Hyderabad
oi-Shashidhar S
కరోనా వేవ్ మళ్లీ మొదలైంది. కేసులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక యుకే, అమెరికా ఇతర దేశాల నుంచి వచ్చేవారిపై ఫోకస్ చేశారు. కరోనా స్ట్రెయిన్ అక్కడే ఎక్కువగా ఉంది. అయితే ఇటీవల కొందరు హైదరాబాద్ చేరుకున్నారు. వారు బయల్దేరే సమయంలో కరోనా నెగిటివ్ ఉండగా.. దిగాక పాజిటివ్ వస్తోంది. దీంతో గందరగోళం నెలకొంది.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే పరీక్ష చేయగా పాజిటివ్ వస్తోంది. అయితే వారి వెంట తీసుకొస్తోన్న రిపోర్ట్ మాత్రం నెగిటివ్ ఉంటోంది. యూకే నుంచి వచ్చిన వారిని తప్పకుండా పరీక్షిస్తున్నామని తెలిపారు. యూఎస్, సింగపూర, మాల్దీవుల నుంచి వచ్చేవారు 72 గంటల ముందు ఆర్టీ పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇలాంటి వారిని కూడా దిగాక పరీక్ష చేయగా పాజిటివ్ వస్తోంది. అయితే వారి డేటా మాత్రం తమ వద్ద లేదని వివరించారు.

భారత్ వచ్చేవారు ఫేక్ రిపోర్ట్ కూడా తీసుకున్నారనే అనుమానాలు వస్తున్నాయి. మరికొందరు విమాన ప్రయాణం చేయడంతో వైరస్ సోకిందా అనే సందేహాలు వస్తున్నాయి. కొందరికీ నెగిటివ్ వచ్చిందంటే.. వారికి పాజిటివ్ వచ్చిందనే భావించాల్సి ఉంటుంది. గత 24 గంటల్లో తెలంగాణలో 394 కరోనా కేసులు వచ్చాయి. 3.03 లక్షల మందిని పరీక్షించారు. హైదరాబాద్, సమీప జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. కరోనా కేసులు పెరగడంతో స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఇప్పటివరకు 200 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు.