MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movie-industry-gossipd6799187-c907-47b7-aacb-4e75ff847ec4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movie-industry-gossipd6799187-c907-47b7-aacb-4e75ff847ec4-415x250-IndiaHerald.jpg2020 సంవత్సరం మనము ఎప్పటికీ మరచిపోలేము, గతంలో ఎలాగైతే స్పానిష్ ఫ్లూ తన వినాశనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందో అంతకు మించిన బీభత్సాన్ని సృష్టించింది కరోనా మహమ్మారి. దీని ప్రభావంతో దిక్కు తోచని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో, అన్ని రంగాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. movie industry gossip;nani;anoushka;suresh;keerthi suresh;kirti;raj;sudigali sudheer;tarun;india;korcha;industries;cinema;cinema theater;hollywood;2020;central government;raj tarun;v;tarun kumar2020 లో ఓటిటిలో వచ్చినవి ఇప్పుడు థియేటర్లోకి...?2020 లో ఓటిటిలో వచ్చినవి ఇప్పుడు థియేటర్లోకి...?movie industry gossip;nani;anoushka;suresh;keerthi suresh;kirti;raj;sudigali sudheer;tarun;india;korcha;industries;cinema;cinema theater;hollywood;2020;central government;raj tarun;v;tarun kumarMon, 22 Mar 2021 12:00:00 GMT2020 సంవత్సరం  మనము ఎప్పటికీ మరచిపోలేము, గతంలో ఎలాగైతే స్పానిష్ ఫ్లూ తన వినాశనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందో అంతకు మించిన బీభత్సాన్ని సృష్టించింది కరోనా మహమ్మారి. దీని ప్రభావంతో దిక్కు తోచని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో, అన్ని రంగాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఈ సందర్భంలో మానవుడికి వినోద సాధనం అయిన సినిమాలను చూడడానికి లేకుండా అన్ని థియేటర్లను మూసి వేశారు. దీనితో ఎంటర్టైన్మెంట్ కూడా అటకెక్కి కూర్చుంది. ఇదే సమయంలో మేమున్నాం అంటూ ఓటిటి ప్లాట్ ఫామ్ లు వచ్చాయి. దీనితో సినిమా ప్రేక్షకులకు కొంత ఊరటనిచ్చాయని చెప్పాలి.

ఈ నేపథ్యంలో కరోనాకు ముందు షూటింగు జరుపుకున్న సినిమాలను ఓటిటి వేదికగా విడుదల చేస్తూ వచ్చారు.  దీనితో కొన్ని సినిమాలకు లాభం చేకూరగా మరి కొన్ని సినిమాలు మాత్రం చతికిలబడ్డాయి. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయ్యి సినిమా పరిశ్రమ ఎప్పటిలాగే కళకళ లాడుతోంది. దీని కారణంగా ప్రస్తుతం ఓటిటిలో విడుదలయిన సినిమాలన్నీ థియేటర్లో విడుదల అవుతాయా అనే చర్చ ప్రారంభం అయింది. ఒక వేళ విడుదల చేసినా జనం థియేటర్ కి వస్తారా అన్న సందేహాలు వెలువడుతున్నాయి. థియేటర్లో విడుదల కావాల్సిన చాలా పెద్ద సినిమాలు ఓటిటిలో విడుదల అయ్యాయి.

ఈ సినిమాలలో ముఖ్యంగా నాని సుధీర్ ల కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ "వి" సినిమా ముందుంటుంది. అనుష్క నటించిన నిశ్శబ్దం, రాజ్ తరుణ్ ఒలేయ్ బుజ్జిగా మరియు కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా, పెంగ్విన్ చిత్రాలు ఉన్నాయి. అంతే కాకుండా హాలీవుడ్ చిత్రాలు సైతం ఓటిటిలో విడుదల అయ్యాయి. ఇందులో ముఖ్యంగా నోలాన్ టెనెట్ చిత్రం కేవలం కొన్ని థియేటర్లలో మాత్రమే విడుదల అయ్యి తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ అయ్యింది. మ్యూజికల్ ఎంటర్ టైనర్ "హ్యామిల్టన్" చిత్రం కూడా  డిస్నీ ప్లస్ లో స్ట్రీమింగ్ అయ్యింది.  డిస్నీ యానిమేషన్ మూవీ సోల్ కూడా స్ట్రీమ్ అయ్యింది. ఇల్లాంటి ఎన్నో సినిమాలు థియేటర్లో విడుదల అవుతాయా..ఒకవేళ అయితే ప్రజలు వీటిని ఆదరిస్తారా చూడాలి.


అఖిల ప్రియ విషయంలో బాబు ఇబ్బంది పడుతున్నారా...?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>