PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda12459de4-4e0b-40ef-8443-bef421e17f39-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda12459de4-4e0b-40ef-8443-bef421e17f39-415x250-IndiaHerald.jpgనిమ్మగడ్డ రమేష్ కుమార్. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. ఆయన న్యాయ శాస్త్రాన్ని కూడా అభ్యసించారు. సీనియర్ ఐఏఎస్ గా పని చేసి రిటైర్ అయ్యాడు. మొత్తానికి ఎన్నికల అధికారిగా ఆయన తన అయిదేళ్ళ పదవీ కాలం కొద్ది రోజులల్లో ముగియనుంది. nimmagadda;kumaar;andhra pradesh;government;court;success;march;t n sheshanమొత్తానికి పవరేంటో చూపించిన నిమ్మగడ్డ ?మొత్తానికి పవరేంటో చూపించిన నిమ్మగడ్డ ?nimmagadda;kumaar;andhra pradesh;government;court;success;march;t n sheshanTue, 23 Mar 2021 20:00:00 GMT
ఇక నాలుగేళ్ళుగా ఎలా ఉన్నా కూడా ఆయన చివరి ఏడాది మాత్రం సంచలనానికి మారు పేరు అయ్యారు. తాను అనుకున్నది చేశారు. అనుకున్నట్లుగానే ముందుకు అడుగులు వేశారు. ఎపుడు ఎన్నికలు పెట్టారో ఎపుడు ఆపాలో కూడా తెలుసుకుని  ఆయనే చేశారు. ఇక పరిషత్ ఎన్నికలను పూర్తిగా పెండింగులో పెట్టి మరీ పదవీ విరమణ చేస్తున్నారు. నిమ్మగడ్డతో పోరాటం చేసిన ప్రతీసారి ఏపీ సర్కార్ ఓడిపోతోంది. దానికి కారణం ఏంటి అంటే నిమ్మగడ్డ కాదు, రాజ్యాంగం అక్కడ ఉంది. రాజ్యాంగం నిర్వచించిన విశేష అధికారాలతోనే నిమ్మగడ్డ ఇవన్నీ చేయగలిగారు. గతంలో ఎన్నికల సంఘం అధికారులుగా వచ్చిన వారు ప్రభుత్వంతో సర్దుకుపోయి అనుగుణంగా తమ కార్యక్రమాలు చేసేవారు.

కాబట్టి నిమ్మగడ్డ చేస్తున్నది తప్పు అని చాలా మందికి అనిపించింది. మరి కొంతమందికి అయితే నిమ్మగడ్డ ఏదో కక్ష కట్టినట్లుగా చేస్తున్నారు అనిపించింది. ఎవరేమనుకునా ఎలా నిర్వచనం చెప్పుకున్నా నా రూటే సెపరేట్ అన్నట్లుగా నిమ్మగడ్డ వ్యవహరించారు. ఆయన తన పదవీ కాలాన్ని తాను అనుకున్నట్లుగానే పూర్తి చేస్తున్నారు.గత ఏడాది మార్చి 15న కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేశారు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి ఉండాల్సింది అన్న మాటనే కోర్టు చెప్పింది. ఇక మళ్ళీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు అంటే  ప్రభుత్వం ససేమిరా అంది. కానీ నిమ్మగడ్డకు విశేష అధికారాలు ఉన్నాయి. ఆయన ఎపుడు ఎన్నికలు అంటే అపుడు ఎన్నికలు జరగాల్సిందే రాజ్యాంగబద్ధమైన తీర్పు వెలువడింది. ఇక పరిషత్ ఎన్నికలు జరిపించలసిందిగా నిమ్మగడ్డను ఆదేశించాలని కోర్టుకు వెళ్ళినా ఆయన్ని ఆదేశించజాలమనే తీర్పు వచ్చింది.

దీన్ని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎన్నికల సంఘానికి విశేష అధికారాలు ఉన్నాయి. వాటిని తుచ తప్పకుండా వాడుకున్న వారు గతంలో శేషన్ అయితే ఇపుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్. మొత్తానికి తాను ఎలా చేయాలనుకున్నా అలాగే చేసి నిమ్మగడ్డ సక్సెస్ ఫుల్ గానే పదవీవిరమణ చేస్తున్నారు అనుకోవాలి.





క్రాష్ అవుతున్న వందల ఆండ్రాయిడ్ యాప్స్.. ఇబ్బందుల్లో గూగుల్

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>