Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli-smashed-sixer-to-a-speedy-bouncer-and-laugheddb538114-bbb2-4d2e-896d-fd91803353db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli-smashed-sixer-to-a-speedy-bouncer-and-laugheddb538114-bbb2-4d2e-896d-fd91803353db-415x250-IndiaHerald.jpgఇంగ్లండ్‌పై వరుస సిరీస్‌లు నెగ్గుతూ టీమిండియా జోరుమీదుంది. తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌ను కూడా 3-2తో కైవసం చేసుకుని ఇంగ్లీష్ జట్టుకు పీడకలను మిగిల్చింది. కాగా.. తొలి నాలుగు మ్యాచ్‌లలో ఇంగ్లండ్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. భారత్‌తో సమానంగా 2 మ్యాచ్‌లలో విజయం సాధించి సిరీస్‌పై ఆశ నిలుపుకుంది. కాగా.. చివరి టీ20లో కోహ్లీ చేసిన ప్రయోగంతో ఇంగ్లండ్ కుదేలైంది. ఎక్స్‌ట్రా బౌలర్‌ను జట్టులోకి తీసుకోవడంతో పాటు రోహిత్ శర్మతో కలిసి కోహ్లీనే స్వయంగా ఓపెనింగ్‌కు..cricket;rohit;virat kohli;icc t20;parugu147కిమీల బౌన్సర్.. సిక్స్ కొట్టి కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ చూస్తే..147కిమీల బౌన్సర్.. సిక్స్ కొట్టి కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ చూస్తే..cricket;rohit;virat kohli;icc t20;paruguMon, 22 Mar 2021 15:06:52 GMTఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌పై వరుస సిరీస్‌లు నెగ్గుతూ టీమిండియా జోరుమీదుంది. తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌ను కూడా 3-2తో కైవసం చేసుకుని ఇంగ్లీష్ జట్టుకు పీడకలను మిగిల్చింది. కాగా.. తొలి నాలుగు మ్యాచ్‌లలో ఇంగ్లండ్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. భారత్‌తో సమానంగా 2 మ్యాచ్‌లలో విజయం సాధించి సిరీస్‌పై ఆశ నిలుపుకుంది. కాగా.. చివరి టీ20లో కోహ్లీ చేసిన ప్రయోగంతో ఇంగ్లండ్ కుదేలైంది. ఎక్స్‌ట్రా బౌలర్‌ను జట్టులోకి తీసుకోవడంతో పాటు రోహిత్ శర్మతో కలిసి కోహ్లీనే స్వయంగా ఓపెనింగ్‌కు దిగాడు. ఈ కొత్త జోడీ ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించింది. మైదానంలో బౌండరీల మోత మోగించింది. ప్రేక్షుకులు లేరు కానీ.. ఉండిఉంటే గ్రౌండ్ అంతా కేకలు, విజిల్స్‌తో హోరెత్తేది. కోహ్లీ కొట్టిన బౌండరీలన్నింటిలో ఓ బౌండరీ గురించే ఇప్పుడు చర్చ సాగుతోంది. భారీ వేగంతో దూసుకొస్తున్న ఆ బంతిని భారీ షాట్ కొట్టడం, ఆ వెంటనే కోహ్లీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

5వ టీ20లో టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ మొదటి నుంచి ఓపెనర్లు రోహిత్, కోహ్లీ ధాటిగా ఆడుతున్నారు. ఇక ఇన్నింగ్స్ 6వ ఓవర్లో ఇంగ్లీష్ బౌలర్ మార్క్ ఉడ్ వేసిన ఓ సూపర్ ఫాస్ట్ బాల్‌ను అంతే వేగంతో కోహ్లీ స్టాండ్స్‌లోకి పంపాడు. 147 కిమీల వేగంతో వచ్చిన ఈ బౌన్సర్‌ను సిక్సర్‌గా మలిచిన కోహ్లీ.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న రోహిత్ వద్దకు పెద్దగా నవ్వుతూ వెళ్లి ఫిస్ట్ ట్యాప్ ఇచ్చాడు. ఈ రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అదీగాక ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ కొట్టిన తొలి సిక్సర్ ఇదే కావడం మరో విశేషం. ఈ మ్యాచులో కోహ్లీ మొత్తమ్మీద రెండు సిక్సర్లు బాదాడు. 7 ఫోర్లు కొట్టాడు. వీటితో కలిపి 52 బంతుల్లో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఇదిలా ఉంటే ఈ సిరస్‌లో విరాట్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. మొత్తం సిరీస్‌లో 3 అర్థ సెంచరీలతో 231 పరుగులు చేసిన కోహ్లీ.. ఈ అవార్డును అందుకున్నాడు. అంతేకాకుండా ఈ సిరీస్‌లోనే కోహ్లీ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా టాప్ ప్లేస్‌లోకి చేరాడు. ఏకంగా 3వేలకు పైగా పరుగులు చేసి ఇప్పటివరకు మరే ఇతర ఆటగాడికీ సాధ్యం కాని ఫీట్‌ను సాధించాడు. అలాగే చివరి టీ20లో రోహిత్ కూడా 64 పరుగులు చేసి టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు.


రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన జాతి రత్నాలు.....

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>