Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagane68bc084-de4c-426d-9f75-f52d520ee2b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagane68bc084-de4c-426d-9f75-f52d520ee2b0-415x250-IndiaHerald.jpgఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిపోయాయి. ఇక ఎన్నికలలో అధికార పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ఇక భారీ మెజారిటీతో అధికార పార్టీ తమకు తిరుగులేదు అని నిరూపించింది. అయితే ఇటీవలే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వేడి కాస్త తగ్గింది అనుకునేలోపే మరికొన్ని రోజుల్లో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరిగేందుకు అంత సిద్ధమవుతోంది. అయితే మొన్నటి వరకు పంచాయతీJagan;view;tiru;jagan;andhra pradesh;congress;2019;tirupati;panchayati;husband;tdp;ycp;party;mantraభారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?Jagan;view;tiru;jagan;andhra pradesh;congress;2019;tirupati;panchayati;husband;tdp;ycp;party;mantraMon, 22 Mar 2021 15:00:00 GMTఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిపోయాయి.  ఇక ఎన్నికలలో అధికార పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ఇక భారీ మెజారిటీతో అధికార పార్టీ తమకు తిరుగులేదు అని నిరూపించింది. అయితే ఇటీవలే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వేడి కాస్త తగ్గింది అనుకునేలోపే మరికొన్ని రోజుల్లో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరిగేందుకు అంత సిద్ధమవుతోంది.



 అయితే మొన్నటి వరకు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని చివరికి నిరాశ చెందిన ప్రతిపక్ష పార్టీలు ఈ సారి మాత్రం తిరుపతి ఉప ఎన్నికలో వ్యూహాత్మకంగా పావులు కదిపి.. అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాయి. అదేసమయంలో గతంలో మాదిరిగానే ఈసారి ఘన విజయం సాధించి  తమ సత్తా చాటాలని అధికార పార్టీ కూడా సిద్ధం అవుతోంది.  అయితే గతంలో రెండు లక్షలకు పైచిలుకు ఓట్ల మెజారిటీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంటు స్థానంలో గెలుపొందగా ఇక ఈ సారి మాత్రం ఏకంగా నాలుగు లక్షల పైచిలుకు మెజారిటీ తో తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపొందాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.


 ఈ క్రమంలోనే తిరుపతి ఉప ఎన్నిక కోసం నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జిలుగా మంత్రులను నియమించారు సీఎం జగన్. నాలుగు లక్షల మెజారిటీతో గెలవాలని మంత్రులకు ఒక టార్గెట్ ఇచ్చారట. అయితే తిరుపతి పార్లమెంటు సెగ్మెంట్లో 16.5 లక్షల మంది ఓటర్లు ఉండగా 2019 లో జరిగిన ఎన్నికల్లో 13.2 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే దాదాపుగా 80 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ పై వైసీపీ ఏకంగా 2.28 లక్షల మెజారిటీతో విజయం సాధించింది. ఇక ఇప్పుడు పోలింగ్ శాతం పెంచడంతో పాటు నాలుగు లక్షల మెజారిటీని సాధించాలని సీఎం జగన్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.



'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?

జగన్ తోనే జగన్ కి పోటీయా.. ఎక్కడ ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>