PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telanagana-schools-closec9418ab6-83a0-4c4f-89c2-0a3911d123de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telanagana-schools-closec9418ab6-83a0-4c4f-89c2-0a3911d123de-415x250-IndiaHerald.jpgతెలంగాణలో విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేసింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి అన్ని విద్యాసంస్థలు మూసివేసింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వ నిర్ణించింది. ఈ మేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. వైద్య కళాశాలలు మినహా అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున విద్యాసంస్థలు మూసివేస్తున్నామన్నారు. గురుకులాలు, అన్ని వసతి గృహాలు మూసివేస్తున్నామన్నారు సబితా ఇంద్రారెడ్డి. అయితే.. ఆన్‌లైన్‌ తరగతులు telanagana-schools-close;bala;andhra pradesh;september;minister;nijamతెలంగాణలో విద్యాసంస్థల మూతపై ఆలోచింపజేసే పోస్ట్..?తెలంగాణలో విద్యాసంస్థల మూతపై ఆలోచింపజేసే పోస్ట్..?telanagana-schools-close;bala;andhra pradesh;september;minister;nijamWed, 24 Mar 2021 08:00:00 GMTమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. వైద్య కళాశాలలు మినహా అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున విద్యాసంస్థలు మూసివేస్తున్నామన్నారు.


గురుకులాలు, అన్ని వసతి గృహాలు మూసివేస్తున్నామన్నారు సబితా ఇంద్రారెడ్డి. అయితే.. ఆన్‌లైన్‌ తరగతులు యథాతథంగా ఉండొచ్చని తెలిపారు. కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలు మూసివేశాయని విద్యాశాఖ తెలిపింది. విద్యార్థుల సంక్షేమం కోసం విద్యాసంస్థలు మూసివేస్తున్నామని.. కరోనా కట్టడి చర్యలకు ప్రజలు సహకరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.


అయితే.. విద్యాసంస్థల మూతపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఆలోచింపజేస్తోంది. అదేంటంటే..

విద్యావంతులారా! .. మేధావుల్లారా! ప్రైవేట్ ఉపాధ్యాయుల్లారా! ఒక్కసారి ఆలోచీంచండి.. పిబ్రవరి 1st కి స్కూల్స్ రీఓపెన్ చేయమన్నదీ ఎవరు? ఇప్పుడు బంద్ చేయిమన్నది ఎవరు ..మార్చిలో వచ్చిన MLC ఎలక్షనా?  ఆ ఎలక్షన్ లో ఓట్లు వేయిస్తరనుకునే పాఠశాలల మేనేజ్ మెంట్లా..  ఈ విద్యా సంవత్సరం లో నిజంగా నష్ట పోయింది ఎవరు?  3 లక్షల ప్రైవేట్ టీచర్ల కుటుంబాలా.. 12 వేల పాఠశాలల యాజమాన్యాలా .. ఆలోచించండి.
 

బడి, కళాశాలలు నడిచింది కేవలం నెల ఇరవై రోజులే... కాని మేనేజ్ మెంట్లకు 80% ఫీజులు వసులైనవి. టీచర్లకు మాత్రం సగం నెల జీతమే  వచ్చింది. మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ లోనే పాఠశాలలు ప్రారంభమైనవి. మరి అక్కడ మనకంటె రెట్టింపు కరోనా కేసులు పెరగాలి కదామరి ఎందుకు పెరగలేదు ? పాఠశాలలు, క్లాసులు బంద్ చేయాలి అని ప్రజలు ఎందుకు అడగలేదు. ఎందుకంటే అక్కడ పట్టభద్రుల ఎన్నికలు లేవు.


ఈ విద్యాసంవత్సరంలో నష్టపోయింది ప్రైవేట్ టీచర్లా? మేనేజ్ మెంట్లా? ఎవరి బాగుకోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది.  పాఠశాలలనే నమ్ముకున్న ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి? వారి జీవితాలు నాశనమైపోవలసిందేనా? వారి గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన పనిలేదా? ఆలోచించండి.. విజ్ఞులారా..




కాపు వేద‌న‌: తాజా వ్యూహంతో జ‌న‌సేన‌కు గ్రాఫ్ పెరిగేనా ?

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>