Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/robbery41a66556-b9ca-443f-8892-48ce76284370-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/robbery41a66556-b9ca-443f-8892-48ce76284370-415x250-IndiaHerald.jpgఎంత పెద్ద గజదొంగైనా.. సామాన్యులను మాత్రమే దోచుకుంటాడు. అయితే ఓ దొంగ మాత్రం ఏకంగా మరో దొంగ వద్దే దొంగతనం చేయబోయాడు. అసలే దొంగ కావడంతో దీనిని పసిగట్టేసిన రెండో దొంగ అతడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. అయితే ఇద్దరూ దొంగలేనని గుర్తించిన పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి సెల్‌లో వేశారు. ఈ విచిత్రమైన ఘటన..robbery;mithra;toyota;police;car;thief;march;dongaదొంగనే దోచుకోబోయాడు.. దొరికిపోయాడు..దొంగనే దోచుకోబోయాడు.. దొరికిపోయాడు..robbery;mithra;toyota;police;car;thief;march;dongaMon, 22 Mar 2021 15:35:38 GMTన్యూయార్క్‌: ఎంత పెద్ద గజదొంగైనా.. సామాన్యులను మాత్రమే దోచుకుంటాడు. అయితే ఓ దొంగ మాత్రం ఏకంగా మరో దొంగ వద్దే దొంగతనం చేయబోయాడు. అసలే దొంగ కావడంతో దీనిని పసిగట్టేసిన రెండో దొంగ అతడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. అయితే ఇద్దరూ దొంగలేనని గుర్తించిన పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి సెల్‌లో వేశారు. ఈ విచిత్రమైన ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మార్చి 10వ తేదీన షమారి జే రియెడ్‌ అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి టయోటా ఆర్‌ఏవీ4లో వెళుతున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత రోడ్డు పక్కన ఓ యువకుడు తన కారు టైర్ పంక్చర్ కావడంతో దానిని మార్చేందుకు తెగ కష్టపడుతున్నాడు. దీంతో వారు అతడికి సాయం చేయాలని అనుకున్నారు.

కారులో నుంచి స్నేహితులంతా కిందకు దిగారు. ఆ యువకుడి పేరు టికైల్‌ విల్సన్‌ అని తెలుసుకుని, తాము సాయం చేస్తామని చెప్పి టైరు మార్చే పనిలో నిమగ్నమయ్యాడు. అయితే వారు కారు టైరు మారుస్తూ ఉండగా టికైల్‌.. ఉన్నట్లుండి వారి కారును దొంగిలించబోయాడు. అందులో ఎక్కి చెక్కేయబోయాడు. కానీ అతడి అదృష్టం అడ్డం తిరిగింది. కారును రివర్స్‌ చేయగానే పుట్‌పాత్‌ను ఢీకొట్టి ఎటూ కదలకుండా నిలబడిపోయింది.

ఈ హఠాత్పరిణామంతో షాకయిన రియాడ్, అతడి ఫ్రెండ్స్ వెంటనే తమ కారు వద్దకు చేరుకున్నారు. రియెడ్‌ తన కారులోకి చేరి హ్యాండ్‌ గన్‌తో టికైల్‌ను నిలువరించాడు. అంతలో పక్కనే ఉన్న పోలీసులు అక్కడకు చేరుకుని టైకెల్‌పై కేసు నమోదు చేశారు. అయితే రియెడ్‌ మాత్రం కేసు పెట్టడానికి నిరాకరిస్తుండడంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో కారు ఓనర్ అతడేనా కాదా..? అని పరిశీలించారు. దీంతో ఈ సారి షాక్ వారికి తగిలింది. ఆ కారు రియెడ్‌ది కాదని, రియెడ్‌ కూడా ఓ దొంగేనని, సదరు టయోటా కారును ప్రిన్స్‌ జార్జ్‌ కౌంటీనుంచి అతడు దొంగిలించాడని గుర్తించారు. దీంతో టికైల్‌, రియెడ్‌లను అరెస్ట్‌ చేశారి సెల్‌లో వేశారు. అయితే చివరికి వ్యక్తిగత పూచీకత్తు మీద వదిలిపెట్టారు.


చావు కబురు చల్లగా సినిమా కాపీ పై దర్శకుడు స్పందన..ఏమన్నాడు అంటే?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?

జనసేన నేతలకు పవన్ షాక్ ఇస్తారా...?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>