PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ycp-babu-tdp-ap-latest-newsd71500fd-742f-4b21-a1ee-0c2bf9f99dc9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ycp-babu-tdp-ap-latest-newsd71500fd-742f-4b21-a1ee-0c2bf9f99dc9-415x250-IndiaHerald.jpgఇసుక పంపిణీ గురించి దేశంలో విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌భుత్వం ఏదైనా ఉందా? అంటే ఏపీలో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికే ఆ ఘ‌న‌త ద‌క్కుతుంది. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టినుంచి ఇసుక‌ను స‌ర‌ఫ‌రా కానివ్వ‌కుండా, దీనిపై ఆధార‌ప‌డివున్న రంగాలు కుదేల‌య్యేలా అక్క‌డి ప్ర‌భుత్వం అభివృద్ధికి కాలు అడ్డంపెట్టింది. దీనిపై ప్ర‌తిప‌క్షాల నుంచే కాకుండా అధికార ప‌క్షం నుంచి కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఇసుక‌ను క్విడ్ ప్రోకో కిందే జ‌గ‌న్ బినామీ కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టేశార‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి.jagan, ycp, babu, tdp, ap, latest news;telugu desam party;andhra pradesh;telugu;partyజ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌jagan, ycp, babu, tdp, ap, latest news;telugu desam party;andhra pradesh;telugu;partyWed, 24 Mar 2021 06:25:39 GMT
జ‌గ‌న్ బినామీ జేపీ ప‌వ‌ర్‌
ఇసుక త‌వ్వ‌కాల్లో అనుభ‌వం లేని కంపెనీకి, అదీ.. వేల‌కోట్ల న‌ష్టాల్లో ఉన్న కంపెనీకి ఇసుక త‌వ్వే అనుమ‌తులు ఎలా ఇచ్చారంటూ ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ప్ర‌భుత్వం మాత్రం వీటిని తిప్పికొట్ట‌కుండా ప్ర‌జాధ‌నంతో ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లిచ్చి, అధికారుల‌తో విలేక‌రుల స‌మావేశం పెట్టించి త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా చూసుకుంటోంది. జేపీ ప‌వ‌ర్‌కు ఇసుక‌ను క‌ట్ట‌బెట్ట‌డంపై ప్ర‌భుత్వంలోని ముఖ్య‌మైన నేత‌లుకానీ, అధికార‌పార్టీ నేత‌లుకానీ ఎవ‌రూ నోరు మెద‌ప‌డంలేదు. దీన్నిబ‌ట్టే అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇసుక త‌వ్వ‌కాల్లో అనుభ‌వం లేని ట్రైడెంట్ కెంఫ‌ర్‌, కేఎన్నార్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ సంస్థ‌ల‌తో డ‌మ్మీ టెండ‌ర్ల నాట‌క‌మాడి జేపీ ప‌వ‌ర్ వెంచ‌ర్స్‌కు ఇసుక‌ను క‌ట్ట‌బెట్టారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

రూ.10వేల కోట్ల దోపిడీ
మూడు సంవ‌త్స‌రాల‌కు 10వేల కోట్ల దోపిడీకి తెర‌తీశారు. ట‌న్ను ఇసుక రూ.375 నుంచి రూ.475కి పెంచారు. హ్యాండ్లింగ్ ఛార్జీల కింద రూ.150 వ‌సూలు చేస్తున్నారు. స్టాక్‌యార్డులో లోడింగ్‌, అన్‌లోడింగ్ ఛార్జీలు అద‌నం. ఇవ‌న్నీ క‌లుపుకొని ఇసుక ఇంటికి చేరేస‌రికి రూ.20వేల నుంచి రూ.24వేల‌వుతోంది. సంవ‌త్స‌రానికి 6 కోట్ల ట‌న్నుల ఇసుక స‌ర‌ఫ‌రా చేయ‌వ‌చ్చ‌ని గ‌తంలోనే జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం చెప్పింది. ఇప్పుడు 2 కోట్ల ట‌న్నులే అని చెప్ప‌డంలో మర్మ‌మేంటి?.. లాంటి వివ‌రాల‌ను తెలుగుదేశం పార్టీ మీడియాకు అందించింది.

ఆన్‌లైన్ దోపిడీ నుంచి ఆఫ్ లైన్ దోపిడీకి
ఆన్‌లైన్ ఇసుక పంపిణీ విధానం అద్భుతమ‌ని, ప్ర‌జ‌ల ఇంటి వ‌ద్ద‌కే నేరుగా ఇసుక పంపిణీ చేస్తున్నామంటూ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంది. ప్ర‌తిప‌క్షాలు రాద్దాంతం చేస్తున్నాయంటూ మండిప‌డింది. ఇప్పుడు అదే ప్ర‌భుత్వం తాము గొప్ప‌లు చెప్పుకున్న పాల‌సీనే తీసిప‌డేసింది. ఆన్‌లైన్ ఇసుక విధానంలో జ‌రిగిన దోపిడీ గురించి చెప్ప‌న‌ల‌వి కాదు. ఇప్పుడు ఏకంగా ప్రైవేటు ప‌రం చేసేసింది. త్వ‌ర‌లోనే ఏపీ అంతా పెనుదుమారానికి కార‌ణ‌మ‌వ‌బోతున్న ఇసుక టెండ‌రును నిలిపేస్తారా? అంటే క‌ష్ట‌మేన‌ని చెప్ప‌‌వ‌చ్చు. రాష్ట్రాన్ని జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశార‌ని తెలుగుదేశం పార్టీ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది.


హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>