National
oi-Madhu Kota
అహింస, ఇతర గాంధేయ పద్ధతుల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు తోడ్పడే వ్యక్తులకు భారత ప్రభుత్వం అందజేసే ‘గాంధీ శాంతి బహుమతి’ని కేంద్ర సాంస్కృతిక శాఖ సోమవారం ప్రకటించింది. 2019, 2020 ఏడాదికిగానూ ఒకేసారి ఇద్దరికి అవార్డులను ప్రకటించారు. 2019కిగానూ ఒమన్ రాజు దివంగత సుల్తాన్ ఖాబూస్ బిన్ సాయిద్ అల్ సయిద్‌ను గాంధీ శాంతి పురస్కారానికి ఎంపిక చేశారు. ఇక 2020 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతి బంగ్లాదేశ్ జాతిపిత, బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్‌కు దక్కింది.
వ్యాక్సిన్లపై కేంద్రం సంచలన ప్రకటన -కొవిషీల్డ్ రెండో డోసు గ్యాప్ 8వారాలకు పెంపు -ఎందుకంటే
1995 నుంచి గాంధీ శాంతి బహుమతిని భారత ప్రభుత్వం అందజేస్తున్నది. గాంధీ 125వ జయంతి ఉత్సవం సందర్భంగా ఆ అవార్డును స్థాపించారు. చివరిసారి 2018లో జపాన్ కు చెందిన యోవి ససకవాకు ఈ పురస్కారం దక్కింది. కుష్టువ్యాధి నిర్మూలన కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా గాంధీ శాంతి అవార్డు లభించింది. గతేడాది కరోనా పరిస్థుల నేపథ్యంలో అవార్డుల ప్రకటన వాయిదా పడగా, 2019, 2020 లకు కలిపి ఇవాళ పేర్లను ప్రకటించారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఈ అవార్డు విజేతలను ఎంపిక చేసింది. ఈ కమిటీలో ఇద్దరు ఎక్స్ ఆఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. దాంట్లో చీఫ్ జస్టిస్‌తో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఉంటారు. జ్యూరీలో ఇద్దరు ప్రముఖులు కూడా ఉంటారు. వారిలో ఒకరు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ బిందేశ్వర్ పాఠక్‌లు ఉన్నారు. మార్చి 19, 2021వ తేదీన జ్యూరీ సమావేశమై, సంప్రదింపుల తర్వాత ఏకపక్షంగా అవార్డు విజేతలను ఎంపకి చేశారు. విజేతలకు కోటి రూపాయల నగదు ఇస్తారు. ఓ ప్రశంసా పత్రం, చేనేత వస్తువులను అందజేస్తారు. కాగా,
భారత్-పాక్ రహస్య శాంతి ప్రణాళిక -యూఏఈ మధ్యవర్తిత్వం -ఇమ్రాన్‌కు మోదీ విషెస్ – త్వరలో సంచలనాలు
బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26, 27 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. మోదీ పర్యటనకు నాలుగు రోజుల ముందే బంగ్లా జాతిపితకు భారత్ అందించే ప్రతిష్టాత్మక గాంధీ శాంతి అవార్డు దక్కడం గమనార్హం. మానవ హక్కుల స్థాపనలో బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మన్ కృషి గొప్పదని, ఆయన ఇండియన్లకు కూడా హీరో అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక
2019 గాంధీ శాంతి బహుమతికి ఎంపికైన ఒమన్ మాజీ పాలకుడు దివంగత సుల్తాన్ ఖాబూస్ ఓ విజినరీ నేతగా, అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో కీలక పాత్రధారిగా వ్యవహరించారు. భారత్ ఆయిల్ అవసరాలను తీర్చగలిగేలా ఒమన్ సహా గల్ఫ్ దేశాలతో బంధాన్ని బలోపేతం చేసిన కీలక వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఇండియాలోనే చదువుకున్న ఆయన.. ఇండియాతో మంచి స్నేహాన్ని కొనసాగించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య నిర్మాణంలో సుల్తాన్ ఖాబూస్ కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ గతంలో తెలిపారు.