PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balaf3cfbfa3-ee7c-4c39-98cd-aa2c4eb5272b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balaf3cfbfa3-ee7c-4c39-98cd-aa2c4eb5272b-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ వ్యవహారాల విషయంలో నందమూరి బాలకృష్ణ గత కొంతకాలంగా ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత బాలకృష్ణ కాస్త ప్రజల్లోకి వెళ్లి అంశం గురించి ఆసక్తికరంగానే వ్యవహరిస్తున్నారంటూ కొంతమంది టీడీపీ నేతలు అంటున్నారు. ఈ మధ్య కాలంలో కృష్ణా జిల్లా నేతలతో ఆయన వరుసగా మాట్లాడుతున్నారని అందరికీ కూడా ఫోన్ చేసి పరిస్థితి గురించి అడుగుతున్నారని టాక్. అలాగే గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా నేతలతో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారని అంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోbalakrishna,tdp,ap;balakrishna;telugu desam party;krishna river;district;telugu;smart phone;nandamuri balakrishna;krishna district;tdp;prakasam district;prakasm;nandamuri taraka rama rao;partyఅందరికి ఫోన్లు చేస్తున్న బాలయ్య...?అందరికి ఫోన్లు చేస్తున్న బాలయ్య...?balakrishna,tdp,ap;balakrishna;telugu desam party;krishna river;district;telugu;smart phone;nandamuri balakrishna;krishna district;tdp;prakasam district;prakasm;nandamuri taraka rama rao;partyMon, 22 Mar 2021 11:00:00 GMTతెలుగుదేశం పార్టీ వ్యవహారాల విషయంలో నందమూరి బాలకృష్ణ గత కొంతకాలంగా ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత బాలకృష్ణ కాస్త ప్రజల్లోకి వెళ్లి అంశం గురించి ఆసక్తికరంగానే వ్యవహరిస్తున్నారంటూ కొంతమంది టీడీపీ నేతలు అంటున్నారు. ఈ మధ్య కాలంలో కృష్ణా జిల్లా నేతలతో ఆయన వరుసగా మాట్లాడుతున్నారని అందరికీ కూడా ఫోన్ చేసి పరిస్థితి గురించి అడుగుతున్నారని టాక్. అలాగే గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా నేతలతో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారని అంటున్నారు.

కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచన ఉన్న నేపథ్యంలో వాళ్లకు వ్యక్తిగతంగా బాలకృష్ణ నుంచి భరోసా వస్తుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఇప్పుడు పార్టీని ముందుకు నడిపించే విషయంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తే బాగుంటుందనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకే నందమూరి బాలకృష్ణ కొన్ని కొన్ని అంశాలలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని అంటున్నారు. కొంతమంది అసంతృప్త నేతలు విషయంలో ఆయన ఎక్కువగా జోక్యం చేసుకొని వాళ్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది.

కార్యకర్తలలో కూడా ధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో... వాళ్ల విషయంలో స్పష్టమైన హామీ బాలకృష్ణ నుంచి వెళ్తుంది అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి ఒక్కరు వెళ్ళినా సరే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అందుకే బాలకృష్ణ కాస్త జాగ్రత్తగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా బాలకృష్ణ విషయంలో ముందడుగు వేసే అవకాశాలు ఉండవచ్చని టిడిపి వర్గాలు అంటున్నాయి. మరి ఈ విషయంలో ఏ విధంగా విజయం సాధిస్తారో చూడాలి. ఇక అనంతపురం జిల్లాలో ఉన్న కొంతమంది నేతలు బయటకు రాకపోవడంతో వాళ్ళతో కూడా బాలకృష్ణ చర్చలు జరుపుతున్నారు.


ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు వెళ్తే.. చివరికి ప్రాణం పోయింది..?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>