MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-tollywood-gossipsd9da505f-4e1b-4457-9e50-56875bcd5ca4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-tollywood-gossipsd9da505f-4e1b-4457-9e50-56875bcd5ca4-415x250-IndiaHerald.jpgన్యాచురల్ స్టార్ నాని నటించిన "జెర్సీ" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి మెసేజ్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. నానికి మంచి పేరుని తీసుకోచ్చింది. ఇక జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 'జెర్సీ'కి రెండు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తమ చిత్రం (తెలుగు), ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో పురస్కారాలు దక్కించుకుంది. దీంతో టాలీవుడ్‌లో సందడి వాతావరణం నెలకొంది. చిత్రబృందం కూడా ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఇంకో పురస్కారం దక్కి ఉంటే బాగుండేది అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు చిత్ర దర్శకుడు Nani tollywood-gossips;nani;gautham new;gautham;gowtam;cinema;jersey;father;naveen nuli;chitramనేషనల్ అవార్డు నానికి ఇచ్చుంటే బాగుండేది : గౌతమ్ తిన్ననూరి.నేషనల్ అవార్డు నానికి ఇచ్చుంటే బాగుండేది : గౌతమ్ తిన్ననూరి.Nani tollywood-gossips;nani;gautham new;gautham;gowtam;cinema;jersey;father;naveen nuli;chitramTue, 23 Mar 2021 20:00:00 GMT

న్యాచురల్ స్టార్ నాని నటించిన "జెర్సీ" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి మెసేజ్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. నానికి మంచి పేరుని తీసుకోచ్చింది. ఇక జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 'జెర్సీ'కి రెండు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తమ చిత్రం (తెలుగు), ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో పురస్కారాలు దక్కించుకుంది. దీంతో టాలీవుడ్‌లో సందడి వాతావరణం నెలకొంది. చిత్రబృందం కూడా ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఇంకో పురస్కారం దక్కి ఉంటే బాగుండేది అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు చిత్ర దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. అదే ఉత్తమ నటుడు పురస్కారం. దీని గురించే గౌతమ్‌ మాట్లాడారు.


'జెర్సీ' సినిమాలో నాని నటన చాలా అద్భుతంగా ఉంటుంది. తన గోల్ కోసం పోరాడే ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ గా నాని జీవించిపోయాడు. ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లడుకునే అతి కొన్ని అంశాల్లో నాని నటన ఒకటి. సినిమా ఆద్యంతం నాని… అద్భుతమైన నటనతో మెప్పించాడు. కొడుకు, భార్యతో వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్‌ సన్నివేశాలు లాంటివి సినిమాకు చాలా హైలైట్‌గా నిలిచాయి.ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించ్చాయి.

ఇక దీంతో ఈ సినిమాకు, నాని యాక్టింగ్ కి అవార్డుల పంట పండుతుంది అని అందరూ భావించారు. అయితే సినిమాకు పురస్కారం వచ్చింది. నానికి రాలేదు. ఇప్పుడదే మాట దర్శకుడు అన్నారు. సినిమా జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం గురించి కూడా స్పందించారు.''తెలుగు నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. వాటిలో మా 'జెర్సీ' విజేతగా నిలవడం ఆనందం. జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం రాలేదనే అసంతృప్తి లేదు. అయితే ఉత్తమ నటుడిగా నానికి ఈ సినిమాతో పురస్కారం వస్తుందనుకున్నా. రావాల్సింది కూడా. అదొక్కటి వచ్చుంటే 'జెర్సీ' పరిపూర్ణం అయ్యేది'' అని అన్నాడు గౌతమ్‌. నవీన్‌ నూలి గురించి మాట్లాడుతూ ''జెర్సీ'కి ఎడిటింగ్‌ విభాగంలో నవీన్‌ నూలికి జాతీయ పురస్కారం రావడం వచ్చింది. ఆయన మంచి ఎడిటర్‌. సినిమాపైనా, సన్నివేశాలపైనా మంచి పట్టు ఉంటుంది. జాతీయ పురస్కారానికి అతను అర్హుడు'' అని గౌతమ్ నవీన్ నూలి గురించి మాట్లాడాడు.





మరోసారి కొత్త సినిమాతో తన లక్ పరీక్షించుకోడానికి రాబోతున్న ఆది....

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>