PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/varla-ramaiah6c7af885-cdc6-4b26-915c-d6c16cc9ef26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/varla-ramaiah6c7af885-cdc6-4b26-915c-d6c16cc9ef26-415x250-IndiaHerald.jpgజగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. తనపై ఉన్నకేసులవిచారణ పూర్తైతే తానుఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయంతో జగన్ ఉన్నాడు అని ఆయన ఎద్దేవా చేసారు. చంద్రబాబుని ఏదోరకంగా జైలుకు పంపి, ఆయనకూడా తప్పుచేశాడని ప్రజలతో అనిపించడానికి నానాపాట్లు పడుతున్నాడు అని ఆరోపించారు. అందులో భాగంగానే చంద్రబాబు చేసిన తప్పులను వెతికిపట్టుకున్నవారికి అవార్డులు ఇస్తానని అధికారులకు ఆశచూపాడు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఆ క్రమంలోనే ఆళ్ల రామకృష్ణvarla ramaya,tdp,cbn,ap;cbn;kumaar;pavani;sunil;alla rama krishna reddy;jagan;capital;arrest;tdp;reddy;yerrabalem;varla ramaiah;sajjala ramakrishna reddyచంద్రబాబుపై కేసు... సంచలన విషయాలు బయటపెట్టిన టీడీపీచంద్రబాబుపై కేసు... సంచలన విషయాలు బయటపెట్టిన టీడీపీvarla ramaya,tdp,cbn,ap;cbn;kumaar;pavani;sunil;alla rama krishna reddy;jagan;capital;arrest;tdp;reddy;yerrabalem;varla ramaiah;sajjala ramakrishna reddyTue, 23 Mar 2021 07:00:00 GMTరెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. తనపై ఉన్నకేసులవిచారణ పూర్తైతే తానుఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయంతో  జగన్ ఉన్నాడు అని ఆయన ఎద్దేవా చేసారు. చంద్రబాబుని ఏదోరకంగా జైలుకు పంపి, ఆయనకూడా తప్పుచేశాడని ప్రజలతో అనిపించడానికి నానాపాట్లు పడుతున్నాడు అని ఆరోపించారు. అందులో భాగంగానే చంద్రబాబు చేసిన తప్పులను వెతికిపట్టుకున్నవారికి అవార్డులు ఇస్తానని అధికారులకు ఆశచూపాడు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

ఆ క్రమంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని వెనకాముందూ ఆలోచించకుండా సీఐడీ చంద్రబాబుకి నోటీసులిచ్చింది అని అన్నారు. ఆళ్ల తన ఫిర్యాదులో పేర్కొన్న ఐదుగురు రైతులు ఎవరూకూడా రాజధానికి వారి భూములివ్వలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. వారిలో ఒకడైన జూపూడి జాన్సన్ వైసీపీవిద్యార్థి విభాగం నాయకుడు, అతనిపై కిడ్నాప్ కేసు కూడా ఉంది అని అన్నారు. చినలక్ష్మయ్య అనేవ్యక్తి నవులూరు సమీపంలోని మక్కపేటవాసి, ఆగ్రామం రాజధాని పరిధిలో లేదని ఆయన పేర్కొన్నారు.

అతని తల్లిపేరుతో ఉన్న 70సెంట్ల స్థలాన్ని అతనికి ఇప్పిస్తానంటూ రామకృష్ణారెడ్డి, అతనితో సంతకం చేయించుకున్నాడు అని, ఎర్రబాలెంకు చెందిన కందా పావని వాలంటీర్ గా పనిచేస్తోంది అని ఆయన వివరించారు. ఆమెకు చెందిన 75సెంట్ల భూమి కాలువకింద పోతే, దానికి పట్టాఇప్పిస్తానని నమ్మబలికిన రామకృష్ణారెడ్డి ఆమెతో సంతకం చేయించుకున్నాడు అని వ్యాఖ్యానించారు. మిగిలిన ఇద్దరు కూడా అదేవిధంగా రామకృష్ణారెడ్డిచెప్పిన మాటలకు మోసపోయారు అని ఆయన చెప్పుకొచ్చారు. రాజధాని పరిధిలో లేనివారు, రాజధానికి సెంటు భూమి ఇవ్వనివారు ఫిర్యాదు చేశారని రామకృష్ణారెడ్డి చెబితే, ఏమాత్రం విచారణ జరపకుండా సీఐడీ మాజీ ముఖ్యమంత్రికి నోటీసులివ్వడమేంటి?  అని నిలదీశారు. రైతులను మోసగించి, వారితో తప్పుడు సంతకాలు పెట్టించుకున్నందుకు రామకృష్ణారెడ్డిపై ఛీటింగ్ ఫోర్జరీ కేసులుపెట్టి, వెంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేసారు. ఆళ్ల ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తక్షణమే  విచారణ జరపాలి అని డిమాండ్ చేసారు.


ఇంగ్లండ్ జట్టుకు ఆడబోతున్న అయ్యర్.. త్వరలో ఆ దేశానికి..

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>