PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-targets-vijayasaireddy-on-ramateerdham31d2ecb1-35d4-40c7-bc49-0e45feef845e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-targets-vijayasaireddy-on-ramateerdham31d2ecb1-35d4-40c7-bc49-0e45feef845e-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కుపై పునఃపరిశీలన చేయండి అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేసారు. ఆంధ్రుల సుదీర్ఘ పోరాటాలు, ఆత్మబలిదానాలతో అవతరించిన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రాజ్యసభలో ఆయన కోరారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌ కు విజ్ఞప్తి చేశారు. ఫైనాన్స్‌ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. ప్రైవేటైజేషన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు, ఉద్యోగులు ఇప్పటికి 40 రోజులుగా ఆందోళన చేసvijaysai,ycp,ap;v vijayasai reddy;mp;steel plant;vishakapatnam;minister;central government;ycp;international;reddyనిర్మలమ్మకు విజయసాయి రిక్వస్ట్నిర్మలమ్మకు విజయసాయి రిక్వస్ట్vijaysai,ycp,ap;v vijayasai reddy;mp;steel plant;vishakapatnam;minister;central government;ycp;international;reddyWed, 24 Mar 2021 19:00:00 GMTవిశాఖ ఉక్కుపై పునఃపరిశీలన చేయండి అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేసారు. ఆంధ్రుల సుదీర్ఘ పోరాటాలు, ఆత్మబలిదానాలతో అవతరించిన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రాజ్యసభలో ఆయన కోరారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌ కు విజ్ఞప్తి చేశారు. ఫైనాన్స్‌ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. ప్రైవేటైజేషన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు, ఉద్యోగులు ఇప్పటికి 40 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం శోచనీయం అని ఆయన పేర్కొన్నారు.

వాస్తవానికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ 2002 నుంచి 2015 వరకు లాభాల్లో నడిచింది అని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాతే నష్టాల్లోకి వచ్చింది అని తెలిపారు. అందుకు రెండు బలమైన కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకునేందుకు స్టీల్‌ ప్లాంట్‌ పెద్ద ఎత్తున విస్తరణను చేపట్టింది అని వెల్లడించారు. అందుకోసం పెద్ద మొత్తాలలో రుణాలను సేకరించింది అని,  అదే సమయంలో అంతర్జాతీయంగా స్టీల్‌ మార్కెట్‌లో ఏర్పడిన ఒడిదుడుకుల కారణంగా నష్టాలపాలైంది అని ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత ఇనుప ఖనిజం గనులు లేనందున ముడి ఖనిజాన్ని మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేయవలసి వస్తోంది అని అన్నారు.

నష్టాలకు ఇదో ప్రధాన కారణం. కేవలం కొన్ని సంవత్సరాల నష్టాలను సాకుగా చూపిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించడం సమంజసం కాదు అని ఆయన వెల్లడించారు. నష్టాల నుంచి గట్టెక్కించి స్టీల్‌ ప్లాంట్‌ తిరిగి లాభాల బాట పట్టడానికి అవసరమైన పునఃవ్యవస్థీకరణ, పునరుద్దరణ, పునరుజ్జీవనం వంటి చర్యలను చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత ఇనుప ఖనిజం గనులను కేటాయించాలి అని కోరారు. కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే గనులు కేటాయించడం అసాధ్యమేమీ కాదు అన్నారు ఆయన. 14 శాతం వడ్డీతో స్టీల్‌ ప్లాంట్‌ తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీ రేటుకు మార్పిడి చేయాలి అని కోరారు.


ఏపీలో మరో ఎన్నికలకు జగన్ రెడీ...?

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>