PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/they-all-shook-hands-and-stood-upf46e4ee5-e9c8-43d1-8117-a319dae2872c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/they-all-shook-hands-and-stood-upf46e4ee5-e9c8-43d1-8117-a319dae2872c-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు చాలా మంది ఆ పార్టీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చాలా మంది సీనియర్ నేతలతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మాట్లాడక పోవడం పట్ల కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి రాహుల్ గాంధీ కాస్త సిద్ధంగానే ఉన్నారు. అయితే కొంతమంది సీనియర్ నేతల నుంచి సహకారం రావడం లేదు. ప్రధానంగా కొంత మంది భారతీయgulab aajam,congress;rahul new;rahul;k l rahul;rahul gandhi;mohandas karamchand gandhi;congress;రాజీనామా;azad hind fauj;rahul sipligunj;partyకాంగ్రెస్ కి ఆజాద్ గుడ్ బై..?కాంగ్రెస్ కి ఆజాద్ గుడ్ బై..?gulab aajam,congress;rahul new;rahul;k l rahul;rahul gandhi;mohandas karamchand gandhi;congress;రాజీనామా;azad hind fauj;rahul sipligunj;partyTue, 23 Mar 2021 15:10:00 GMTకాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు చాలా మంది ఆ పార్టీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చాలా మంది సీనియర్ నేతలతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మాట్లాడక పోవడం పట్ల కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి రాహుల్ గాంధీ కాస్త సిద్ధంగానే ఉన్నారు. అయితే కొంతమంది సీనియర్ నేతల నుంచి సహకారం రావడం లేదు.

ప్రధానంగా కొంత మంది భారతీయ జనతా పార్టీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా వినబడుతున్నాయి. దీని కారణంగా రోజురోజుకు సమస్యల తీవ్రత పెరగడమే గాని తగ్గే అవకాశాలు ఎక్కడా లేవు అని చెప్పాలి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. ఒక కీలక నేత రాజీనామా చేయడానికి సిద్ధం అవుతున్నాడని సమాచారం. గులాం నబీ అజాద్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లుగా పార్టీ వర్గాలంటున్నాయి.

అంతేకాకుండా కర్ణాటకకు చెందిన కొంతమంది కీలక నేతలు కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఉన్న ఒక కీలక నేత కూడా రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు అని టాక్. కొంత మంది ఉపాధ్యక్షులు కూడా ఇప్పుడు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాలు అంటున్నారు. దీనితో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎలాంటి అడుగులు వేస్తారు అనేది చూడాలి.


మ‌మ‌త‌, కేజ్రీవాల్‌కు ద‌గ్గ‌ర‌వుతున్న జ‌గ‌న్: కేంద్రం క‌న్నెర్ర

తిరుప‌తిపై వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ వేసిన టీడీపీ ?

మళ్ళీ పెళ్ళికి సిద్ధమైన యంగ్ హీరోయిన్ ?

తెరాస లో వీళ్ళ పరిస్థితి ఏంటీ...?

గంటాకు పొగబెట్టేది ఆయనేనా...? ఆ కోపమే ఇక్కడి వరకు వచ్చిందా...?

నాగ్ సినిమా డిజాస్టర్... డిప్రెషన్ లో డైరెక్టర్...?

పెళ్లి తర్వాత ఆ కండిషన్ పెట్టిన రాజీవ్.. కుదరదు అని రెండు సంవత్సరాలు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>