MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/katti-kantaravu448c355c-5fd9-4f77-9f2f-b8487f29181e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/katti-kantaravu448c355c-5fd9-4f77-9f2f-b8487f29181e-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి నటుడు కత్తి కాంతారావు గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. కేవలం జానపద హీరోగానే కాకుండా.. పౌరాణిక పాత్రల్లో నారదుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఎన్నో జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో కథానాయకుడిగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన అనితర సాధ్యుడిగా పేరు సంపాదించాడు. katti kantaravu;ntr;indra;krishna;ramu;tiru;tollywood;cinema;tamil;kannada;tiger;hero;nandamuri taraka rama rao;reddy;katthiకత్తి కాంతారావు‌ను టాలీవుడ్ ఇండస్ట్రీలో అణగదొక్కారా.. !కత్తి కాంతారావు‌ను టాలీవుడ్ ఇండస్ట్రీలో అణగదొక్కారా.. !katti kantaravu;ntr;indra;krishna;ramu;tiru;tollywood;cinema;tamil;kannada;tiger;hero;nandamuri taraka rama rao;reddy;katthiMon, 22 Mar 2021 12:00:00 GMTకత్తి కాంతారావు గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. కేవలం జానపద హీరోగానే  కాకుండా.. పౌరాణిక పాత్రల్లో నారదుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఎన్నో జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో కథానాయకుడిగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన అనితర సాధ్యుడిగా పేరు సంపాదించాడు.

ఇక ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లు తిరుగులేని హీరోలుగా వెలిగిపోతుంటే వారితో సమానమైన స్థాయిలో హీరోగా నిలబడిన ఏకైక నటుడు కాంతారావు. కత్తి పట్టిన జానపద వీరుడంటే ఇప్పటికీ మనకు గుర్తుకు వచ్చేది కాంతారావే. తెలుగు చిత్రసీమలో రాముడు, కృష్ణుడు పాత్రలంటే ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తాడో... నారద పాత్రలకు కాంతారావు అంతే పేరు సాధించాడు. కేవలం నారద పాత్రలే కాదు.. రాముడు, కృష్ణుడు, ఇంద్రుడు మొదలైన పౌరాణిక పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసారాయన.

అయితే సినిమా అవకాశాల కోసం ఎన్నో కష్టాలు అనుభవించిన కాంతారావు టాకీ పులి హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతిజ్ఞ’తో హీరోగా పరిచయం అయ్యారు. ‘ప్రతిజ్ఞ’తర్వాత.. కాంతారావు వెనుదిరిగి చూసుకోలేదు. విఠలాచార్య తొలి తెలుగు చిత్రం ‘కన్యాదానం’ నుంచి వీరిద్దరి అనుబంధం మొదలై... అలా కొనసాగుతూ వచ్చింది. దాదాపు 500 చిత్రాలలో ఆయన నటించారు. కాంతారావు నటనా పటిమా తెలుగు చిత్రాల వరకే పరిమితం కాలేదు. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నటించి అక్కడి వారి  ప్రేక్షకాభిమానం సైతం పొందిన ఘనత కాంతారావుది. మలయాళంలో ‘భక్త కుచేల’ లో కృష్ణుడిగా నటించి.. కణ్ణన్‌గా ప్రశంసలు పొందాడు.

ఇక వయస్సు పై బడిన తర్వాత.. కాంతారావుకు హీరో వేషాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కేవలం కథానాయకుడిగానే కాకుండా.. కాలానుగుణంగా వివిధ పాత్రలు పోషించాడాయన. అగ్ర హీరోల సరసన మరో అగ్ర నటుడిగా వెలుగొందిన ఆయన.. ఆస్తుల విషయానికి వస్తే, ఆ స్థాయిలో కూడబెట్టలేదనే చెప్పాలి. కాంతారావు సంపాదించిన అమూల్యమైన ఆస్తి ఏదైనా వుందంటే అది ప్రజాభిమానమే. న్టీఆర్, ఏఎన్నార్ల  సరసన నిలచిన హీరోగా పేరు సాధించాడు. అయినా కాంతారావు పట్ల చిత్రపరిశ్రమ  నిర్లక్ష్యవైఖిరి అవలంబించింది. ఇక్కడ మాములు ఆర్టిస్టులకు సొంత ఇల్లు ఉన్న ఇండస్ట్రీలో...  తెలుగు చిత్రసీమలో నెంబర్ వన్ హీరోలకు పోటీ ఇచ్చిన కాంతారావుకు కనీసం సొంత ఇల్లు కూడా లేదు.


అఖిల ప్రియ విషయంలో బాబు ఇబ్బంది పడుతున్నారా...?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>