PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/petrol-rates4f6053a5-f5f3-4082-a13c-b1d06d86c305-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/petrol-rates4f6053a5-f5f3-4082-a13c-b1d06d86c305-415x250-IndiaHerald.jpgపెట్రోల్‌.. ఈ సమాజాన్ని నడిపించే ఇంధనం.. ఇది లేకపోతే.. ఏ బండీ కదలదు. దేశ ఆర్థక రథం నడవదు. కానీ..ఇది మన దగ్గర పెద్దగా దొరకదు. అందుకే దిగుమతులే గతి. ప్రస్తుతం పెట్రోలు ధర 100కు చేరువైంది. డీజీల్ పరిస్థితీ దాదాపు అంతే.. అందుకే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ పెట్రో ధరలప్రభావం మిగిలిన అన్ని రంగాలపైనా పడుతోంది. క్రమంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో జనం ఇదేం బాదుడు రా బాబోయ్ అంటున్నారు. జనం పెట్రోధరల పెంపుతో బాధపడుతున్నా.. కేంద్రానికి మాత్రం ఇదో పెద్ద ఆదాయ వనరుగా మారింది. ఎందుకంటే.. చమpetrol-rates;anurag thakur;2020;petrol;diesel;minister;central government;research and analysis wingపెట్రోల్‌ ధరల గురించి షాకింగ్‌ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఎంత దోపిడీరా బాబూ..?పెట్రోల్‌ ధరల గురించి షాకింగ్‌ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఎంత దోపిడీరా బాబూ..?petrol-rates;anurag thakur;2020;petrol;diesel;minister;central government;research and analysis wingTue, 23 Mar 2021 07:00:00 GMTరా బాబోయ్ అంటున్నారు.


జనం పెట్రోధరల పెంపుతో బాధపడుతున్నా.. కేంద్రానికి మాత్రం ఇదో పెద్ద ఆదాయ వనరుగా మారింది. ఎందుకంటే.. చమురుపై కేంద్రానికి లభించే ఆదాయం ఆరేళ్లలో 300 శాతం పెరిగిందట. ఈ లెక్కలు సాక్షాత్తూ కేంద్రమే చెప్పింది.  లోక్ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ బదులిచ్చారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో పెట్రోల్, డీజిల్ పై కేంద్రానికి రూ.2.94 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్టు వెల్లడించారు. గత 6 సంవత్సరాల్లో చమురుపై పన్నుల రూపేణా కేంద్రానికి లభించే ఆదాయంలో 300 శాతం వృద్ధి నమోదైందని వివరించారు.


ఒకసారి పెట్రోల్ రేట్ల పెరుగుదలను పరిశీలిస్తే.. 2014లో పెట్రోల్ ఒక లీటరుపై ఎక్సైజ్ సుంకం రూ.9.48 ఉంది. ఇప్పుడది రూ.32.90కి చేరింది. అదే సమయంలో డీజిల్ ఒక లీటరుపై రూ.3.56గా ఉన్న సుంకం నేడు రూ.31.80కి పెరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి లభించే మొత్తం ఆదాయంలో చమురు, గ్యాస్ పై లభించే ఆదాయం 2014-15లొ 5.4 శాతం ఉంటే 2020-21 నాటికి 12.2 శాతానికి చేరిందని పేర్కొన్నారు. అసలు పెట్రో ధరలు పరిశీలిస్తే.. ఒక లీటర్ పెట్రోల్‌పై 68 రూపాయల వరకూ పన్నులే ఉన్నాయి.. అంటే అసలు పెట్రోల్‌ ధర కేవలం దాదాపు 30 రూపాయలే అన్నమాట. అయితే ఈ విషయంపై కేంద్ర, రాష్ట్రాలు ఎందుకు పట్టించుకోవు.. ఎందుకంటే.. వాటి ఆదాయం తగ్గుతుంది కాబట్టి.




ఇంగ్లండ్ జట్టుకు ఆడబోతున్న అయ్యర్.. త్వరలో ఆ దేశానికి..

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>