PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-gudivada-politics-reverse-to-kodali-nani526e0c9d-e2f4-4391-944a-264b9992219c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-gudivada-politics-reverse-to-kodali-nani526e0c9d-e2f4-4391-944a-264b9992219c-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లా రాజకీయాల్లో గుడివాడ ఎప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొడాలి నాని ఉన్నారు. ఈయనే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. నాలుగుసార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాని ఇప్పుడు..జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. బాగా దూకుడు స్వభావం కలిగిన నాని..ప్రతిపక్ష టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు. kodali nani;cbn;nani;kodali nani;amarnath cave temple;krishna river;jagan;district;government;krishna district;tdpగుడివాడ పాలిటిక్స్: కొడాలికి రివర్స్ అవుతుందా?గుడివాడ పాలిటిక్స్: కొడాలికి రివర్స్ అవుతుందా?kodali nani;cbn;nani;kodali nani;amarnath cave temple;krishna river;jagan;district;government;krishna district;tdpTue, 23 Mar 2021 02:00:00 GMTకృష్ణా జిల్లా రాజకీయాల్లో గుడివాడ ఎప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొడాలి నాని ఉన్నారు. ఈయనే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. నాలుగుసార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాని ఇప్పుడు..జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. బాగా దూకుడు స్వభావం కలిగిన నాని..ప్రతిపక్ష టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు.

వైసీపీలో ఏ నాయకుడు విమర్శలు చేయని విధంగా నాని....చంద్రబాబు అండ్ బ్యాచ్‌పై చేస్తున్నారు. ఏ మాత్రం మొహమాటం లేకుండా, కాస్త పరుష పదజాలం వాడుతూ, చంద్రబాబు, నారా లోకేష్‌లని ఏకిపారేస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా బాబుకు చెమటలు పట్టిస్తున్నారు. అయితే ఇలా నాని పరుషంగా మాట్లాడటం కరెక్ట్ కాదనే వాదనలు కూడా ఉన్నాయి.

మరీ ఇలా బూతులు మాట్లాడటం వల్ల నాని ఇమేజ్ దెబ్బ తింటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు ఎప్పుడు నిర్మాణాత్మకంగా ఉండాలని, కానీ నాని ఆ పరిధి దాటేసి మాట్లాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక నాని మాటలకు టీడీపీ నేతలు ఎలాంటి కౌంటర్లు ఇస్తున్నారో తెలిసిందే. నాని ఏమన్నా చంద్రబాబుపై విమర్శలు చేస్తే చాలు టీడీపీ నేతలు ఎటాక్ చేసేస్తున్నారు. వాళ్ళు కూడా కాస్త ఎక్కువగానే పరుష పదజాలం వాడుతున్నారు.

ఇలా టీడీపీ నేతలు కూడా రివర్స్‌లో మాట్లాడటం వలన, నాని మాట్లాడే మాటల్లో తప్పు లేదనే వాదన కూడా వినిపిస్తోంది. పైగా సొంత నియోజకవర్గం గుడివాడలో నానికి పెద్ద నష్టం కూడా జరగలేదు. ఇక్కడ ప్రజలు నాని వర్క్‌ చూస్తున్నారు తప్పా, రాజకీయంగా జరిగే వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే పంచాయితీ ఎన్నికల్లో సైతం నానికి మంచి ఫలితాలు వచ్చాయి. అయితే ఇక్కడ టీడీపీ నాయకత్వం వీక్ గా ఉండటం కూడా నానికి కలిసొస్తుంది. మొత్తానికైతే గుడివాడలో నానికి రివర్స్ అయింది ఏమి లేదు. ఇక్కడ ప్రజలు ఇంకా నాని నాయకత్వానికే జై కొడుతున్నారు.




నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?

జనసేన నేతలకు పవన్ షాక్ ఇస్తారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>