MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kantarao41dd04c9-a6f2-467a-a0bb-facaff90778e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kantarao41dd04c9-a6f2-467a-a0bb-facaff90778e-415x250-IndiaHerald.jpgటీఎల్ కాంతారావు తెలంగాణా నుంచి తొలి తరం నటుడు. ఎన్టీయార్, ఏయన్నార్ లతో సరిసమానమైన స్టార్ ఇమేజ్ ని సంపాదించిన నటుడు. కత్తుల కాంతారావు అని పేరు. ఆయన కట్తి పడితే ఆ సినిమా సూపర్ హిట్. జానపద కధా నాయకుడిగా కాంతారావుని మించి ఎవరినీ ఊహించుకోలేరు. ఇక పౌరాణికాల్లో నారదుడు పాత్రకు కాంతారావు ని మించిన సూటబుల్ యాక్టర్ టాలీవుడ్ లో ఇంతవరకూ పుట్టలేదు అంటే అతిశయోక్తి కాదు. kantarao;ntr;swati;tabu;jeevitha rajaseskhar;swathi;hyderabad;tollywood;cinema;nalgonda;producer;november;chennai;lakshmi devi;producer1;tadepalli;march;lavakusaకాంతారావు కెరీర్ ని దెబ్బ కొట్టిన ఆ అయిదూ ఏంటంటే ?కాంతారావు కెరీర్ ని దెబ్బ కొట్టిన ఆ అయిదూ ఏంటంటే ?kantarao;ntr;swati;tabu;jeevitha rajaseskhar;swathi;hyderabad;tollywood;cinema;nalgonda;producer;november;chennai;lakshmi devi;producer1;tadepalli;march;lavakusaMon, 22 Mar 2021 11:09:34 GMTఎన్టీయార్, ఏయన్నార్ లతో సరిసమానమైన స్టార్ ఇమేజ్ ని సంపాదించిన నటుడు. కత్తుల కాంతారావు అని పేరు. ఆయన కట్తి పడితే ఆ సినిమా సూపర్ హిట్. జానపద కధా నాయకుడిగా కాంతారావుని మించి ఎవరినీ ఊహించుకోలేరు. ఇక పౌరాణికాల్లో నారదుడు పాత్రకు కాంతారావు ని మించిన సూటబుల్ యాక్టర్ టాలీవుడ్ లో ఇంతవరకూ పుట్టలేదు అంటే అతిశయోక్తి కాదు.

తాడేపల్లి లక్ష్మీ కాంతారావు 1923 నవంబర్ 16న నల్గొండ జిల్లాలో పుట్టారు. ఆయన 1950 లలో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆయన ప్రతిజ్ఞ సినిమాలో ఫస్ట్ హీరోగా చేశారు. ఆ తరువాత వరసగా హిట్లు వచ్చాయి. కాంతారావు ఎక్కువగా జానపద జానర్ లోనే సినిమాలు చేశారు. అవన్నీ కూడిన విఠలాచార్య డైరెక్షన్ లో వచ్చి సూపర్ హిట్లు అయ్యాయి. ఇక కాంతారావు రామారావు లవకుశ సినిమాలో లక్ష్మణుడు పాత్ర వేశారు. ఆ సినిమాలో కాంతారావు పాత్రకు ఎన్నో అవార్డులు ప్రశంసలు దక్కాయి. లక్ష్మణుడు అంటే ఈయనే అనిపించేలా కాంతారావు నటన ఉంటుంది. ఇక కాంతారావు హీరోగా మంచి పీక్స్ లో ఉన్న టైమ్ లో చేసిన ఒక పొరపాటు కారణంగా కెరీర్ లో దారుణాలను చూశారు.


ఆయన తాను నిర్మాతగా అయిదు సినిమాలు తీశారు. అవన్నీ కూడా ఒకదానితో పోటీ పడి మరొక‌టి పరాజయం పాలు అయ్యాయి. దాంతో కాంతారావు తాను సంపాదించినది అంతా కోల్పోవాల్సివచ్చింది. కాంతారావు ఆ మీదట మద్రాస్ లో ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక 1989లో తీసిన స్వాతి చినుకులు సినిమా ద్వారా కాంతారావు మళ్ళీ నిర్మాత అయ్యారు. అదే ఆయన చివరి సినిమా. దాని కోసం తాను పుట్టిన ఊరిలో ఇల్లు కూడా అమ్మేశారు. మొత్తానికి కెరీర్ లో ఎన్నో విజయాలని చూసిన కాంతారావు చివరికి చిన్న పాత్రలు వేస్తూ కెరీర్ లో పతనాన్ని చూశారు. ఆ విధంగా ఆయన చివరికి ఆర్ధిక ఇబ్బందులు పడుతూ 2009 మార్చి 22న హైదరాబాద్ లో కన్ను మూశారు. ఏది ఏమైనా  ఒక మహానటుడి జీవితంలో విజయాలు, విషాదాలు ఎలా దోబూచులాడుకున్నాయి అనడానికి కాంతారావు ఒక పెద్ద ఉదాహరణ.






ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు వెళ్తే.. చివరికి ప్రాణం పోయింది..?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>