PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-appreciates-ap-police8ea1fbf6-4037-4470-a491-2f7646d6c71e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-appreciates-ap-police8ea1fbf6-4037-4470-a491-2f7646d6c71e-415x250-IndiaHerald.jpgఏపీలో పోలీసుల పనితీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ, ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ కి అవార్డుల మీద అవార్డులొస్తున్నాయి. 14 నెలల కాలంలో జాతీయ స్థాయిలో 125 అవార్డులు ఏపీ పోలీస్ విభాగం సొంతం చేసుకుంది. ఈ ఏడాది 17 జాతీయ స్థాయి అవార్డుల మన అధికారులు అందుకున్నారు. ఇతర రాష్ట్రాలకు ఏపీ రోల్‌ మోడల్‌ గా నిలుస్తోంది. తాజాగా రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని జాతీయస్థాయిలోని మూడు సంస్థలు అవార్డులు ప్రకటించాయి.cm jagan, gautham sawang, ap police,;technology;gautham new;gautham;mithra;tiru;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;jagan;andhra pradesh;police;traffic policeశెహభాష్ ఏపీ పోలీస్.. జగన్ ప్రశంస..శెహభాష్ ఏపీ పోలీస్.. జగన్ ప్రశంస..cm jagan, gautham sawang, ap police,;technology;gautham new;gautham;mithra;tiru;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;jagan;andhra pradesh;police;traffic policeMon, 22 Mar 2021 08:00:00 GMTఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ కి అవార్డుల మీద అవార్డులొస్తున్నాయి. 14 నెలల కాలంలో జాతీయ స్థాయిలో 125 అవార్డులు ఏపీ పోలీస్ విభాగం సొంతం చేసుకుంది. ఈ ఏడాది 17 జాతీయ స్థాయి అవార్డుల మన అధికారులు అందుకున్నారు. ఇతర రాష్ట్రాలకు ఏపీ రోల్‌ మోడల్‌ గా నిలుస్తోంది. తాజాగా రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని జాతీయస్థాయిలోని మూడు సంస్థలు అవార్డులు ప్రకటించాయి. దేశంలోనే ఉత్తమ డీజీపీ అవార్డు గౌతమ్ సవాంగ్ కి దక్కింది.

ఆపదల్లో ఉన్నప్పుడు పౌరులకు అందించే సేవలలో ఏపీ పోలీస్‌ శాఖ, దానికి అనుబంధంగా ఉన్న అన్ని విభాగాల్లో మెరుగైన సేవలు అందిస్తోంది. ఈ సేవలకు గాను, ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఫిక్కీ) స్మార్ట్‌ ఇన్నోవేటివ్‌ పోలీసింగ్‌ స్టేట్‌ అనే అవార్డు ప్రకటించింది. పోలీసుల సామర్థ్యం పెంచేందుకు పూర్తిగా డిజిటలైజ్‌ చేయడంలో అత్యంత ప్రతిభ కనపరిచినందుకు రాష్ట్ర పోలీసు శాఖకు ఈ అవార్డు దక్కింది.

దేశంలోనే అత్యంత వేగంగా 85శాతం కేసుల దర్యాప్తు పూర్తిచేసినందుకు గాను ఇంపాక్ట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అనే అవార్డు కూడా ఏపీ పోలీస్ విభాగానికి దక్కింది. కేసుల దర్యాప్తులో సాంకేతిక సాక్ష్యాలు సేకరించడంలో ఏపీ పోలీసుల పనితీరు అద్భుతం అనే కితాబిచ్చారు కూడా. దిశ పోలీస్ స్టేషన్ల విషయంలో కూడా ఏపీ పోలీస్ విభాగానికి అవార్డు దక్కింది. సంవత్సర కాల వ్యవధిలోనే 1,551 కేసులలో చార్జిషీట్లు దాఖలు చేయడం, విచారణ త్వరగా పూర్తి చేసినందుకు ఈ అవార్డు ఇచ్చారు. మహిళలకు హెల్ప్‌ డెస్క్‌, సైబర్ మిత్ర, కోర్టు బ్లేజ్, దేవాలయాల పరిరక్షణకు తీసుకున్న చర్యలకు కూడా అవార్డులు అందాయి. ఇక పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ కి అందిన పురస్కారం తిరుగులేనిది. దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా గౌతమ్ సవాంగ్ కి అవార్డు వచ్చింది.

ఈ అవార్డులు రావడంతో సీఎం జగన్, ఏపీ పోలీస్ విభాగాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. మహిళలు, చిన్నారులు, వెనుకబడిన వర్గాలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్న రాష్ట్ర పోలీసు శాఖ పనితీరు అభినందనీయమని అన్నారు జగన్. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆధునిక టెక్నాలజీని వినియోగించడం, దాని ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ చేరేలా కృషిచేస్తున్నారని ప్రశంసించారు. అవార్డులతో ఏపీ పోలీస్ పనితీరు దేశవ్యాప్తంగా తెలిసిందని చెప్పారు. 


తిరుప‌తిలో వైసీపీ గెల‌వ‌డం క‌ష్ట‌మే

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>