Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vitamin-c898b087b-1ec9-4bab-9cfa-903d77b7915b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vitamin-c898b087b-1ec9-4bab-9cfa-903d77b7915b-415x250-IndiaHerald.jpgకరోనావైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే. అనారోగ్యం బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదే కానీ జరిగితే ఆ తర్వాత కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ సైతం ఈజీగా ఎటాక్ చేస్తుంది. అంతకంటే ముందుగానే మీరు మేల్కొంటే కోవిడ్-19 బారినపడకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. మొదటిగా మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. నిత్యం మీరు తీసుకునే ఆహారంలో విటమిన్-సి కలిగిన ఫుడ్స్ ఉంటున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ సి విటమిన్ ఫుడ్స్ లేనట్టయితే.శvitamin c;nithya new;ranina;vitamin c;vitamin;cheque;aqua;shakti;coronavirusవిటమిన్ -c ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు రావచ్చు...?విటమిన్ -c ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు రావచ్చు...?vitamin c;nithya new;ranina;vitamin c;vitamin;cheque;aqua;shakti;coronavirusWed, 24 Mar 2021 07:00:00 GMTకరోనావైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే. అనారోగ్యం బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదే కానీ జరిగితే ఆ తర్వాత కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ సైతం ఈజీగా ఎటాక్ చేస్తుంది. అంతకంటే ముందుగానే మీరు మేల్కొంటే  కోవిడ్-19 బారినపడకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. మొదటిగా మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. నిత్యం మీరు తీసుకునే ఆహారంలో విటమిన్-సి కలిగిన ఫుడ్స్ ఉంటున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ సి విటమిన్ ఫుడ్స్ లేనట్టయితే.శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఇతర ఇన్‌ఫెక్షన్స్  బారినపడుతుంటారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా  దాని ప్రభావం ఎక్కువగా పడే ప్రమాదం ఉంటుంది.


ఈ పండ్లు తింటే ఇన్‌ఫెక్షన్, వైరస్‌లకు చెక్ పెట్టొచ్చు అతి ఎప్పుడూ అనార్థమే. ఇది మన ఇమ్యునిటీ బూస్టింగ్ విటమిన్లకు కూడా వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విటమిన్లు శరీరానికి ఎంతవరకు అవసరమనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. రోజుకు 65 నుంచి 90 మిల్లీ గ్రాములు విటమిన్-సి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు.. ఒక ఆరెంజ్‌లో 51 మిల్లీ గ్రాముల విటమిన్-C ఉంటుంది. కాబట్టి రోజుకు కనీసం రెండు ఆరెంజ్‌లు తింటే శరీరానికి కావల్సినంత సప్లిమెంట్ అందుతుంది.


రోగ నిరోధక శక్తి పెంచుకోడానికి విటమిన్-సి మంచిది కదా అని అతిగా తీసుకుంటే.. లేనిపోని సమస్యలు వస్తాయి. మన శరీరం విటమిన్-సి 2000 మిల్లీగ్రాములకు తీసుకుంటుంది. అయితే, ఈ మోతాదు కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. విటమిన్-సి ఎక్కువైతే.. తలనొప్పి, వాంతులు, డయేరియా, గుండెలో మంట, వికారం, కడుపులో తిమ్మిరి, ఇన్సోమియా  సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకెప్పుడైనా ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే విటమిన్-సి మోతాదును తగ్గిస్తే సరిపోతుంది. లేకపోతే వైద్యులను తప్పకుండా సంప్రదించండి. అంతేగాక, మీరు ఇమ్యునిటీ కోసం తీసుకుంటున్న సప్లిమెంట్స్ గురించి కూడా స్పష్టంగా వైద్యులకు తెలియజేయాలి.


విటమిన్-సి శరీరానికి చాలా ముఖ్యమైనది. అన్ని పోషకాలతోపాటు దీన్ని కూడా నిత్యం మన శరీరానికి అందించాలి. దీనివల్ల మీ శరీరం ఫిట్‌గా, హెల్తీగా ఉంటుంది. అయితే, వీటిని కేవలం వైద్యుల సూచనలతో మాత్రమే తీసుకోవాలి. ఆహారం ద్వారా పొందలేని పోషకాలను ‘సప్లిమెంట్స్’ ద్వారా భర్తీ చేస్తారనే విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అంతేగానీ, అవి ఆహారానికి ప్రత్యామ్నాయం అస్సలు కాదు. కాబట్టి.. మీరు ఆహారం ద్వారా మాత్రమే శరీరానికి అవసరమైన పోషకాలను అందించండి. అలా సాధ్యం కానప్పుడు వైద్యుల సూచనతో మాత్రమే డైట్‌ను, ఔషదాలను తీసుకోవాలి. జాగ్రత్తగా ఉండండి.. ఆరోగ్యంగా జీవించండి!


కాపు వేద‌న‌: తాజా వ్యూహంతో జ‌న‌సేన‌కు గ్రాఫ్ పెరిగేనా ?

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>