Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/swetha-shettyc1565288-bba0-4b04-9fa6-ee81daa5b7e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/swetha-shettyc1565288-bba0-4b04-9fa6-ee81daa5b7e1-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో తన అందం, అభినయంతో విశేష ప్రజాదరణ పొందిన నటి నందితా శ్వేత. ఈమె అసలు పేరు శ్వేత శెట్టి.ఈ బెంగళూరు బ్యూటీ నిఖిల్ హీరోగా నటించిన "ఎక్కడికి పోతావు చిన్నవాడా" సినిమాతో తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ మూవీలో హీరోయిన్ గా నందితా శ్వేత మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా హర్రర్ సన్నివేశాల్లో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమా సరైన విజయం సాధించలేకపోవడంతో హీరోయిన్ గా కాస్త వెనక పడ్డారు. తర్వాత శ్రీనివాస కళ్యాణం ,ప్రేమాకథ చిత్ర,దేవి 2, అభినేతswetha shetty;beauty;abinaya;nanditha;nanditha swetha;sethu;suma;suma kanakala;sumanth;swetha;vijay;vijay sethupathi;cinema;telugu;vijay kumar naidu;tamil;kannada;february;chennai;comedy;horror;thriller;husband;girl;letter;heroine;joseph vijay;march;ekkadiki pothavu chinnavada;chitramవరుసగా హోమ్లీ పాత్రల్లో నటించడం వల్లే అవకాశాలు రాలేదు అంటున్న కన్నడ బ్యూటీ..!!వరుసగా హోమ్లీ పాత్రల్లో నటించడం వల్లే అవకాశాలు రాలేదు అంటున్న కన్నడ బ్యూటీ..!!swetha shetty;beauty;abinaya;nanditha;nanditha swetha;sethu;suma;suma kanakala;sumanth;swetha;vijay;vijay sethupathi;cinema;telugu;vijay kumar naidu;tamil;kannada;february;chennai;comedy;horror;thriller;husband;girl;letter;heroine;joseph vijay;march;ekkadiki pothavu chinnavada;chitramWed, 24 Mar 2021 02:00:00 GMTశ్వేత శెట్టి.ఈ బెంగళూరు బ్యూటీ  నిఖిల్ హీరోగా నటించిన "ఎక్కడికి పోతావు చిన్నవాడా" సినిమాతో తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ మూవీలో హీరోయిన్ గా నందితా శ్వేత మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా హర్రర్ సన్నివేశాల్లో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమా సరైన విజయం సాధించలేకపోవడంతో హీరోయిన్ గా కాస్త వెనక పడ్డారు. తర్వాత శ్రీనివాస కళ్యాణం    ,ప్రేమాకథ చిత్ర,దేవి 2, అభినేత్రి 7  కల్కి వంటీ  విజయవంతమైన సినిమాల్లో స్కోప్ ఉన్న సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో అద్భుతంగా నటించింది ఈ ముద్దుగుమ్మ.

హీరోయిన్ నందిత శ్వేత తమిళ,తెలుగు,కన్నడ చిత్రాలలో నటించింది. ఈమె మొదట ఉదయ మ్యూజిక్‌ ఛానల్ లో వీజేగా తన కెరీర్ ను ప్రారంభించి తన అద్భుత ప్రతిభతో 2008లో కన్నడ చిత్రం "నంద లవ్స్"ద్వారా హీరోయిన్గా ఎంపికైంది. ఈ మూవీలో ఆమె పాత్రకు నందిత అని పేరు ఉండడంతో ఆ పాత్ర ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించడంతో అప్పటి నుంచి నందిత శ్వేతా గా గుర్తింపు పొందింది.తరువాత తమిళంలో వచ్చిన "అట్టకతి" అనే కామెడీ చిత్రంలో నటించింది. ఇదర్కుతనే ఆసైపట్టై బాలకుమార అనే హాస్య చిత్రంలో విజయ్ సేతుపతి పక్కన చెన్నై అమ్మాయి కుముత పాత్రలో నటించింది. ఇక తెలుగులో వచ్చిన "ఎక్కడికి పోతావు చిన్నవాడా" మూవీ తెలుగులో ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది.

తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడి 2021 ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు థ్రిల్లర్ సినిమా "కపటధారి"మూవీలో సుమంత్ కు జోడిగా అద్భుతంగా నటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాలవల్ల సరైన ఫలితం దక్కలేదు.తాజాగా నందితా శ్వేత ప్రధాన పాత్ర పోషించి భారీ అంచనాలతో తీసిన  సోషల్ మెసేజ్‌‌తో కూడిన కామెడీ థ్రిల్లర్‌మూవీ "అక్షర ఇందులో నందిత శ్వేత టైటిల్ రోల్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించే గలిగింది. అయితే ఈ మూవీ బాక్సాపీస్ వద్ద కమర్షియల్ హిట్ అందుకోలేకపోయింది. దీంతో ఈ అమ్మడుకు
తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు లేక రూటు మార్చి గ్లామర్ పాత్రల్లో నటించడానికి సిద్ధమంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటో షూట్‌లు నిర్వహించి వాటిని మీడియాలో షేర్‌ చేస్తోంది. ఇప్పటివరకు కేవలం హోమ్లీ పాత్రల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇక గ్లామర్ పాత్రల్లో ఏ మేరకు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుందో చూడాలి మరి.


ఆ టీడీపీ ఎమ్మెల్యేలని జగన్ ఫిక్స్ చేసేశారా?

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>