PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/social-mediaku-shock-ichhina-high-court-karanamentante-ae35b17a-88a7-4d82-85b8-3ccd62b81d8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/social-mediaku-shock-ichhina-high-court-karanamentante-ae35b17a-88a7-4d82-85b8-3ccd62b81d8e-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా కు హైకోర్టు భారీ షాక్ ను ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. యువతుల ప్రాణాలను తీసేస్తుంది అంటూ హైకోర్టు దృష్టికి వచ్చిందని పలుమార్లు ఈ ఘటన పై కేసు నమోదు చేస్తున్న కూడా సామాజిక మాధ్యమాలు పట్టిచ్చుకోడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల విచారణ జరిపిన ఓ ఘటన పై హెచ్చరించిన సోషల్ మాధ్యమాలు పట్టించుకోక పోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..high court;high court;police;facebook;media;social media;petitioner;husband;letter;santoshamసోషల్ మీడియాకు షాక్ ఇచ్చిన హైకోర్టు.. కారణమేంటంటే?సోషల్ మీడియాకు షాక్ ఇచ్చిన హైకోర్టు.. కారణమేంటంటే?high court;high court;police;facebook;media;social media;petitioner;husband;letter;santoshamTue, 23 Mar 2021 12:00:00 GMTమీడియా కు హైకోర్టు భారీ షాక్ ను ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. యువతుల ప్రాణాలను తీసేస్తుంది అంటూ హైకోర్టు దృష్టికి వచ్చిందని పలుమార్లు ఈ ఘటన పై కేసు నమోదు చేస్తున్న కూడా సామాజిక మాధ్యమాలు పట్టిచ్చుకోడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల విచారణ జరిపిన ఓ ఘటన పై హెచ్చరించిన సోషల్ మాధ్యమాలు పట్టించుకోక పోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..


బాధితురాలి నగ్న ఫొటోలను తొలిగించాలని లేఖలు రాసినా ఎందుకు డిలీట్‌చేయలేదని సామాజిక మాధ్యమ సంస్థలను హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు  ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్‌లకు సోమవారం నోటీసులు జారీచేసింది. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడిన తన కుమార్తెను ప్రేమికుడు బ్లాక్‌మెయిల్‌ చేసి నగ్న ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడని, తమ ఫిర్యాదు ఆధారంగా సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ నుంచి ఆ ఫొటోలను తొలిగించారని బాధితురాలు తెలిపింది. తన కూతురుకు ఇప్పుడు 32 ఏండ్లని, భర్త,కుమారుడితో ఆస్ట్రేలియాలో స్థిరపడి సంతోషంగా ఉన్నదని, ఆ నేపథ్యంలో ఆ ఫొటోలు 2019లో మళ్లీ కనిపించాయని, వీటిని తొలిగించాలని సోషల్‌ మీడియా సంస్థలకు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని, పైగా ఫొటోలను తాము సోషల్‌మీడియాలో పెట్టలేదని చెప్తున్నాయని బాధితురాలి తల్లి  హైకోర్టును ఆశ్రయించారు.


మాదాపూర్‌లో ఉంటున్న తల్లి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌లోని ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌ ఫిర్యాదు ఏ దశలో ఉందో చెప్పాలని సైబర్‌ క్రైం పోలీసులను న్యాయమూర్తి జస్టిస్‌ కే లక్ష్మణ్‌ సోమవారం ఆదేశించారు. మాజీ ప్రియుడు చేసిన మోసం వల్ల ఒక గృహిణి వ్యక్తిగత చిత్రాల గోప్యతకు ఎలాంటి చర్యలు తీసుకున్నదీ చెప్పాలని పేర్కొన్నారు. నేరుగా బాధితురాలే లేఖ రాసినా ఎందుకు స్పందించలేదో కూడా వివరణ ఇవ్వాలన్నారు.. నిందితుల పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసును ఈ నెల 30 కి వాయిదా వేశారు.


నాగ్ సినిమా డిజాస్టర్... డిప్రెషన్ లో డైరెక్టర్...?

వకీల్ సాబ్ సీక్రెట్ లు బయటపెట్టిన తమన్..

కాపు వేద‌న: ఈసారైనా న్యాయం చేస్తారా... కాపుల ఎదురు చూపు..!

క‌మ‌ల్ రాజ‌కీయానికి ఎన్ని క‌ష్టాలు...!

బాబు మొదలు పెట్టారు.. జగన్ పూర్తి చేశారు..

భార్య పుట్టిన రోజుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్..?

పవన్ ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ అదే నిజమయితే పెద్ద దెబ్బే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>