PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-leader-pattabhi-sensational-commentsae20e1c4-9b53-4f0b-bd19-7f0158e16053-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-leader-pattabhi-sensational-commentsae20e1c4-9b53-4f0b-bd19-7f0158e16053-415x250-IndiaHerald.jpgటిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో ఇసుకను జెపి పవర్ వెంచర్స్ కు అప్పగించడంపై ప్రభుత్వం కాకమ్మ కబుర్లు చెబుతోంది అని, టెండరు ఖరారు చేసి 24గంటలు గడవకముందే టన్నుకు 100రూపాయలకు పైగా ధర పెంచి ప్రజలపై భారం మోపిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా నమ్ముతారు? అని ఆయన నిలదీశారు. క్విడ్ ప్రో కో లేకపోతే రాష్ట్రంలోని 3 రీజియన్ల టెండర్లు ఒకే కంపెనీ ఎలా దక్కించుకుంటుంది? అని నిలదీశారు. లక్షలాదిమంది కార్మికులను రోడ్డున పడవేయడానికి ఈ ప్రభుత్వానికి మనసెలా ఒప్పింది? అని ప్రశ్నించాpattabhi,tdp,ycp,ap;tara;ram madhav;minister;letter;tdp;research and analysis wing50 కోట్ల లాభం కోసం వంద కోట్ల యంత్రాలు50 కోట్ల లాభం కోసం వంద కోట్ల యంత్రాలుpattabhi,tdp,ycp,ap;tara;ram madhav;minister;letter;tdp;research and analysis wingTue, 23 Mar 2021 11:10:00 GMTటిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో ఇసుకను జెపి పవర్ వెంచర్స్ కు అప్పగించడంపై ప్రభుత్వం కాకమ్మ కబుర్లు చెబుతోంది అని, టెండరు ఖరారు చేసి 24గంటలు గడవకముందే టన్నుకు 100రూపాయలకు పైగా ధర పెంచి ప్రజలపై భారం మోపిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా నమ్ముతారు? అని ఆయన నిలదీశారు. క్విడ్ ప్రో కో లేకపోతే రాష్ట్రంలోని 3 రీజియన్ల టెండర్లు ఒకే కంపెనీ ఎలా దక్కించుకుంటుంది? అని నిలదీశారు. లక్షలాదిమంది కార్మికులను రోడ్డున పడవేయడానికి ఈ ప్రభుత్వానికి మనసెలా ఒప్పింది? అని ప్రశ్నించారు.

మంత్రి పెద్దిరెడ్డి ఎక్కడ దాక్కున్నారు, ఆయన ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేసారు. టెండరు దక్కించుకున్న జయప్రకాష్ పవర్ వెంచర్స్ లో పెద్దిబొట్ల గంగాధర శాస్త్రి డైరక్టర్ గా ఉన్నారా, లేదా? అని నిలదీశారు. శాస్త్రి రాంకీ సంస్థలో డైరక్టర్ అవునా, కాదా? జయప్రకాష్ వెంచర్స్ సంస్థ 3వేల 500 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందా, లేదా? అని నిలదీశారు. ఇసుక టెండరు బాధ్యత నిర్వహించింది ఎంఎస్ టిసి అయినప్పటికీ గైడ్ లైన్స్ రూపొందించింది ఎవరు? మేమే గైడ్ లైన్స్ రూపొందించామని ఎంఎస్ టిసి తో లెటర్ ఇప్పించగలరా? అని ఆయన డిమాండ్ చేసారు.

ఏడాదికి కేవలం రూ.50కోట్లు మాత్రమే జెపి సంస్థకు లాభం వస్తుందని మీరు ఎలా చెబుతారు? రూ. 50కోట్ల కోసం వందలకోట్ల రూపాయల యంత్రసామాగ్రిని ఆ సంస్థ రప్పిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రతిరోజు 1.25లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అని అన్నారు. వరదల సమయంలో కొద్దిరోజులు తవ్వకాలు జరగకపోయినా ఏడాదికి 300 రోజుల్లో 3కోట్ల 75లక్షల టన్నులు ఇసుక తవ్వకాలు జరుగుతాయి అని తెలిపారు. హోల్ సేల్ గా రాష్ట్రాన్ని లూటీ చేయాలని చూస్తే ఊరుకోం. న్యాయబద్ధంగా మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని డిమాండ్ చేసారు.     ప్రజలపై భారం తగ్గించేవరకు ఉద్యమిస్తాం, సమాధానం చెప్పే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం అన్నారు.


మతిమరుపు తో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...!

జాతీయ స్థాయిలో ‌పినాకిల్ బ్లూమ్స్ సేవ‌లు‌.. విజ‌య‌వాడ‌లో ఈ నెల 29న గొప్ప ప్రారంభం..!

నేడు సాగ‌ర్ అభ్య‌ర్థి ఫైన‌ల్‌.... ఆ వ‌ర్గం నేత‌కే టికెట్ క‌న్ఫార్మ్ అంటా...!

ఏబీఎన్ జర్నలిస్ట్ యొక్క నిర్వాకం..బయటకు తోసేసిన యజమాన్యం..!!

హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు రాజ‌కీయ తేజం..బాల‌యోగి..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>