతే..’ వీరూ ఆగ్రహం..

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>