Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/revenge-building458ca257-298d-4136-a69c-ef7aed7f5665-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/revenge-building458ca257-298d-4136-a69c-ef7aed7f5665-415x250-IndiaHerald.jpgఅన్నదమ్ముల మధ్య కోపతాపాలు.. ఆగ్రహావేశాలు సహజం. మరికొన్ని చోట్ల అవి పెరిగి పెద్దవై పగలు, కక్షలుగా మారుతుంటాయి. వాటిని తీర్చుకునేందుకు ఎంత దూరమైనా వెళుతుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ సోదరుడిపై రివెంజ్ తర్చుకునేందుకు మరో సోదురుడు కట్టిన కక్షపూరిత బిల్డింగ్ ఇది. ఈ భవంతి ఫోటో చూస్తే చాలు. అతడి పగ ఏ స్థాయిలో ఉందో అర్థం కావడానికి. సోదరుడికి బీచ్ వ్యూ కనిపించకూడదనే ఉద్దేశంతో తన బిల్డింగ్‌నే ..revenge building;shatru;lebanon;capital;beach;fatherఅన్నదమ్ముల సవాల్.. అనుకోని రివేంజ్.. 70 ఏళ్లుగా అంతే..అన్నదమ్ముల సవాల్.. అనుకోని రివేంజ్.. 70 ఏళ్లుగా అంతే..revenge building;shatru;lebanon;capital;beach;fatherWed, 24 Mar 2021 17:14:28 GMTఇంటర్నెట్ డెస్క్: అన్నదమ్ముల మధ్య కోపతాపాలు.. ఆగ్రహావేశాలు సహజం. మరికొన్ని చోట్ల అవి పెరిగి పెద్దవై పగలు, కక్షలుగా మారుతుంటాయి. వాటిని తీర్చుకునేందుకు ఎంత దూరమైనా వెళుతుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ సోదరుడిపై రివెంజ్ తర్చుకునేందుకు మరో సోదురుడు కట్టిన కక్షపూరిత బిల్డింగ్ ఇది. ఈ భవంతి ఫోటో చూస్తే చాలు. అతడి పగ ఏ స్థాయిలో ఉందో అర్థం కావడానికి. సోదరుడికి బీచ్ వ్యూ కనిపించకూడదనే ఉద్దేశంతో తన బిల్డింగ్‌నే అతడి భవంతికి అడ్డంగా కట్టేశాడు. అది కూడా కేవలం 2 అడుగుల వెడల్పుతో. అవును.. ఈ భవంతి ఓ వైపు 2 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇంతకీ అన్నదమ్ముల ఆగర్భ శతృత్వం ఎక్కడిదో తెలుసా..? లెబనాన్ లోనిది. అయితే బిల్డింగ్ కట్టి మరీ రివెంజ్ తీర్చుకోడానికి గల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఇద్దరు సహోదరులు తమ తండ్రి నుంచి కొంత జాగాను వారసత్వంగా పొందారు. ఒకరి జాగా ఎదురుగా సముద్రం ఉంటుంది. ఎదురుగా అంత మంచి వ్యూ ఉండటంతో సహజంగానే అతడి జాగాకు డిమాండ్ పెరిగి బాగా అభివృద్ధి చెందింది. ఈ పరిస్థితి మరో సోదరుడిలో కక్ష రగిల్చింది. ఆ కక్ష తీర్చుకునే ఉద్దేశంలో నుంచి పుట్టిందే ఈ బిల్డింగ్. తనది చిన్న జాగా అయినప్పటికీ ప్రతికారం తీర్చుకోవాలన్న పంతంతో అతడు ఇలాంటి విచిత్రమైన బిల్డింగ్ నిర్మించాడు. ఆ తరువాత ఈ బిల్డింగ్ ఎంతో మంది చేతులు మారింది. ఇప్పుడు అసలు కక్ష కట్టి ఈ బిల్డింగ్ నిర్మించిన సోదరుడు ఎవరో కూడా ప్రజలు మర్చిపోయాడు. అయితే ఆ బిల్డింగ్ వెనకున్న కథ మాత్రం జనాల నోళ్లలో ఇప్పటికీ ఉంటుంది.

ఈ మధ్యనే ఈ బిల్డింగ్ చూసిన ఓ ఆర్కిటెక్ట్ ఈ బిల్డింగ్ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే దీని చరిత్రను కూడా వివరించాడు. దీంతో ఈ బిల్డింగ్ మళ్లీ వైరల్ అవుతోంది. ప్రస్తుతం నెటిజన్లు ఇలాంటి మరిన్ని రివెంజ్ బిల్డింగ్‌ల ఫోటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా చోట్ల ఇలాంటి ప్రతీకారాలున్నాయని చెబుతున్నారు. అయితే ప్రపంచంలో ఎన్ని ప్రతీకార భవంతులున్నా.. ఈ స్థాయిలో ప్రతీకారం తీర్చుకోవడం మాత్రం కొంత విచిత్రమే. ఏమంటారు. ఇంతకీ ఈ బిల్డింగ్ ఎక్కడుందో చెప్పాను కాదు.. లెబనాన్ రాజధాని బీరుట్‌లో.

ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అత్యంత తక్కువ వెడల్పుతో ఉన్న బిల్డింగ్‌గా దీనికి పేరుంది. ఈ బిల్డింగ్ ఓ వైపు 14 అడుగుల వెడల్పు ఉన్న ఈ బిల్డింగ్.. మరో వైపు మాత్రం కేవలం 2 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. 1950లో ఈ బిల్డింగ్ కట్టారట. సోదరుడిపై పగ తీర్చుకునేందుకే ఇది నిర్మించాడట మరో సోదరుడు. అప్పట్లో లెబనాన్ అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ బిల్డింగ్‌ వేశ్యా గృహంగా ఉపయోగపడిందట.


తల్లిని సరిగ్గా చూసుకోని భార్య.. భర్త ఏం చేసాడో తెలుసా..?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>