EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-tdp-smashed-due-to-jagan-punch-in-panchayat-and-municipal-electionsbcd68e4d-66b2-4d2c-b722-46264db8d34e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-tdp-smashed-due-to-jagan-punch-in-panchayat-and-municipal-electionsbcd68e4d-66b2-4d2c-b722-46264db8d34e-415x250-IndiaHerald.jpgఅలాగే 74 మున్సిపాలిటిల్లో 43 ఛైర్మన్ పదవులను బీసీలకే కేటాయించారు. ఇందులో కూడా మహిళలకు సముచిత స్ధానాన్నే ఇచ్చారు. మేయర్లయినా, ఛైర్మన్లు, ఛైర్ పర్సన్లుగా ఎన్నికైన వారిలో అత్యధికులు కొత్తవారు, యువతే కారణం విశేషం. అంటే రాజకీయాల్లోకి కొత్తగా ఎంటరైన వారికి, పెద్దగా రాజకీయ నేపధ్యంలేని వారిని ఏరికోరి జగన్ ఎంపిక చేశారు. జగన్ తాజా ఎంపికతో అక్కడక్కడ అసంతృప్తులు వినబడుతున్నా హోలు మొత్తం మీద మెజారిటి సెక్షన్లు చాలా హ్యాపీగీ ఫీలవుతున్నట్లు సమాచారం. మొదటినుండి జగన్ చెబుతున్నట్లే మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు,jagan ycp tdp naidu janasena pawan bjp modi;cbn;tara;tiru;telugu desam party;korcha;jagan;n. chandrababu naidu;telugu;scheduled caste;backward classes;tirupati;cm;husband;tdp;reddy;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?jagan ycp tdp naidu janasena pawan bjp modi;cbn;tara;tiru;telugu desam party;korcha;jagan;n. chandrababu naidu;telugu;scheduled caste;backward classes;tirupati;cm;husband;tdp;reddy;partyMon, 22 Mar 2021 05:00:00 GMTముఖ్యమంత్రులు తీసుకునే నిర్ణయాల మీద పార్టీల భవిష్యత్తు ఆధారపడుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే పార్టీ అధినేతలే ప్రాంతీయపార్టీల్లో ముఖ్యమంత్రులవుతారు. కాబట్టి పార్టీ అధినేతగా అయినా, సీఎంగా అయినా సదరు నేత తీసుకునే నిర్ణయం ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్నే చూపుతుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో చంద్రబాబునాయుడుపై చాలా తీవ్రమైన ప్రభావాన్నే చూపేట్లుంది. మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల నియామకంలో జగన్ తీసుకున్న సోషల్ ఇంజనీరింగ్ విధానంతో టీడీపీ పని ఖల్లాసే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 11 కార్పొరేషన్లలో ఎనిమిది చోట్ల బీసీ+మైనారిటీలకే అవకాశం ఇచ్చారు. ఇందులో కూడా ఏడుమంది మహిళలకు పెద్దపీట వేయటం ఆశ్చర్యంగా ఉంది.




అలాగే 74 మున్సిపాలిటిల్లో 43 ఛైర్మన్ పదవులను బీసీలకే కేటాయించారు. ఇందులో కూడా మహిళలకు సముచిత స్ధానాన్నే ఇచ్చారు. మేయర్లయినా, ఛైర్మన్లు, ఛైర్ పర్సన్లుగా ఎన్నికైన వారిలో అత్యధికులు కొత్తవారు, యువతే కారణం విశేషం. అంటే రాజకీయాల్లోకి కొత్తగా ఎంటరైన వారికి, పెద్దగా రాజకీయ నేపధ్యంలేని వారిని ఏరికోరి జగన్ ఎంపిక చేశారు. జగన్ తాజా ఎంపికతో అక్కడక్కడ అసంతృప్తులు వినబడుతున్నా హోలు మొత్తం మీద మెజారిటి సెక్షన్లు చాలా హ్యాపీగీ ఫీలవుతున్నట్లు సమాచారం. మొదటినుండి జగన్ చెబుతున్నట్లే మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, యువత, మైనారిటిలకే పెద్దపీట వేశారు. పై వర్గాలకు బహుశా ఏ పార్టీకూడా ఇంత పెద్ద ఎత్తున పదవులు కేటాయించలేదేమో.




జగన్ తాజా నిర్ణయం తెలుగుదేశంపార్టీ మీద తీవ్ర ప్రభావమే చూపుతుందనటంలో సందేహంలేదు. ఎందుకంటే చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు బీసీలకు, మహిళలకు, యువతకు ఇన్ని పదవులను కేటాయించలేదన్నది వాస్తవం. ఎంతసేపు సొంత సామాజికవర్గం పెత్తనం, వారసులకే పదవులు కట్టబెట్టేవారు. దాంతో మహిళలు, యువతలో అసంతృప్తి పెరిగిపోయేది. అయినా చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు. చివరకు చిత్తుగా ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత భర్తీచేసిన పార్టీ పదవుల్లో కూడా యువత, మహిళలు, బీసీలకు ఈ స్ధాయిలో పదవులు కేటాయించలేదు. చంద్రబాబు దృష్టిలో యువతంటే కేవలం వారుసులు మాత్రమే. బీసీలంటే సీనియర్లు మాత్రమే. అధికారంలో ఉన్నంత కాలం చాలా వర్గాలను అసలు దగ్గరకే రానీయలేదు. అలాంటిది జగన్ తాజా నిర్ణయంతో చంద్రబాబుకు వ్యక్తిగతంగానే కాకుండా టీడీపీ మీద కూడా నెగిటివ్ ప్రభావం చూపటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలోనే జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో జగన్ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందో గమనించాలి.




'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?

జగన్ తోనే జగన్ కి పోటీయా.. ఎక్కడ ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>