Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli-comments-on-win-against-england-in-1st-one-day-internatioal5e331b12-0c5f-4969-b54d-7c5c557c525b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli-comments-on-win-against-england-in-1st-one-day-internatioal5e331b12-0c5f-4969-b54d-7c5c557c525b-415x250-IndiaHerald.jpg ఇప్పటికే టెస్ట్, టీ20 సిరీస్‌లలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. తొలి వన్డేలో చారిత్రక విజయం సాధించి ముందుడుగు వేసింది. కాగా ఈ విజయంపై కోహ్లీ స్పందించాడు. ఇప్పటివరకు తాము గెలిచిన అన్ని మ్యాచ్‌లలో ఇదే ప్రత్యేకమైందని అన్నాడు. అంతేకాకుండా, జట్టులోని ఆటగాళ్లను పేరుపేరున..kl rahul;johnny;rahul new;rahul;rani;vainavi;virat kohli;k l rahul;rahul sipligunj;icc t20;johnny1;anandam;parugu‘వాళ్లు నమ్మకం నిలబెట్టారు.. ఈ గెలుపు ప్రత్యేకం’‘వాళ్లు నమ్మకం నిలబెట్టారు.. ఈ గెలుపు ప్రత్యేకం’kl rahul;johnny;rahul new;rahul;rani;vainavi;virat kohli;k l rahul;rahul sipligunj;icc t20;johnny1;anandam;paruguWed, 24 Mar 2021 18:28:00 GMTఇంటన్నెట్ డెస్క్: ఇప్పటికే టెస్ట్, టీ20 సిరీస్‌లలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. తొలి వన్డేలో చారిత్రక విజయం సాధించి ముందుడుగు వేసింది. కాగా ఈ విజయంపై కోహ్లీ స్పందించాడు. ఇప్పటివరకు తాము గెలిచిన అన్ని మ్యాచ్‌లలో ఇదే ప్రత్యేకమైందని అన్నాడు. అంతేకాకుండా, జట్టులోని ఆటగాళ్లను పేరుపేరున గుర్తు చేసుకున్నాడు. తామ ఆటగాళ్లు తిరిగి పుంజుకోవడం ఆనందంగా ఉందని, వారిపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబెట్టారని అన్నాడు.

‘ఇంగ్లండ్‌పై తొలి వన్డేలో సాధించిన విజయం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ మధ్య కాలంలో ఇదే గొప్ప విజయం. మ‌రే గెలుపూ దీనికి సాటి రాద‌ు. ఈ విజయం తనకు ఎంతో గర్వంగా ఉంది. శిఖ‌ర్ ధవ‌న్, కేఎల్ రాహుల్‌ నమ్మకాన్ని నిలబెట్టారు. అద్భుతంగా రాణించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించార’ని కోహ్లీ పేర్కొన్నాడు. అంతేకాకుండా ధవన్ ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉంటాడని, అతడిలో అదే తనకు నచ్చుతుందని అన్నాడు. ‘తుది జట్టులో చోటు లభించకపోయినా ధవన్ చాలా ఉత్సాహంగా ఉంటాడు. ఎప్పుడూ నిరాశ చెందడు. అతడి ఆటతీరుపై పూర్తి నమ్మకం ఉంది. నిజానికి నిన్న ధవ‌న్ చేసిన 98 పరుగులు చాలా విలువైనవి. స్కోరు బోర్డులో కనిపించిన అంకెల కంటే వాటి విలువ ఎన్నో రెట్లు ఎక్కువ’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇక రాహుల్‌ తన ఫామ్‌ను తిరిగి సంపాదించుకోగలడనే నమ్మకం ఉందని, అందుకే వన్డేల్లో అతడిని మళ్లీ తీసుకున్నామని కోహ్లీ చెప్పాడు. అతడిపై పెట్టుకున్న నమ్మకం నిలబెట్టాడని, టీమిండియాకు అవసరమైనపుడు విలువైన పరుగులు చేశాడని విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. టీమిండియాలో అందరూ అద్భుతంగా రాణిస్తున్నారని అభినందించాడు.

ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 317 పరుగులు భారీ స్కోరు చేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్(98) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నా.. విలువైన పరుగులు చేశాడు. కోహ్లీ కూడా అర్థ సెంచరీతో రాణించాడు. చివర్లో రాహుల్(62) క్లాసికల్ ఇన్నింగ్స్‌కు తోడు కృనాల్ పాండ్యా(58) చెలరేగడంతో చివరి 10 ఓవర్లలో ఏకంగా 115కు పైగా పరుగులు వచ్చాయి.
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు అద్భుతమైన ఓపెనింగ్ దక్కింది. జేసన్ రాయ్(46), జానీ బెయిర్ స్టో(94) బౌండరీల మోత మోగించారు. కానీ వారిద్దరి తరువాత మరెవ్వరూ కనీస పోరాటం చూపలేకపోయారు. 42.1 ఓవర్లలోనే ఆలౌటై మ్యాచ్ చేజార్చుకున్నారు. దీంతో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయం సాధించడమే కాకుండా సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది.


మహేష్ డైరెక్టర్ తో రవి తేజ మూవీ ఫిక్స్?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>