MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sudhkar-interviewfef36a00-aef9-4b32-b1a2-7e1d9dca0024-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sudhkar-interviewfef36a00-aef9-4b32-b1a2-7e1d9dca0024-415x250-IndiaHerald.jpgఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన స్టార్ కమెడియన్ లలో సుధాకర్ ఒకరు. కొంతకాలం వరకు గ్యాప్ లేకుండా సినిమాలు తీసి ఫ్యాన్స్ ను అలరించిన సుధాకర్ అనారోగ్యం కారణంగా సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధాకర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని సుధాకర్ అన్నారు. తనకు బ్రెయిడ్ డెడ్ అయ్యిందని అప్పుడు 40రోజులు కోమాలో ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని నడవడం కాస్త ఇబ్బందిగా ఉందని అన్నారు. తనకు బ్రెయిన్ డెడ్ అయినప్పుడు జగపతిబాబు, చిరంజీవి, కోటి మరికొంsudhkar interview;koti;pawan;chiranjeevi;balakrishna;deva;kalyan;kranthi;kranti;sudhakar;suman;makar sakranti;tollywood;industries;cinema;sankranthi;interview;comedian;letter;giftమా అబ్బాయి రక్తంలోనే న‌ట‌న ఉంది..చిరంజీవి నా రూమ్ మేట్ కానీ : క‌మెడియ‌న్ సుధాక‌ర్‌మా అబ్బాయి రక్తంలోనే న‌ట‌న ఉంది..చిరంజీవి నా రూమ్ మేట్ కానీ : క‌మెడియ‌న్ సుధాక‌ర్‌sudhkar interview;koti;pawan;chiranjeevi;balakrishna;deva;kalyan;kranthi;kranti;sudhakar;suman;makar sakranti;tollywood;industries;cinema;sankranthi;interview;comedian;letter;giftWed, 24 Mar 2021 21:29:00 GMTఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన స్టార్ కమెడియన్ లలో సుధాకర్ ఒకరు. కొంతకాలం వరకు గ్యాప్ లేకుండా సినిమాలు తీసి ఫ్యాన్స్ ను అలరించిన సుధాకర్ అనారోగ్యం కారణంగా సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధాకర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని సుధాకర్ అన్నారు. తనకు బ్రెయిడ్ డెడ్ అయ్యిందని అప్పుడు 40రోజులు కోమాలో ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని నడవడం కాస్త ఇబ్బందిగా ఉందని అన్నారు. తనకు బ్రెయిన్ డెడ్ అయినప్పుడు జగపతిబాబు, చిరంజీవి, కోటి మరికొందరు పరిశ్రమ కు చెందినవారు వచ్చి పరమర్శించారని చెప్పారు. సంక్రాంతి సినిమా తరవాత అనారోగ్యానికి గురి కావడం తో మళ్ళీ సినిమాలు చేయలేదని అన్నారు. చిరంజీవి, హరిప్రసాద్ తన రూం మేట్స్ అని సుధకార అన్నారు. అయితే ఇప్పుడు ఎవరూ పెద్దగా టచ్ లో లేరని చెప్పారు.

తన కొడుకు కాలేజి సీటు కోసం ఒకసారి చిరంజీవి దగ్గరకు వెళ్లానని అన్నారు. ఆ తరవాత మళ్ళీ కలవలేదని చెప్పారు. తనవరకు తాను భాగానే సంపాదించున్నా అని ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవన్నారు. ఒకరికి అప్పు ఇచ్చే పొజిషన్ లో గాని ఒకరి దగ్గర అప్పు చేసే స్థితిలో గాని లేనని చెప్పారు. తన కొడుకు పేరు బెనిడిక్ మైకేల్ అని అతడు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పారు. మైకేల్ మొదటి రెండవ పుట్టినరోజుకు హీరోలు పవన్ కళ్యాణ్, సుమన్, బాలయ్య, చిరంజీవి వచ్చారని అన్నారు. కానీ ఇప్పుడు మెగాస్టార్ తనకు టచ్ లో లేరని అన్నారు. ఇక తన కొడుకు సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నట్టు సుధాకర్ వెల్లడించాడు. నా రక్తంలోనే నటన ఉందని తన కొడుకు చెపుతున్నాడని సుధాకర్ అన్నారు.ఇక ప్ర‌స్తుతం ఓ సినిమా కోసం సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు సుధాక‌ర్ కొడుకు బెన్నీ తెలిపాడు. 


10 జిల్లాల్లో కరోనా కల్లోలం.. ముంబైలో దారుణ పరిస్థితులు

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>