PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kamal-haasan-in-trouble-movie-careera9badf09-88f7-4933-a6fc-48607c997d5a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kamal-haasan-in-trouble-movie-careera9badf09-88f7-4933-a6fc-48607c997d5a-415x250-IndiaHerald.jpg తానే స్వ‌యంగా వారి త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. ఎక్క‌డికి వెళ్లినా.. స‌మ‌స్య‌ల తోర‌ణాలు క‌మ‌ల్‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. తాగునీరు, వ‌స‌తులు, నివాసాలు స‌హా ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు కూడా క‌మ‌ల్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో రాజకీయంగా వాటికి స‌మాధానం చెప్ప‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. మ‌రీ ముఖ్యంగా సామాజిక వ‌ర్గాల వారీగా విడిపోయిన ఓట‌ర్ల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకోవ‌డంలోనూ క‌మ‌ల సాహ‌సం చేయ‌లేక పోతున్నారు. ఎవ‌రికి అనుకూలంగా మాట్లాడితే.. ఎవ‌రికి కోపం వ‌స్తుందోన‌ని ఆయ‌న kamal hassan;chiranjeevi;assembly;war;hero;letter;partyత‌మిళ స‌మ‌రం: క‌మ‌ల్ మ‌రో చిరంజీవిగా మిగిలిపోతారా ?త‌మిళ స‌మ‌రం: క‌మ‌ల్ మ‌రో చిరంజీవిగా మిగిలిపోతారా ?kamal hassan;chiranjeevi;assembly;war;hero;letter;partyTue, 23 Mar 2021 13:46:00 GMTప్ర‌స్తుతం జ‌రుగుతున్న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మార్పు తీసుకువ‌స్తానంటూ.. రాజ‌కీయ యుద్ధంలోకి దిగిన ద‌శావ‌తా రం.. క‌మ‌ల్ హాస‌న్‌.. అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. మ‌క్క‌ల్ నీది మ‌య్య ‌(ఎంఎన్ ఎం) పేరుతో రాజ‌కీయ పార్టీని స్థాపించిన క‌మ‌ల్ ముందు ఒంట‌రిగానే ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని అనుకున్నారు. అయితే.. అటు అధికార పార్టీ అన్నాడీఎంకే, ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం డీఎంకేలు భారీ ఎత్తున ఎన్నిక‌ల్లో పోరు చేస్తుండ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో కొన్ని చిన్న చిత‌కా పార్టీల‌ను క‌లుపుకొని స‌మారానికి సిద్ధ‌మ‌య్యారు క‌మ‌ల్‌. అదే స‌మ‌యంలో ఉచితాల‌కు వ్య‌తిరేక‌మైన‌ప్ప‌టికీ.. ఇత‌ర పార్టీల నుంచి ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లులు కురుస్తుండ‌డంతో క‌మ‌ల్ ఈ విష‌యంలోనూ స‌ర్దుబాటు ధోర‌ణిలోనే ఉన్నారు.

తాను కూడా అనేక ఉచితాలు, కానుక‌లు ప్ర‌క‌టించారు. ఇక‌, పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతోపాటు.. తానే స్వ‌యంగా వారి త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. ఎక్క‌డికి వెళ్లినా.. స‌మ‌స్య‌ల  తోర‌ణాలు క‌మ‌ల్‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. తాగునీరు, వ‌స‌తులు, నివాసాలు స‌హా ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు కూడా క‌మ‌ల్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో రాజకీయంగా వాటికి స‌మాధానం చెప్ప‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా సామాజిక వ‌ర్గాల వారీగా విడిపోయిన ఓట‌ర్ల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకోవ‌డంలోనూ క‌మ‌ల సాహ‌సం చేయ‌లేక పోతున్నారు. ఎవ‌రికి అనుకూలంగా మాట్లాడితే.. ఎవ‌రికి కోపం వ‌స్తుందోన‌ని ఆయ‌న సంక‌ట స్థితిలో ఉన్నారు. ఇక‌, మ‌రోవైపు తాను సినీ ప్ర‌భావంతో నెట్టుకువ‌స్తాన‌ని అనుకున్నా.. ఓట‌ర్ల నాడిని ప‌ట్టుకోవ‌డంలో ఒకింత విఫ‌ల‌మ‌వుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కోయంబ‌త్తూరు ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన క‌మ‌ల్‌.. ఇటీవ‌లే కాలుకు ఆప‌రేష‌న్ చేయించుకున్న‌ప్ప‌టికీ.. ప్ర‌చారంలో మాత్రం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

ఉద‌యం ఆయ‌న మార్నింగ్ వాక్ సమ‌యంలోనూ ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను విస్తృతంగా క‌లుస్తున్నారు. త‌న మేనిఫెస్టోను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు. అయితే.. క‌మ‌ల్ ను హీరోగా చూస్తున్నారే త‌ప్ప‌.. నాయ‌కుడిగా మాత్రం ఆయ‌న‌ను ప్ర‌జ‌లు చూడ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తెలుగు స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి ఎలా మిగిలిపోయారో ?  ఇప్పుడు క‌మ‌ల్‌దీ అదే ప‌రిస్థితి. దీంతో క‌మ‌ల్ ప‌రిస్థితి ఏం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది.  


తిరుప‌తిపై వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ వేసిన టీడీపీ ?

మళ్ళీ పెళ్ళికి సిద్ధమైన యంగ్ హీరోయిన్ ?

తెరాస లో వీళ్ళ పరిస్థితి ఏంటీ...?

గంటాకు పొగబెట్టేది ఆయనేనా...? ఆ కోపమే ఇక్కడి వరకు వచ్చిందా...?

నాగ్ సినిమా డిజాస్టర్... డిప్రెషన్ లో డైరెక్టర్...?

పెళ్లి తర్వాత ఆ కండిషన్ పెట్టిన రాజీవ్.. కుదరదు అని రెండు సంవత్సరాలు..?

వకీల్ సాబ్ సీక్రెట్ లు బయటపెట్టిన తమన్..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>