MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathi-ratnaluab9d923b-bc5c-4730-8c62-a8ddb218abaf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathi-ratnaluab9d923b-bc5c-4730-8c62-a8ddb218abaf-415x250-IndiaHerald.jpgనవ్వుతూనే కష్టాలన్నీ చెప్పిన దర్శక 'రత్నం'..! ప్రస్తుతం జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే అనుదీప్ పిట్టగోడ' అనే ప్లాప్ సినిమాతో ఇందులట్రీలో అడుగుపెట్టాడు అనుదీప్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా చేసినా అది ప్లాప్ అవడంతో అతన్ని ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. ఈ క్రమంలో మరో అవకాశం రావడానికి చాలా ఏళ్లే పట్టింది. అయితే ఈసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అనుదీప్. 'జాతిరత్నాలు' సినిమాతో అందరూ తనను గుర్తు పెట్టుకునేలా తన గురించి మాట్లాడుకుjathi ratnalu;suresh;jeevitha rajaseskhar;srikanth;tiru;hyderabad;cinema;audience;interview;director;suresh productions;ishtamనవ్వుతూనే కష్టాలన్నీ చెప్పిన దర్శక 'రత్నం'..!నవ్వుతూనే కష్టాలన్నీ చెప్పిన దర్శక 'రత్నం'..!jathi ratnalu;suresh;jeevitha rajaseskhar;srikanth;tiru;hyderabad;cinema;audience;interview;director;suresh productions;ishtamWed, 24 Mar 2021 10:00:00 GMT
ప్రస్తుతం జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే అనుదీప్ పిట్టగోడ' అనే ప్లాప్ సినిమాతో ఇందులట్రీలో అడుగుపెట్టాడు అనుదీప్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా చేసినా అది ప్లాప్ అవడంతో అతన్ని ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. ఈ క్రమంలో మరో అవకాశం రావడానికి చాలా ఏళ్లే పట్టింది. అయితే ఈసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అనుదీప్. 'జాతిరత్నాలు' సినిమాతో అందరూ తనను గుర్తు పెట్టుకునేలా తన గురించి మాట్లాడుకునేలా చేసాడు.

ఇక దీంతో ఇప్పుడు నిర్మాతలందరూ అనుదీప్ కు అడ్వాన్సులివ్వడానికి పోటీ పడుతున్నారు. అయితే ఆడియన్స్ ని అంతలా నవ్వించిన ఈ దర్శక రత్నం జీవితంలో అనేక కష్టాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల అనుదీప్ ఫ్రెండ్ పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ఈ విషయాలు తెలిసాయి. సినిమాల మీద ఇష్టంతో చదువుని మధ్యలోనే వదిలేసి హైదరాబాద్ నగరానికి వచ్చిన అనుదీప్ ఈ స్థాయికి రావడానికి అనేక కష్టాలు పడినట్లు తెలిపారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుదీప్.. నవ్వుతూనే తన జీవితంలో ఎలాంటి కష్టాలు పడ్డాడో వెల్లడించారు. కృష్ణానగర్ లో ఒక ఫ్రెండ్ రూమ్ లో లగేజ్ పెట్టి మరో ఫ్రెండ్ రూమ్ లో ఉండేవాడినని.. లగేజేగా పెట్టింది నేను ఇక్కడ ఉండటం లేదు కదా అని ఒకరితో.. నా లగేజ్ ఏమీ లేకుండా ఒక్కడినే ఉంటున్నా కదా అని మరొకరితో చెప్తూ రెండు చోట్లా రెంట్ కట్టకుండా ఉండేవాడినని నవ్వుతూ చెప్పాడు.

అయితే అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్నా తనకు కష్టాలేమీ లేవని.. తన వల్ల ఫ్రెండ్స్ మాత్రం కష్టపడ్డారని చెప్పుకొచ్చాడు. సినిమా ఛాన్సుల కోసం తిరుగుతున్న సమయంలో తన ఫ్రెండ్ శ్రీకాంత్ ఎంతో సాయం చేశాడని.. అతడికి ఉద్యోగం రావడంతో తాను కుదురుకునే వరకు ప్రతి నెలా డబ్బులు ఇచ్చాడని.. అందుకే అతడి మీద అభిమానంతోనే 'జాతిరత్నాలు' సినిమాలో హీరోకు శ్రీకాంత్ అనే పేరు పెట్టానని అనుదీప్ తెలిపాడు. అయితే కష్టాలన్నీ చెబుతూనే.. 'తనకు సినిమా కష్టాలేమీ లేవని.. దీనికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఏమీ వేయొద్దని' నవ్వుతూ చెప్పడం అనుదీప్ కే చెల్లింది.


మతిమరుపు తో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...!

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>