MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thaman289e1c3a-1bb0-4d40-972d-28b8d64d908b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thaman289e1c3a-1bb0-4d40-972d-28b8d64d908b-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా ద్వారా తొలిసారిగా ఆయన సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ కోర్టు డ్రామా మూవీ లో అంజలి, నివేదాథామస్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ పీఎస్ వినోద్ కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక లాయర్ పాత్ర చేస్తుండగా ఆయనకు పోటీగా వాదించే లాయర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తుpawan-kalyan;ss-thaman;pawan;prakash raj;shruti haasan;anjali;geetha;kalyan;pawan kalyan;raj;santoshi;thaman s;cinema;sangeetha;media;director;hero;heroine;successఆడియన్ గా ఆనందించా ... అభిమానిగా ఎగిరి గంతేశా ....??ఆడియన్ గా ఆనందించా ... అభిమానిగా ఎగిరి గంతేశా ....??pawan-kalyan;ss-thaman;pawan;prakash raj;shruti haasan;anjali;geetha;kalyan;pawan kalyan;raj;santoshi;thaman s;cinema;sangeetha;media;director;hero;heroine;successWed, 24 Mar 2021 22:15:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా ద్వారా తొలిసారిగా ఆయన సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. శృతిహాసన్  హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ కోర్టు డ్రామా మూవీ లో అంజలి, నివేదాథామస్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ పీఎస్ వినోద్ కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక లాయర్ పాత్ర చేస్తుండగా ఆయనకు పోటీగా వాదించే లాయర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ శ్రోతలను ఎంతో ఆకట్టుకోగా దీని అధికారిక థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 29న రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఈ మూవీ ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంగీతం అందించడం ద్వారా తొలిసారిగా పవన్ కళ్యాణ్ గారితో పని చేసే అవకాశం దక్కడం తన అదృష్టమని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ చెప్పారు.

నిజానికి ఎన్నో ఏళ్ళ క్రితమే తనకు పవన్ సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని, అయితే అప్పట్లో కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని ఎట్టకేలకు వకీల్ సాబ్ ద్వారా అది దక్కిందని అన్నారు. కొద్ది రోజుల క్రితమే తను వకీల్ సాబ్ సినిమా మొత్తం చూశానని, అయితే ఒక ఆడియన్ గా ఎంతో సంతోషించిన తాను, పవర్ స్టార్ కి ఫ్యాన్ గా మాత్రం దానికి వందరెట్లు ఆయన పాత్రని యాక్షన్ ని చూసి ఎంతో ఎంజాయ్ చేశానని అన్నారు. థమన్ వ్యాఖ్యలతో పవర్ స్టార్ అభిమానుల్లో మూవీ పై మరింత అంచనాలు పెరిగాయి అనే చెప్పాలి. అందునా మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో తమ హీరో భారీ సక్సెస్ అందుకని బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని వారు అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్ చేస్తున్నారు... !!


ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..

పవన్ పై ఒత్తిడి పెంచుతున్న నాదెండ్ల...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>