PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైనది అనే చెప్పాలి. ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఓడిపోయే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీ నేతలు అంచనాలు వేశారు. అయితే అనుకున్న విధంగా పరిస్థితి కనబడడం లేదనే చెప్పాలి. భారతీయ జనతాపార్టీ కొన్ని కొన్ని విషయాల్లో ఘోరంగా వెనకబడి ఉందనే విషయం స్పష్టంగా అరbjp,ts;kcr;bhavana;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;nalgonda;partyతెలంగాణా బిజెపికి జ్ఞానోదయం అయిందా...?తెలంగాణా బిజెపికి జ్ఞానోదయం అయిందా...?bjp,ts;kcr;bhavana;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;nalgonda;partyMon, 22 Mar 2021 20:00:00 GMTటీఆర్ఎస్ పార్టీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైనది అనే చెప్పాలి.  ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఓడిపోయే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీ నేతలు అంచనాలు వేశారు. అయితే అనుకున్న విధంగా పరిస్థితి కనబడడం లేదనే చెప్పాలి. భారతీయ జనతాపార్టీ కొన్ని కొన్ని విషయాల్లో ఘోరంగా వెనకబడి ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ప్రధానంగా నల్గొండ వరంగల్ నియోజకవర్గం పరిధిలో భారతీయ జనతా పార్టీ నేతలు సమర్థవంతంగా ప్రచారం చేయలేకపోయారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేయడానికి ముందుకు రాకపోవడంతో కార్యకర్తలు కూడా ఒకరకంగా ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని కొన్ని అంశాల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏకపక్షంగా వ్యవహరించడం కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానంగా నియోజకవర్గాల్లో ఇబ్బంది పెట్టిన అంశంగా చెప్పుకోవచ్చు.

టీఆర్ఎస్  పార్టీని విమర్శించే విషయంలో బీజేపీ నియోజకవర్గ స్థాయి నేతలు ఘోరంగా విఫలమయ్యారు అనే భావన కూడా కొంతమందిలో వ్యక్తమైంది. ఇక బీజేపీ కొన్ని కొన్ని అంశాల్లో జాగ్రత్త పడవలసిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా సీఎం కేసీఆర్ ని ఎదుర్కోవాలి అంటే అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ఒకరు ఇద్దరు కలిసి పోరాటం చేయడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు అనే వ్యాఖ్యలను కొంతమంది రాజకీయ పరిశీలకులు చేస్తున్నారు. బీజేపీ  లో ఉన్న కొంతమంది కీలక నేతల మధ్య విభేదాలు ఉండడం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు.


టాలీవుడ్ గాసిప్స్: రామ్ చరణ్, రవితేజ మల్టీస్టారర్ మూవీ.. అందులో విజయ్ సేతుపతి కూడానా..?

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>