PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shyamula141ad3f-bff1-4987-b7ee-407a9f18c878-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shyamula141ad3f-bff1-4987-b7ee-407a9f18c878-415x250-IndiaHerald.jpgరాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మైలాపల్లి శామ్యూల్‌ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఈ మేరకు ముగ్గురు పేర్లతో గవర్నర్కు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. కొత్త ఎస్‌ఈసీ కోసం గవర్నర్‌కు మూడు పేర్లు సిఫారసు చేసిన ప్రభుత్వం, నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లు సిఫారసు చేసింది.ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కొందరు సీనియర్‌ అధికారులతshyamul;cbn;amala akkineni;kumaar;andhra pradesh;chief minister;tdp;local language;ycpనిమ్మ‌గ‌డ్డ స్థానంలోకి వ‌చ్చేది అత‌డేనా...?నిమ్మ‌గ‌డ్డ స్థానంలోకి వ‌చ్చేది అత‌డేనా...?shyamul;cbn;amala akkineni;kumaar;andhra pradesh;chief minister;tdp;local language;ycpWed, 24 Mar 2021 09:00:00 GMT

ఇటీవల పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, నవరత్నాల పర్యవేక్షణ సలహాదారు శామ్యూల్‌, ఏపీ పునర్విభజన చట్టం అమలు బాధ్యతలు నిర్వహిస్తున్న రిటైర్డ్‌ అధికారి ఎల్‌.ప్రేమ్‌చంద్రారెడ్డి పేర్లను అందులో పొందుపరిచారు. ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశాలు ఉంటాయన్నదానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. సీఎం జగన్‌ మాత్రం శామ్యూల్‌ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో నియమించడం జరిగింది.కాగా నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తీసుకున్న చాలా నిర్ణయాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.


గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినప్పటి నుంచి ప్రభుత్వానికి, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. ఎంపీపీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో పలుచోట్ల ఏకగ్రీవాలు చెల్లవని నిమ్మగడ్డ తేల్చిచెప్పారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉన్నారని విమ‌ర్శ‌లు చేశారు. మొత్తానికి నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హారం ఓ స్థాయిలో రాజ‌కీయ దూమారంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న స్థానంలోకి ఎవ‌రు రాబోతున్నార‌నేది ఆస‌క్తిగా మారింది.




మ‌నిష‌న్న‌త‌ర్వాత కొంచెమ‌న్నా ఉండాలి.. ఎన్నిసార్లు అడుగుతావేంటి?

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>