PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jaganb17c4ba3-5e5a-4340-8197-6f67dccd385a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jaganb17c4ba3-5e5a-4340-8197-6f67dccd385a-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ అధికారంలోకి రాగానే.. ముందుగా అమరావతిపై భ్రమలు తొలగించారు. ఆ తర్వాత అమరావతి నుంచి రాజధానిని మార్చేస్తున్నానని ప్రకటించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా పక్కకు పెట్టేశారు. విశాఖను కార్యనిర్వహాక రాజధానిగా ప్రకటించారు. ఒక రాజధాని కాదు.. మూడు రాజధానులు ఉన్నారు. అయితే దీనికి కౌంటర్‌గా తెలుగు దేశం చేసిన అమరావతి ఉద్యమం అంతగా విజయవంతం కాలేదు. ఈ నిర్ణయం తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఆ ప్రాంత ప్రజలు కూడా జగన్‌ పార్టీని ఓడించలేదు. దీంతో ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజామోదం jagan;women;jagan;amaravati;capital;chief ministerఎన్ని ఎన్నికలు గెలిచినా.. జగన్ వీరికి సమాధానం చెప్పాల్సిందే..?ఎన్ని ఎన్నికలు గెలిచినా.. జగన్ వీరికి సమాధానం చెప్పాల్సిందే..?jagan;women;jagan;amaravati;capital;chief ministerMon, 22 Mar 2021 07:00:00 GMTజగన్ అధికారంలోకి రాగానే.. ముందుగా అమరావతిపై భ్రమలు తొలగించారు. ఆ తర్వాత అమరావతి నుంచి రాజధానిని మార్చేస్తున్నానని ప్రకటించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా పక్కకు పెట్టేశారు. విశాఖను కార్యనిర్వహాక రాజధానిగా ప్రకటించారు. ఒక రాజధాని కాదు.. మూడు రాజధానులు ఉన్నారు. అయితే దీనికి కౌంటర్‌గా తెలుగు దేశం చేసిన అమరావతి ఉద్యమం అంతగా విజయవంతం కాలేదు. ఈ నిర్ణయం తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఆ ప్రాంత ప్రజలు కూడా జగన్‌ పార్టీని ఓడించలేదు.  


దీంతో ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజామోదం లభించినట్టే భావించాల్సి వస్తుంది. అయితే.. అదే నిజమైనా.. జగన్ అన్ని ఎన్నికలు గెలుస్తూ వస్తున్నా.. అమరావతి రైతులకు మాత్రం ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నగరాలు అంటూ ప్రచారంతో ఊదరగొట్టేసి.. రాజధాని రైతులకు ఎన్నో ఆశలు చూపారు. కాని అవేవి ఒక రూపానికే రాలేదు. భారీ స్థాయిలో టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు.. ఏ దేశం వెళితే ఆ దేశ రాజధానులను పోలిన విధంగా నగరాన్ని నిర్మిస్తున్నామని చెబుతూ వచ్చారు.


అయితే చంద్రబాబు సమయంలో అతివృష్టి అయితే జగన్ కాలంలో అనావృష్టి అన్నట్టుంది పరిస్థితి.
అందుకే జగన్ ఇప్పటికైనా అమరావతి రైతుల విషయంలో ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించాలి. భూములు ఇచ్చిన రైతులకు కౌలు ఇస్తున్న మాట నిజమే అయినా.. వారికి ప్లాట్లు కూడా ఇవ్వవలసి ఉంది. గత ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉన్నా వాటిని రైతులకు అప్పగించలేదు. చంద్రబాబు పోయి జగన్ వచ్చినా ఇంకా ఆ ప్లాట్ల విజయం అలాగే ఉండిపోయింది.


అందుకే.. జగన్ ప్రభుత్వం ఆచరణలో ఎంతవరకు చేయగలుగుతుందో అదంతా చేయడం ద్వారా ఆ గ్రామాలవారిలో విశ్వాసం పొందాలి. అమరావతి రైతులతో చర్చించాలి. వారి ముందు ఉన్న ఆప్షన్లు వివరించాలి. వారిని కన్విన్స్ చేసి సమస్యను పరిష్కరించాలి. ఓ కొలిక్కి తేవాలి.




భార్యపై అనుమానం.. అక్కడ దారంతో కుట్టేసిన భర్త.. చివరికి..?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>