MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-sukumar5e170f19-4708-40ab-9d9e-2c53eeb18e2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-sukumar5e170f19-4708-40ab-9d9e-2c53eeb18e2c-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమకి అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుకుమార్. అను మెహతా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని నిర్మించారు. అయితే దర్శకుడిగా తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న సుకుమార్ ఆపై తెరకెక్కించిన జగడం సినిమా తో మాత్రం పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అనంతరం మరొకసారి అల్లు అర్జున్ తో ఆర్య సీక్వెల్ గా తీసిన ఆర్య 2 కూడా ఫెయిల్యూర్ గా నిలిచింది. అనంతరం allu arjun;sukumar;cbn;mahesh;naga chaitanya;kumaar;allu arjun;arya;devi sri prasad;geetha;mahesh babu;prasad;sukumar;tamannaah bhatia;tollywood;cinema;sangeetha;rajani kanth;media;love;1 nenokkadine;heroine;success;arjun 1;arya 2;sri venkateshwara creations;sara shrawan;dil;aryaaమహేష్ తో అనుకున్నది వేరు .... బన్నీ తో తీస్తున్నది వేరట ....నిజమేనా ....??మహేష్ తో అనుకున్నది వేరు .... బన్నీ తో తీస్తున్నది వేరట ....నిజమేనా ....??allu arjun;sukumar;cbn;mahesh;naga chaitanya;kumaar;allu arjun;arya;devi sri prasad;geetha;mahesh babu;prasad;sukumar;tamannaah bhatia;tollywood;cinema;sangeetha;rajani kanth;media;love;1 nenokkadine;heroine;success;arjun 1;arya 2;sri venkateshwara creations;sara shrawan;dil;aryaaMon, 22 Mar 2021 22:50:00 GMTసినిమా పరిశ్రమకి అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుకుమార్. అను మెహతా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని నిర్మించారు. అయితే దర్శకుడిగా తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న సుకుమార్ ఆపై తెరకెక్కించిన జగడం సినిమా తో మాత్రం పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అనంతరం మరొకసారి అల్లు అర్జున్ తో ఆర్య సీక్వెల్ గా తీసిన ఆర్య 2 కూడా ఫెయిల్యూర్ గా నిలిచింది. అనంతరం నాగచైతన్య, తమన్నా ల కలయికలో సుకుమార్ తెరకెక్కించిన 100 పర్సెంట్ లవ్ మూవీ సూపర్ హిట్ కొట్టి దర్శకుడిగా ఆయనకు మంచి బ్రేక్ అందించింది.

వీటి అనంతరం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తోనే ఒక సినిమా అవకాశం దక్కించుకున్న సుకుమార్ ఆయనతో వన్ నేనొక్కడినే అనే భారీ ప్రయోగాత్మక సినిమా తీశారు. ఎంతో భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా కొట్టింది. కాగా మరొకసారి మహేష్ తో సుకుమార్ సినిమా చేస్తారనే వార్తలు కొన్నాళ్ల క్రితం ప్రచారం అయ్యాయి. ఆ తర్వాత ఇటీవల ఒకానొక సందర్భంలో మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పందిస్తూ సుకుమార్ గారితో కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ ల వల్ల సినిమా చేయలేకపోతున్నాను రాబోయే రోజుల్లో ఆయన కాంబోలో మంచి సినిమా ఉంటుంది అంటూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ తో పుష్ప మూవీ మొదలెట్టాడు సుకుమార్.

అయితే ఈ విషయమై ఒక వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలలో విస్తృతంగా వైరల్ అవుతుంది. నిజానికి మహేష్ బాబుకి సుకుమార్ వినిపించింది పుష్ప స్టోరీనే అని, ఆయన చేయలేను అని చెప్పిన అనంతరం ప్రస్తుతం అల్లు అర్జున్ తో దానిని తెరకెక్కిస్తున్నారని అయితే స్టోరీలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసిన తరువాతనే ఈ మూవీ చేయడానికి అల్లు అర్జున్ ఒప్పుకున్నారనేది ప్రచారం అవుతున్న వార్త యొక్క సారాంశం. అయితే అది వాస్తవం కాదని, సుకుమార్ అల్లు అర్జున్ కి చెప్పిన స్టోరీ, అలానే మహేష్ కి చెప్పిన స్టోరీ వేరని మరికొందరు అంటున్నారట. మరి వీటిలో ఏది వాస్తవమో తెలియాలి అంటే స్వయంగా దీని పై పుష్ప యూనిట్ స్వయంగా స్పందించాల్సి ఉంది అంటున్నారు విశ్లేషకులు....!!


చేత‌బ‌డి చేస్తూ అడ్డంగా దొరికాడు..ఘ‌ట‌నాస్థ‌లంలో దారుణ స‌న్నివేశం..!

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>