PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-govt-new-decision-on-corona-second-wave-70d246d9-c332-4d10-9bcb-8a85ee391883-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-govt-new-decision-on-corona-second-wave-70d246d9-c332-4d10-9bcb-8a85ee391883-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఏపీ సర్కారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. సెకండ్ వేవ్ వల్ల కలిగే ముప్పు గురించి ప్రజలకు మరింతగా వివరించి చెప్పేలా 15 రోజుల పాటు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 24 నుంచి ఏప్రిల్ 7 వరకు రోజువారీ ప్రచార కార్యాచరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వాక్సినేషన్‌ ఆవశ్యకతతో పాటు కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ వివిధ ప్రభుత్వ శాఖలు పలు కార్యక్రమాలు చేపట్టాల్సిsecond wave, ys jagan, cm jagan, ap corona,;amala akkineni;andhra pradesh;district;cinema;school;media;social media;april;mantraకరోనా సెంకండ్ వేవ్.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం..కరోనా సెంకండ్ వేవ్.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం..second wave, ys jagan, cm jagan, ap corona,;amala akkineni;andhra pradesh;district;cinema;school;media;social media;april;mantraTue, 23 Mar 2021 08:00:00 GMTఏపీ సర్కారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. సెకండ్ వేవ్ వల్ల కలిగే ముప్పు గురించి ప్రజలకు మరింతగా వివరించి చెప్పేలా 15 రోజుల పాటు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 24 నుంచి ఏప్రిల్ 7 వరకు రోజువారీ ప్రచార కార్యాచరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వాక్సినేషన్‌ ఆవశ్యకతతో పాటు కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ వివిధ ప్రభుత్వ శాఖలు పలు కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.

- 24వ తేదీన కలెక్టర్లు తమ జిల్లా పరిధిలో అన్ని విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహించాలి. ఈ సమావేశాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలి. సరైన మార్గదర్శకాలు వారికి ఇవ్వాలి.
- 25న పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించాలి. ఈ ర్యాలీల ద్వారా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి. మాస్క్ ల వాడకం, సామాజిక దూరం.. వంటి వాటిని కచ్చితంగా అమలులోకి తీసుకు రావాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తూ ర్యాలీలతో ప్రజల్లో అవగాహన పెంచాలి.
- 26న మండల స్థాయిలో తనిఖీలు చేపట్టాలి. మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు తమ పరిధిలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై తనిఖీలు నిర్వహించాలి. ఈ తనిఖీలలో ఎవరైనా అశ్రద్ధ వహిస్తున్నట్టు కనపడితే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడకూడదు.

- 27న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీతో సహా ప్రజాప్రతినిధులందరూ ప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. అధికారులతోపాటు.. ప్రజా ప్రతినిధులంతా ప్రచారంలో పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. వారికి సరైన మార్గదర్శకాలివ్వాలి.
- 28న సినిమా హాళ్లలో కరోనా నియంత్రణ చర్యలపై తనిఖీలు చేపట్టాలి.
- 29వ తేదీన పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి.
- 30వ తేదీ లారీ, టాక్సీ, ఆటో యజమానులతో సమావేశాలు నిర్వహించాలి.
- 31న పరిశ్రమల యజమానులతో జిల్లా కలెక్టర్లు సమావేశాలు, ఏప్రిల్‌ 1న ప్రయాణికుల వాహనాల్లో తనిఖీలు, ఏప్రిల్ 2న షాపింగ్‌ మాల్స్, పరిశ్రమలలో చేపడుతున్న చర్యలపై తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది.
ఇక ఏప్రిల్‌ 3నుంచి పూర్తి స్థాయిలో గ్రామాల స్థాయికి ఈ ప్రచార కార్యక్రమాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో అవగాహన కార్యక్రమాలు, ఏప్రిల్‌ 4న విద్యార్థులకు ఆన్‌ లైన్, ఆఫ్ ‌లైన్‌ విధానంలో వివిధ రకాల పోటీలు, ఏప్రిల్ 5న వివిధ మత సంస్థలలో కరోనా నియంత్రణ చర్యలపై తనిఖీలు, ఏప్రిల్‌ 6న సోషల్‌ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు, చివరిగా ఏప్రిల్ 7న జిల్లా, మండల, గ్రామ స్థాయిలో క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించాలని ప్రధాన కార్యదర్శి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెకండ్ వేవ్ ప్రభావం మరింత పెరిగితే ఈ కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.




మాస్క్ జరిమానా@40 కోట్లు.. ఇది అసలు పరిస్థితి..?

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>