PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-cidf50691f1-2bb6-4128-8539-dcfc5f5c7e8d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-cidf50691f1-2bb6-4128-8539-dcfc5f5c7e8d-415x250-IndiaHerald.jpgఅమరావతిలో రాజధాని పేరుతో దళితుల భూముల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ చంద్రబాబు, నారాయణపై సీఐడీ కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే వారిపై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేస్తే ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. చంద్రబాబు, నారాయణ అక్రమాలు చేసారనడానికి సాక్ష్యలు ఏమన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. 4 వారాల తర్వాత విచారణ చేస్తామని చెప్పింది. అయితే అసలు భూసేకరణ సమయంలో చంద్రబాబు తీసుకున్న ఓ ముందు జాగ్రత్త వల్లే ఇప్పుడు చంద్రబాబుకు స్టే వచ్చిందన్న వాదన వినిపిస్తుంది. ముందు ముందు ఇలాంటి లీగల్ సమస్యలు రాకూడదనchandrababu-cid;cbn;hari;hari music;amaravati;andhra pradesh;telugu;government;capital;minister;ycp;mantraషాకింగ్ - ఆ ముందు చూపే చంద్రబాబును సీఐడీ కేసు నుంచి కాపాడిందా..?షాకింగ్ - ఆ ముందు చూపే చంద్రబాబును సీఐడీ కేసు నుంచి కాపాడిందా..?chandrababu-cid;cbn;hari;hari music;amaravati;andhra pradesh;telugu;government;capital;minister;ycp;mantraMon, 22 Mar 2021 00:00:00 GMTరాజధాని పేరుతో దళితుల భూముల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ చంద్రబాబు, నారాయణపై సీఐడీ కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే వారిపై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేస్తే ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. చంద్రబాబు, నారాయణ అక్రమాలు చేసారనడానికి సాక్ష్యలు ఏమన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. 4 వారాల తర్వాత విచారణ చేస్తామని చెప్పింది. అయితే అసలు భూసేకరణ సమయంలో చంద్రబాబు తీసుకున్న ఓ ముందు జాగ్రత్త వల్లే ఇప్పుడు చంద్రబాబుకు స్టే వచ్చిందన్న వాదన వినిపిస్తుంది.

ముందు ముందు ఇలాంటి లీగల్ సమస్యలు రాకూడదనే చంద్రబాబు ముందు జాగ్రత్తలు తీసుకున్నారట. సీఆర్‌డీఏ చట్టం రూపొందించేటప్పుడే.... భూమి సేకరణలో ఎటువంటి అవకతవకలు, అవినీతి జరిగినా మంత్రులపైగానీ, అధికారులపై గానీ ఎటువంటి కేసులు పెట్టరాదని సీఆర్‌డీఏ చట్టంలో సెక్షన్‌ 146 చేర్చారట. ఈ అక్రమాలు చేయడానికి చంద్రబాబు అనుచరులు ముందుగానే సిద్దపడ్డారని అందుకే ఈ సెక్షన్ చేర్చారని ఇప్పుడు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అమరావతి భూముల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు డిమాండ్‌ చేశారు. భూమి సేకరణలో ఎటువంటి అవకతవకలు, అవినీతి జరిగినా మంత్రులపైగానీ, అధికారులపై గానీ ఎటువంటి కేసులు పెట్టరాదని సీఆర్‌డీఏ చట్టంలో సెక్షన్‌ 146 చేర్చినపుడే ఈ అక్రమాలు చేయడానికి చంద్రబాబు అనుచరులు సిద్దపడ్డారని అన్నారు.  గత 5 సంవత్సరాల సూపర్‌ ముఖ్యమంత్రిగా, ఒక నియంతలా అమరావతిపై అధికారం చెలాయించింది మాజీ మంత్రి నారాయణ కాదా? అని ప్రశ్నించారు.

అంతేకాదు.. సీఆర్‌డీఏని మాజీమంత్రి నారాయణ తన సొంత ఎస్టేట్‌లా వాడుకున్నారని దాడి అన్నారు. అమరావతి భూముల విషయంలో స్టే తెచ్చుకున్న చంద్రబాబు స్టేను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అయినా లీగల్‌ గా చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరన్న వాదన ఉంది. ఇక ఇప్పుడు సీఐడీ కేసుల విషయంలోనూ  మరోసారి అదే రుజువు అయ్యిందంటున్నారు  విశ్లేషకులు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>