PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/apsrtc-in-revenue-hike-after-corona-effectfe546aad-3159-455d-9f1d-da5739ceb633-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/apsrtc-in-revenue-hike-after-corona-effectfe546aad-3159-455d-9f1d-da5739ceb633-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉద్య‌మానికి క్ర‌మంగా మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఇప్ప‌టికే రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ ఒక్క తాటి పైకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌తో సహా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయరాదని, మూడు వ్యవసాయ నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 26న చేపట్టే భారత్‌ బంద్‌ను జయప్రదంచేయాలని దేశ వ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది. ఈక్ర‌మంలోనేవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, కొత్త సాగు చట్టాలకు నిరసనగా ఈనెల 26వ తేదీన విశాఖ కార్మిక సంఘాలు rtc;nani;jayaprada;india;andhra pradesh;telangana;rtc;vundavalli aruna kumar;mp;vishakapatnam;bus;perni nani;minister;central government;ycp;jacఆ రోజున ఏపీలో ఆర్టీసీ సేవ‌లు బంద్‌..ఎందుకంటే..?ఆ రోజున ఏపీలో ఆర్టీసీ సేవ‌లు బంద్‌..ఎందుకంటే..?rtc;nani;jayaprada;india;andhra pradesh;telangana;rtc;vundavalli aruna kumar;mp;vishakapatnam;bus;perni nani;minister;central government;ycp;jacWed, 24 Mar 2021 07:00:00 GMTవిశాఖ ఉద్య‌మానికి క్ర‌మంగా మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఇప్ప‌టికే రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ ఒక్క తాటి పైకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌తో సహా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయరాదని, మూడు వ్యవసాయ నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 26న చేపట్టే భారత్‌ బంద్‌ను జయప్రదంచేయాలని దేశ వ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది. ఈక్ర‌మంలోనేవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, కొత్త సాగు చట్టాలకు నిరసనగా ఈనెల 26వ తేదీన విశాఖ కార్మిక సంఘాలు పిలుపు నిచ్చిన భారత్ బంద్ కు ఏపీ సర్కారు మద్దతు ప్రకటించింది.

ఇందులో భాగంగా 26వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతాంగ, ఉక్కు ఉద్యమాలకు వైసీపీ మద్దతు ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే, నిరసనలు శాంతియుతంగా నిర్వహించాలని నాయ‌కులు భావిస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ ఏకమై దేశంలో జరుగుతున్న ఈ ప్రైవేటీకరణలను వ్యతిరేకించాలని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు.  కమ్యూనిస్టు నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిరసన ఉద్యమంలో భాగంగా పిలుపునిచ్చిన భారత్ బంద్ కు సహకరించాలని ఉండవల్లిని కలిసి విన్నవించారు. ఆరోజున అటు తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు నడవవు. ఏపీలో తెలంగాణకు ఏపీ బస్సులు రోడ్డెక్కవని తెలుస్తోంది.


ఇదిలా ఉండ‌గా కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలన్నదే ప్రధాన డిమాండ్‌గా దిల్లీలో నెలల తరబడి జరుగుతున్న రైతుల పోరాటం భారత్‌ బంద్‌ అనంతరం ఉగ్రరూపం దాల్చనున్నదని పోరాట సమితి సంచాలకుడు చంద్రశేఖర్‌ గొరెబాళ్‌ చెప్పారు. ఇకపై దిల్లీ రైతుల పోరాటం దేశవ్యాప్తం కానుందని తెలిపారు. దిల్లీలో ఏరోజు ఎటువంటి పోరాటం జరుగుతుందో అదే సమయంలో దేశవ్యాప్తంగా జరుగుతుందని వివరించారు. దీనికోసం దేశం అతటా కిసాన్‌ పంచాయత్‌ (పోరాట శాఖలు) ఏర్పడుతాయని, సింధనూరులో కూడా కిసాన్‌ పంచాయత్‌ నెలకొల్పనున్నట్లు చెప్పారు.




కాపు వేద‌న‌: తాజా వ్యూహంతో జ‌న‌సేన‌కు గ్రాఫ్ పెరిగేనా ?

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>